Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?

🔱మహిమాన్విత చలం అరుణాచలం🔱 Arunachalam Mahimalu

 

పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం.

అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.

🔱 సోమవారంనాడు ప్రదక్షిణలు చేస్తే

లోకాలను ఏలే శక్తి లభిస్తుంది.

🔱 మంగళవారం ప్రదక్షిణం చేస్తే
పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల
చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు
శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.

🔱 బుధవారం గిరి
ప్రదక్షిణం చేస్తే లలితకళలలో రాణింపు,
విజయం లభిస్తుంది.

🔱 గురువారం గురువారం
ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.

 


Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి

🔱 ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే

వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.

🔱 శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే
నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.

🔱 ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే

కైలాసప్రాప్తి కలుగుతుంది.

🌸

🔱 సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో గిరి ప్రదక్షిణలు
చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.
🌸

🔱 గిరిని ప్రదక్షిణం చేయడానికి
వేసే మొదటి అడుగుతోనే
ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య
ఫలం లభిస్తుంది.
రెండవ అడుగులో పవిత్ర తీర్ధాలలో స్నానం చేసిన
పుణ్యఫలం లభిస్తుంది.
మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన
పుణ్యం లభిస్తుంది.
నాలుగవ అడుగు వేయగానే
అష్టాంగ యోగం చేసిన
ఫలితం లభిస్తుంది.

Mahishasura Mardini Stotram – !!. మహిషాసురమర్దని స్తోత్రము .!!

 

🌺
తిరువణ్ణామలైలో జరిగే
కార్తీక దీపోత్సవం నాడు
ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు
చేసి వస్తే పాప విమోచనం
లభిస్తుంది.

🌺
భరణీ దీపం రోజున ప్రాతఃకాలమున మూడున్నర
ఘంటలకు ఒక సారి,
ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం
దీపదర్శన సమయాన ఒకసారి రాత్రి 11గం.లకు
ఒకసారి అని ఐదు సార్లు
గిరి ప్రదక్షిణలు చేస్తే
ఘోర పాపాలన్నీ హరిస్తాయి.

🌺
గిరి ప్రదక్షిణం చేసి రాగానే
స్నానం చేయడమో..
నిద్రపోవడమో చేయకూడదు.
వాటివల్ల పుణ్యఫలం
తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.

భగవాన్ స్మృతులు…. చలం …

 

Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి

 

===============
పులిసిన మజ్జిగ
==============

ఆ రోజుల్లోనే ఒక విశేషం జరిగింది. భగవాన్ ఎండాకాలంలో తప్ప మజ్జిగ అన్నంలో పోసుకోరు. అదీ తియ్యని మజ్జిగే. పెరుగుని కాని, పాలను కాని ఉపయోగించరు. చారూ అన్నం లోనే ఒక్క గరిటెడు తియ్యని మజ్జిగ పోసుకుంటారు. ఆ తియ్యని మజ్జిగని ఆశ్రమంలో అందరికీ పొయ్యాలి. అందరికీ చాలకపోతే తానూ తీసుకోరు.

ఓ రోజు రాత్రి మజ్జిగ పులిసింది. “సరే, పులిసింది యెందువల్లనో? ఎవరిని అనేదేముంది? పోసుకోకుండా వుంటే సరిపోతుంది” అని వారు మజ్జిగ పోసుకోలేదు. ఎంత జాగర్త తీసుకున్నా మర్నాటి రాత్రికి పులిసింది మజ్జిగ. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ మర్నాటికీ అంతే అయింది.

 

Mudupu Ela Kattali in Telugu | ముడుపు అంటె ఏమిటి? ఎలా కట్టాలి?

ఆ మధ్యాహ్నం ఆశ్రమంలో పని చేసే మనిషి అర పడి పాలు ఎక్కడినుంచో తెచ్చి యిచ్చాడు.

దాన్ని తోడుపెట్టి వుంచిన సంగతి నాకు జ్ఞాపకము వచ్చింది. అది తియ్యని పెరుగుగా వుంది. ఆ పెరుగు తియ్యమజ్జిగ చేసి అందరికీ పోయాలంటే అది అందరికీ సరిపోదు. అందరికీ పోస్తేనేకాని స్వామి తీసుకోరు. తక్కిన వాళ్లంతా సంవత్సరం పొడుగునా పాలూ పెరుగూ తాగుతారు గదా, ఈ రాత్రికి వాళ్ళకి తేకపోతేనేం? స్వామి ఎప్పుడూ పాలు, పెరుగూ, మట్టిగా తాకరే ఈ కాస్త తియ్యని మజ్జిగ తప్ప!

అదీ ఈ నాలుగు నెలలే. పులిసి పోయిందని ఈ రెండు రోజుల నుంచీ మజ్జిగే పోసుకోలేదు. తక్కినవారు తాగుతూనే వున్నారు. కనక స్వామివారికి తెలీకుండా అయినా సరే ఆయనకి తియ్యని మజ్జిగ వెయ్యాలని నిశ్చయించుకున్నాను.

ఆయన అన్నంలో చారు కలుపుకుని తింటున్నారు. నేను కుడిచేత్తో ఒక గరిటలో ఆ తియ్యని పెరుగు తీసుకుని, ముందుగా ఆ గరిటెడు పెరుగూ స్వామివారి చారూ అన్నంలో పోశాను. పోసి; నేను తడిక పక్కగా నుంచుని ఆయనవంకే చూస్తూన్నాను. ఆయన నోట్లో అన్నం పెట్టుకుని కళ్ళెత్తి నా వంక చూశారు. ఆ చూపు ఈశ్వరుడు మన్మధుణ్ణి చూసిన చూపుమల్లె మండిపోయింది! నా వొళ్ళు గడగడ వొణికింది. భరించలేక లోపలికి వెళ్ళిపోయినాను.

భగవాన్ లోకమ్మను పిలిచి మజ్జిగ పోయించుకుని “అందరూ యిక్కడికి అంత దూరంనించి సమత్వం నేర్చుకోడానికి వచ్చారు. నా దగ్గరికి వొస్తే, అందరూ ఒకే మాదిరి” అంటో అందర్ని కలిపి కోప్పడి సోఫా మీద కూచున్నారు.

మేము మా పని కాగానే ఆయనకు నమస్కరించి వూళ్ళోకి వెళ్ళడానికి భగవాన్ దగ్గిరకి వచ్చినప్పుడు, ఆయన నన్ను చూడగానే మొహం అటువేపు తిప్పుకున్నారు. అప్పుడు నేనేమైపోయినానో ఆయనకే తెలియాలి.🙏

Rameswaram Temple | రామేశ్వరం యొక్క ప్రధాన ఆలయం | रामेश्वरम मंदिर | ராமேஸ்வரம் கோவில்

Spread iiQ8

April 14, 2023 9:39 AM

166 total views, 0 today