Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !
శిరోజాల సమస్యలతో విసుగొస్తోందా?
Hair problem and solution hair fall in Telugu home healthy tips
‘దువ్వినప్పుడల్లా జుట్టు తెగ ఊడిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.’ అంటూ ఓ అమ్మాయి బెంగ పడిపోతూ ఉంటుంది.
‘ఇరవై ఏళ్లకే బట్టతలొచ్చేస్తే నాకు పిల్లనెవరిస్తారు?’ అంటూ ఓ అబ్బాయి ఆందోళన పడుతూ ఉంటాడు.
జుట్టు గురించి ఇలాంటి కంప్లెయింట్లు అందరికీ ఉండేవే! చివర్లు చిట్లిపోవటం, బిరుసెక్కిపోవటం, తెల్లబడిపోవటం... ఇలా చెప్పుకుంటూపోతే వెంట్రుకల సమస్యల చిట్టా చాంతాడంత.
కేశ సంరక్షణకు రకరకాల చిట్కాలు ఫాలో అయిపోతూ ఉంటాం. అయినా రిజల్ట్ అంతంతమాత్రమే! అయితే సమస్యలు తొలగి వెంట్రుకల్లో జీవం ఉట్టిపడాలంటే మాత్రం వాటి పోషణ మీద శ్రద్ధ పెట్టాలి అంటున్నారు.
రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సహజమే! వెంట్రుకల పెరుగుదలలో ‘అనాజన్, క్యాటజన్, టిలోజన్’ అనే మూడు దశలుంటాయి. ప్రతి వెంట్రుక ఫాలికిల్ నుంచి మొలకెత్తింది మొదలు 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి చివరికి రాలిపోతుంది. తర్వాత వెంట్రుక కుదుళ్లు కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. కొన్నాళ్లకు అక్కడి నుంచి కొత్త వెంట్రుక మొలకెత్తుతుంది. అయితే…
Read more
about Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !