Mudupu Ela Kattali in Telugu | ముడుపు అంటె ఏమిటి? ఎలా కట్టాలి?

Mudupu Ela Kattali in Telugu | ముడుపు ఎలా కట్టాలి …

 

🌿🌼🙏#కుబేర #కటాక్షం #కలిగించే #శ్రీ #వేంకటేశ్వర #స్వామి #ముడుపు – అది ఎలా కడతారు

🙏🌼🌿#గోవిందా! అని ఎందుకు తల్చుకోవాలి

🙏🌼🌿#శ్రీ #వారికి #ఎంతో #ఇష్టమైన #గోవింద #నామాలు🙏🌼🌿

🌿🌼🙏వేంకటేశ్వర స్వామి ముడుపు అంటె ఏమిటి – అది ఎలా కడతారు 🙏🌼🌿

🌿🌼🙏పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు . 🙏🌼🌿
🌿🌼🙏ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే… వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు…🙏🌼🌿

🌿🌼🙏ముడుపు ఎలా కట్టాలి …🙏🌼🌿

 

🌿🌼🙏వేంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి…🙏🌼🌿

 

Rameswaram Temple | రామేశ్వరం యొక్క ప్రధాన ఆలయం | रामेश्वरम मंदिर | ராமேஸ்வரம் கோவில்

 

🌿🌼🙏ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది.🙏🌼🌿

🌿🌼🙏#గోవిందా! అని ఎందుకు తల్చుకోవాలి🙏🌼🌿

🌿🌼🙏తెలుగువారికి గోవిందుడంటే వేంకటేశ్వరస్వామే! ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంతదాకా ఎందుకు తిరుపతిలో అడుగుపెడుతూనే ఏడుకొండలన్నీ ఆ గోవిందనామంతో మారుమోగిపోతున్నట్లు తోస్తుంది. ఇంతకీ గోవింద అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే.🙏🌼🌿

🌿🌼🙏#గోకులంనాటి_కథ🙏🌼🌿

🌿🌼🙏విష్ణుమూర్తిని గోవిందుడు అని కూడా పిల్చుకుంటారని తెలిసిందే. ఈ పేరు వెనుక ఓ చిన్న కథ కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుని లీలలలో గోవర్థనగిరిని ఎత్తడం కూడా ఒకటి కదా! గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. గోకులం మీద తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజలంతా తల్లడిల్లుతుంటే, వారిని రక్షించేందుకు గోవర్థనగిరిని తన చిటికెన వేలున ఎత్తి పట్టుకుంటాడు ఆ నల్లనయ్య.🙏🌼🌿

Death Maranam | మరణం

 

🌿🌼🙏ఈ ఘటనతో ఇంద్రుని గర్వం అణగిపోతుంది. తానే స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు.

Mahishasura Mardini Stotram – !!. మహిషాసురమర్దని స్తోత్రము .!!

అటుపై ‘నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని). కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు,’ అని పేర్కొటాడు. అలా కృష్ణుడు ఈ భూలోకం మీద ఉన్న జీవులన్నింటికీ కూడా ఇంద్రునిగా పూజింపబడుతూ ‘గోవిందుడు’ అన్న నామంతో పూజలందుకుంటున్నాడు. 🙏🌼🌿

🌿🌼🙏చాలా అర్థాలే ఉన్నాయి … గో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒక్కటే కాదు, అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి.🙏🌼🌿

🌿🌼🙏#విష్ణుసహస్రనామంలో🙏🌼🌿

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః

🌿🌼🙏అన్న శ్లోకం కనిపిస్తుంది. ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు. అంటే యోగులు విష్ణుపరమాత్మను ఈ లోకానికీ, ఆ లోకం మీద ఉండే జీవులకూ ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తోంది.

 

మరి అలాంటి జీవంతో సంచరించే మనిషికి ఆరోగ్యంతో పాటుగా జ్ఞానం (వేదం) ఉండాలి. మంచిని వ్యాపింపచేసి చెడుని ఖండించే వాక్కు ఉండాలి. అంటే మనకు జీవాన్ని, ఆ జీవానికి పోషణగా నిలిచే లోకాన్ని, ఆ జీవానికి అర్థాన్నిచ్చే వాక్కునీ, తనేమిటో తెలుసుకుని పరమాత్మతో ఐక్యమయ్యేందుకు తోడ్పడే జ్ఞానాన్ని… ప్రసాదించేవాడే ‘గోవిందుడు’ అనుకోవచ్చు. బహుశా అందుకేనేమో శంకరాచార్యులరు ‘భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే’ అంటూ ఆ పరమాత్మను తలచుకోమని హెచ్చరించారు🙏🌼🌿

Mahishasura Mardini Stotram – !!. మహిషాసురమర్దని స్తోత్రము .!!

 

🌿🌼🙏#శ్రీ #వారికి #ఎంతో #ఇష్టమైన #గోవింద #నామాలు🙏🌼🌿

శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా!
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!!
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా!
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా!
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!!
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా!
వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!!
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా!
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!!
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా!
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!!

🌿🌼🙏సప్తాద్రి వాసుడు గోవిందుడు శ్రీ శ్రీనివాసుని
శుభాశీస్సులతో అందరికీ శుభమస్తు.🙏🌼🌿
🌿🌼🙏అందరం భక్తితో ” గోవిందా గోవిందా ” అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం … ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿

Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి


Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा

Spread iiQ8