Chandamama kathalu telugu lo stories kathalu, చందమామ కథలు 

చందమామ కథలు  – Chandamama kathalu telugu lo stories kathalu


 తెనాలి రామకృష్ణ – శ్రీ కృష్ణదేవరాయుల కల
500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు.

 

అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.

ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.

“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.


 

శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.

వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.

“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”

 

రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.

 

“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.

 

రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

 

తెనాలి రామక్రిష్ణ | Tagged: burra kathalu, children story, folk tale, hitopadesam, indian folk tale, indian story, jataka tales, kadhalu, kids stories, krishnadevaraaya, panchatantra, pitta kathalu, short stories, simple stories, story, telugu books, telugu folk tale, telugu kids stories, telugu short stories, telugu story, tenali ramakrishna
Chandamama kathalu telugu lo stories kathalu, చందమామ కథలు  1

————–

పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో…

Telugu blog with stories for children and grown-ups alike – these are not original stories, rather, a compilation of folk tales and moral stories I’ve read since childhood.

Source of the content : https://kathalu.wordpress.com/

Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story


 


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ

Difference in Students Numbers శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం Paramanandayya Sishyulu Stories In Telugu

పరమానందయ్య శిష్యుల కథలు • Paramanandayya Sishyulu Stories In Telugu

ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. “అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?” అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో “గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది” అంటూ ఏడుపు లంకించుకున్నాడు.

“ఆరే నిజంగానా?” అంటూ ఆయన ఆశ్చర్యపోయి, “సరిగ్గా లెక్కపెట్టావా నాయనా! ముందాశోకాలు మాని, ఇంకోసారి లెక్కపెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య.

“నిజమేనండీ గురువుగారూ! మేం మీ శిష్యులం పదిమందిమి ఉండాలికదా! మీతో కలిపి 11మందిమి… ‘ఏకాదశరుద్రుల్లా భాసిస్తున్నాం” అని మీరు అంటుంటారు. ఇప్పుడు లెక్కబెడితే దశావతారాలే-మీతో కలిపి” అన్నాడు ఆ శిష్యుడు.

ఆ శిష్యుడు ఎంతో చురకైన వాడని పరమానందయ్యగారి నమ్మకం. అటువంటి వాడి మాటల్లో శంకించడానికేముంటుంది?


అయిన్సా, శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి “మనం ఏకాదశరుద్రుల్లాంటి వారం” అంటూ తనను మినహాయించుకొని లెక్కబెట్టాడాయన కూడా. పదిమందే లెక్క తేల్తున్నారు. దాంతో శిష్యులకు తగ్గ గురువైన పరమానందయ్య కూడా ఏరు నిజంగానే ఒకర్ని మింగేసిందని భోరుమన్నాడు.

“లెక్కతప్పు వేసుకొంటూ భోరుమంటున్న శిష్యులు”

ఇక్కడ గురుశిష్యులిద్దరూ చేస్తున్న పొరపాటేమిటీ అంటే… ముందుగా తమను తాము లెక్కించుకొని, ఇతరుల్ని లెక్కించుకుంటూ రావాలన్న కసీసజ్ఞానం విస్మరించడం. అందుకే ఎవరు లెక్కించినా ఒకరు తక్కువ వస్తున్నారు.

తీరా, వికల మనస్కులై ఇంటికి వెళ్ళి గురుపత్ని పేరిందేవి దగ్గర శోకాలు తీయగా, ఆమె లోకజ్ఞానం ఉపయోగించి గురువు గారితో పాటు అందర్నీ వరసగా నిలబెట్టి, ఒక్కక్కరినే చేత్తోతట్టి లెక్కబెట్టే సరికి 11మందీ లెక్కతేలే సరికి అంతా స్థిమిత పడ్డారు.


పరమానందయ్య శిష్యుల కథలు • Paramanandayya Sishyulu Stories In Telugu

“Paramanandayya Shishyula Kathalu” is an Entertaining story. The main point of these stories is the lack of intelligenceBecause this ignorance contributes to the creation of great humor, We have brought you “Paramanandayya Sishyulu” stories in Telugu pdf font.

తెలుగులో చిరకాలంగా ప్రచారంలో ఉన్న కథల మాలికలలో ఒకటి “పరమానందయ్య శిష్యుల కథలు” వినోదాత్మకంగా సాగే ఈ కథలలో ప్రధానాంశం అతితెలివి తక్కువతనం అంతా శిష్యుల రూపంలో ఒకేచోట ప్రోగుకావడం!ఈ తెలివి తక్కువతనం అనేది గొప్ప హాస్య సృష్టికి దోహద పడటం వల్లనే, ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే ‘వీడు పరమానందయ్య శిష్యుడిలా ఉన్నాడురా’ అనడం మనకు అనుభవంలో ఉన్నదే!


 monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

 

Spread iiQ8