Karthika Damodara Masam | iiQ8 కార్తీక దామోదర మాసము
Karthika Damodara Masam కార్తీక దామోదర మాసము
Dear All, this is Karthika Damodara Masam.
శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదు.
కార్తీక మాసాన్ని దామోదర మాసం శ్రీకృష్ణుడికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో ....
ఓ రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు.
వెంటనే యశోదా దేవి ఆపనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుంధీ. తాను వంట గదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంట గదిలోకి వెళ్తుంది.
తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోడానికి వెళ్లిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు.
బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు.
అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకుని, అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్…
Read more
about Karthika Damodara Masam | iiQ8 కార్తీక దామోదర మాసము