Santhana Bhagyam – సంతాన భాగ్యం కోసం..

Santhana Bhagyam … 
సంతాన భాగ్యం కోసం.. గోమాతకు ఏం దానం చేయాలి..?

For the good fortune of children .. 


Santhana Bhagyam

Santhana Bhagyam

 

Santhana bhagyam సంతాన భాగ్యం కోసం….. గోమాతకు ఏం దానం చేయాలి..?

 

Santhana Bhagyam – గోమాతకు అన్నం పెట్టడం వలన సంతాన భాగ్యంకలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. 

పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకూ గోవుపాలు శ్రేష్ఠమైనవిగా, విశిష్టమైనవి. 

అలాంటి గోవుకి అన్నంపెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. వివాహమైన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు. 

సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలతచెందుతారు.

 

 

భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు … వ్రతాలు చేస్తుంటారు. 

తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. 

ఇలా సంతానం కోసం తపించేవాళ్లు … ప్రతి రోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతోంది. 

ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతికాలంలోనే తీరుతుంది.


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u ,
telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Santhana Bhagyam

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

సంతానలేమి సమస్యతో బాధపడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి పించం, కామధేనువును ఇంట్లోకి తీసుకురావటం వల్ల సంతాన యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నెమలి పించం కామదేనువు రెండూ కూడా శ్రీకృష్ణుడిని చూచిస్తాయి కనుక ఈ రెండు వస్తువులను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా సంతాన సమస్యలతో బాధపడే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది.

సంతానం కోసం ఎదురుచూసే దంపతులు పూజగదిలో ఆగ్నేయ దిశ వైపు నెమలి పించం పెట్టి పూజించాలి అలాగే ఉత్తరం లేదా తూర్పు దిశ వైపు కామదేనువు విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి.

అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే వారు కూడా ఈ రెండు వస్తువులను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇక వ్యాపారాలలో అభివృద్ధి చెందాలనుకునే వారు కూడా ఈ వస్తువులను వ్యాపారాలు చేసే చోట పెట్టుకోవడం ఎంతో మంచిది.

 

Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download

 

సంతాన భాగ్యం కోసం గర్భ రక్షాంభిక స్తోత్రం…..!!

“అపుత్రస్య గతిర్నాస్తి” అనగా పుత్ర సంతానం లేనిదే పితురులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అని వేద ప్రవచనం. “పున్నామ నరకాత్ త్రాయత ఇతి పుత్రః పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. వంశమును నిలుపుటుకు, వంశాభివృద్ధికి పుత్ర సంతానం అవసరం.

 

వివాహ సమయంలో చెప్పబడే మహా సంకల్పంలో “దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం పితృణా నరకాదుత్తార్యశాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్ధం” అనగా పుత్రిక మాతృ, పితృ తరముల వారు తరింపబడుతారు. షోడశ మహా దానాలలో కన్యాదానం ప్రముఖమైనది అని పెద్దలు చెబుతారు. కావున పితృ దేవతలను తరింపజేయుటకు సంతానం అవసరం. సంతానం వలనే పితృరుణం తీర్చుకోగలరు. కనుక సంపదలెన్ని ఉన్న సంతానం లేనిదే పరిపూర్ణత సిద్ధించదు.

 

ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రం ద్వారానే సంతాన సౌఖ్య విషయాన్ని పరిశీలించేవారు. భార్యా భర్తల జాతకాలలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకొని శాంతి ప్రక్రియలు చేసుకుంటూ గర్భరక్షాంభికా స్తోత్రాన్ని పఠించిన వారికి సత్ సంతాన భాగ్యం కలుగుతుంది.

 

గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. జాతకచక్రంలో సంతానయోగం పరిశీలించేటప్పుడు పంచమ భావం, పంచమాదిపతి, నవమభావం, నవమాధిపతి, సంతాన కారకుడైన గురువు, సప్తాంశ వర్గ చక్రం పరిశీలించాలి. పై భావాధిపతులు రాశిచక్రంలో, నవాంశచక్రంలో, సప్తాంశ చక్రంలో బలం కలిగి ఉండాలి. పంచమభావం సంతానభావం కాబట్టి పురుష జాతకంలో పంచమభావం నుండి సంతాన విషయాన్ని పరిశీలించాలి. భాగ్యభావం పంచమభావానికి భావాత్ భావం కాబట్టి నవమ స్ధానాన్ని పరిశీలించాలి. భాగ్యభావంలో తృప్తిని, అనుభూతిని సూచించే భావం కాబట్టి స్త్రీ సంతానం పొందటం వలన మాతృత్వం లభించి సంతృప్తి పొందుతుంది కాబట్టి స్త్రీ జాతంకంలో ప్రధానంగా భాగ్యభావాన్ని పరిశీలించాలి.

గర్భ రక్షాంభిక స్తోత్రం
ఓం శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
వాపీతఠే వామభాగే         వామదేవస్య దేవస్య దేవీ స్థిత త్వమ్ ।
మాన్యా వరేణ్య వదాన్య     పాహి గర్బస్త్య జన్తూన్ తథా భక్తలోకాన్ ॥
శ్రీ మాధవీ కాననస్థే          గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
శ్రీ గర్బరక్షాపురే యా         దివ్య సౌందర్య యుక్తా సుమాంగళ్య గాత్రీ ।
ధాత్రీ జనిత్రీ జనానామ్      దివ్యరూపామ్ దయాద్రామ్ మనోః జ్ఞాం భజే తామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే          గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
ఆషాఢ మాసే సుపుణ్యే      శుక్రవారే సుగన్ధేన గన్దేన లిప్తా ।
దివ్యంభరాకల్పవేషా         వాజపేయాది యోగస్త్య భక్తః సుదృష్టా ॥
శ్రీ మాధవీ కాననస్థే         గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
కళ్యాణ ధాత్రీ నమస్తేః       వేది కన్గ చ స్త్రీయ గర్భ రక్షాకరీ త్వామ్ ।
బాలై సదా సేవితాంగ్రి గర్భ రక్షార్ధ మారా ధుపేతై రుపేతామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే       గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
బ్రహ్మోత్సవే విప్రవిద్యాః    వాద్యఘోషేణ తుష్టామ్ రతే సన్నివిష్ఠామ్।
సర్వార్థధాత్రిం భజేహం    దేవబృంధై రపీఢ్యామ్ జగన్మాతరమ్ త్వామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే       గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
యే తత్ క్రుతమ్ స్త్రోత్ర రత్నం దీక్షిత అనంత రామేన దేవ్యా స్తుతుష్ట్యై ।
నిత్యం పఠేయస్తు భక్త్యా పుత్ర పౌత్రాది భాగ్యమ్ భవే తస్య నిత్యమ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మ శ్రీ అనంత రామ దీక్షిత విరచితం గర్భరక్షాంభికా స్త్రోత్రం సంపూర్ణం ॥

 

 

Spread iiQ8

April 25, 2015 7:32 PM

609 total views, 0 today