Telugu lo stories famous telugu katha nijam , ఈ మెసేజ్ Save చేసుకోండి..

Best Messages in Telugu for Motivation

Telugu lo stories famous telugu katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి..

 

దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు. 


Telugu lo stories famous telugu katha nijam , ఈ మెసేజ్ Save చేసుకోండి.. 1

తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు.

తూట కంటే శక్తివంతమైనది మాట!  ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు.

 

మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెర లాగా విడదీస్తూ కాదు..

నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
నీవు సంతోషంగా ఉన్నావంటే, నీకు సమష్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని…

స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను, గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.

చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.

కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.

ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు.

ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.  అదే తేడా…

గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు.

నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను… ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను. 

స్వయంకృషితో పైకొచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు….



Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

Spread iiQ8