Valmiki Sampoorna Ramayanam Telugu | iiQ8 | వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం 6 కాండలు

Valmiki Sampoorna Ramayanam Telugu     రామాయణం - Valmiki Sampoorna Ramayanam Telugu పరిచయం 1వ దినము, బాలకాండ 2వ దినము, బాలకాండ 3వ దినము, బాలకాండ 4వ దినము, బాలకాండ 5వ దినము, బాలకాండ 6వ దినము, బాలకాండ 7వ దినము, బాలకాండ 8వ దినము, అయోధ్యకాండ 9వ దినము, అయోధ్యకాండ 10వ దినము, అయోధ్యకాండ 11వ దినము, అయోధ్యకాండ 12వ దినము, అయోధ్యకాండ 13వ దినము, అయోధ్యకాండ 14వ దినము, అయోధ్యకాండ 15వ దినము, అరణ్యకాండ 16వ దినము, అరణ్యకాండ 17వ దినము, అరణ్యకాండ 18వ దినము, అరణ్యకాండ 19వ దినము, అరణ్యకాండ 20వ దినము, అరణ్యకాండ 21వ దినము, అరణ్యకాండ 22వ దినము, కిష్కింధకాండ 23వ దినము, కిష్కింధకాండ 24వ దినము, కిష్కింధకాండ 25వ దినము, కిష్కింధకాండ 26వ దినము, కిష్కింధకాండ 27వ దినము, కిష్కింధకాండ 28వ దినము, కిష్కింధకాండ 29వ దినము, సుందరకాండ 30వ దినము, సుందరకాండ 31వ దినము, …
Read more about Valmiki Sampoorna Ramayanam Telugu | iiQ8 | వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం 6 కాండలు
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 42 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 42   Dear All, Jai Shri Ramm !! Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 42 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ. 42వ దినము, యుద్ధకాండ దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు " నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు " అన్నాడు. తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని " రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాక…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 42 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 41 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 41 Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 41.  41వ దినము, యుద్ధకాండ రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దెగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన అన్నాడు " అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను ' యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో ' అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావ. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్య " అని ఏడిచాడు. అప్పుడు రాముడు " విభీషణ! నీకొక మాట చెబుతాను. నీ అన్నయ్య యు…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 41 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40 Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40.  40వ దినము, యుద్ధకాండ ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన అన్నాడు " నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను " అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు " ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావ రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం " అన్నాడు. అప్పుడు రావణుడు " రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను " అని అంతఃపురానికి వచ్చేశాడు. మరునాడు రావణుడు విరూపాక్షుడు,…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 39 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 39   Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 39.  39వ దినము, యుద్ధకాండ రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి, ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళి ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి " ఈయనకి తినడం అంటె బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్ధాల వాసనకి నిద్ర లేస్తాడు " అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరు…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 39 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 38 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 38   Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 38.    38వ దినము, యుద్ధకాండ యుద్ధం ప్రారంభమయ్యింది       వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జెరగబోయేముందు రాముడు అన్నాడు " యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి " అని చెప్పాడు. ఆరోజున జెరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముస…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 38 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 37 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 37 Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 37.    37వ దినము, యుద్ధకాండ విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు " రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి " అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు. ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా " నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు " అన్నాడు. వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దెగ్గరికి వెళ్ళి " వచ్చినవాడు…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 37 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 36 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 36 Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 36.  36వ దినము, యుద్ధకాండ హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి " హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు. సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్…
Read more about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 36 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 35 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 35   35వ దినము, సుందరకాండ | Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 35 | సుందరకాండ హనుమంతుడు సీతమ్మ దెగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి " లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో. కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదా వనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు " అని అనుకొని, భీమరూపుడై ఆ అశోక వనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరారలోని నీళ్ళని బయటకి తోసేశాడు. అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దెగ్గరికి వచ్చి " ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దెగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు? " అని అడిగారు…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 35 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 34 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 34 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం  

34వ దినము, సుందరకాండ | Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 34 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

  తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) " లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి " అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ' అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ' అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి  హనుమంతుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు సీతమ్మ అనింది " ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక " అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది. అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి " అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 34 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 33 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 33  

33వ దినము, సుందరకాండ - Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 33 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి " సీత! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటె సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలె మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము, కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు " అని గద్దించారు.     (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం     అప్పు…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 33 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 32 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 32 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం  

32వ దినము, సుందరకాండ | Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 32 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి, స్నానం కూడా   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం   చెయ్యకుండా అశోకవనానికి బయలుదేర…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 32 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 31 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 31 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం  

31వ దినము, సుందరకాండ | Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 31 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితొ కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగె నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి. అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీ…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 31 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 30 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 30 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం    

30వ దినము, సుందరకాండ | Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 30 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి " రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనముల ఎన్ని అయినా దాటి వస్తాను " అన్నాడు. ధృతి-దృష్టి-మతి-దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటె పట్టుదల, దృష్టి అంటె మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటె బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటె శక్తి సామర్ధ్యాలు.ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని, ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దెగ్గరికి వ…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 30 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 29 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 29  

29వ దినము, సుందరకాండ | Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 29 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ: సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి: సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది? సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.   Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకా…
Read more about Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 29 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28.  

28వ దినము, కిష్కింధకాండ | Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్ష…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27.  

27వ దినము, కిష్కింధకాండ | Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

అప్పుడు తార " లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా " అనింది. అప్పుడు లక్ష్మణుడు " నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. ( మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్ధాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము{ కష్టపడి సంపాదించినది}, ధర్మబద్ధమైన కామము{ కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం} వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది ). మిత్ర…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 26 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 26   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 26.

26వ దినము, కిష్కింధకాండ | Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 26

ఆలా సుగ్రీవుడు తార, రుమలతో హాయిగా, సంతోషంగా కాలం గడపసాగాడు. బాల ఇంద్రగోప్తా అంతర చిత్రితేన విభాతి భూమిః నవ శాద్వలేన | గాత్ర అనుపృక్తేన శుక ప్రభేణ నారీ ఇవ లాక్ష ఉక్షిత కంబలేన || ఆ వర్షాకాలాన్నీ చూసి రాముడన్నాడు " ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడడం వలన భూమి మీద గడ్డి బాగా పెరిగింది. అందువలన భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి, మేఘాలు కురుస్తున్నాయి, ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి. భార్యలు పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు, వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరములన్నీ చ…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 26 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25. 25వ దినము, కిష్కింధకాండ న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ | యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం || కిందపడిపోయిన వాలి అన్నాడు " రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ " అన్నాడు.అప్పుడు రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడ…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24     Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24.   24వ దినము, కిష్కింధకాండ అప్పుడు సుగ్రీవుడు " రామ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటె ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఒడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామ? " అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి " మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు క…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23.   23వ దినము, కిష్కింధకాండ అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో  

అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః | లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||

  " సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది " అన్నాడు. …
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0