Tomato Pandanti telugu pdf home healthy tips free, iiQ8

Tomato Pandanti telugu pdf home healthy tips free

 

Tomato Pandanti telugu pdf home healthy tips free

 

పండంటి టొమాటో..! tomato pandanti telugu pdf home healthy tips free

‘లవ్‌ ఆపిల్‌’ అని ఫ్రెంచివాళ్లూ, ‘ద ఆపిల్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌’ అని జర్మన్లూ ముద్దుగా పిలుచుకునే టొమాటో అంటేనే ఒకప్పుడు అమెరికన్లకు చచ్చేంత భయం. దాన్ని చూస్తేనే ‘అమ్మో విషం… తింటే చచ్చిపోతాం’ అని భయపడి అంతదూరంలో పెట్టేవారు. ఇప్పుడయితే ‘టొమాటోని మించిన శక్తిమంతమైన కూరగాయే లేదు, పెరటితోటలో అది పండాల్సిందే, తినాల్సిందే’ అంటారు. అంతేనా… ఏకంగా డిసెంబరును టొమాటో మాసంగానూ జరుపుకుంటారు. అంతగా ఏమార్చేసిన ఆ టొమాటోలో ఏముందో…!

 

‘టొమాటో లేకుండా ఒక్కవారం వంటచేయండి’ అంటే మనవాళ్లు కష్టమే అనేస్తారు. అంతగా ఆ రుచికి అలవాటుపడిపోయాం. పచ్చడి, పప్పు, గ్రేవీ కూర, సాంబారు, సాస్‌, సూప్‌, సలాడ్‌… ఇలా ఎందులోనయినా ఒదిగిపోయి చక్కని రుచిని అందిస్తుంది. అందుకే టొమాటో లేని రుచుల్ని ఆస్వాదించలేం. అరవై, డెబ్భై రూపాయలైనా అది వంటల్లో ఉండాల్సిందే.

 

అలాగని దీనికి ప్రత్యామ్నాయం లేదని చెప్పలేం. పాశ్చాత్యదేశాల్లో ఉల్లి, వింటర్‌ స్క్వాష్‌లను వాడితే, మనదగ్గర చింతపండు గుజ్జు వాడుకోవచ్చు.

 

కానీ టొమాటో టొమాటోనే. రుచికోసమే కాదు, పోషకాల పరంగానూ ఎన్నో మంచి గుణాలున్న పండంటి కూరగాయ ఇది. ఎందుకంటే సాధారణంగా పండిన ఏ కూరగాయనీ కూరల్లో వాడం.

 

కానీ పండినా కూరల్లో వాడేది ఇదే. శాస్త్రీయ పరిభాషలో టొమాటో పండే. అయితే పండాకే కూరల్లో వాడతాం కాబట్టి కూరగాయగానే పిలవాలని కొందరు ఆహార నిపుణులు చెబుతుంటారు.

 

అయినా అంతా దీన్ని పండుగానే పిలవడం విశేషం.

• రకరకాలు!

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

టొమాటోలెన్ని రకాలు… అనగానే దేశవాళీ, హైబ్రిడ్‌… మహాఅయితే చెర్రీ అనేస్తాం. కానీ ప్రపంచవ్యాప్తంగా 7,500 టొమాటో రకాల్ని పండిస్తున్నారు. ఇంకా ఎప్పటికప్పుడు కొత్త రకాలను ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు.

 

విభిన్న ఆకారాలూ పరిమాణాలతోబాటు ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ, ఆకుపచ్చ, వూదా, గోధుమ, తెలుపు, నలుపు రంగుల్లోనూ టొమాటోలు పండుతాయి.

 

Tomato Pandanti telugu pdf home healthy tips free

 

గీతలున్నవీ రెండు రంగులు కలగలిపి ఉన్నవీ కూడా ఉన్నాయి. రంగులూ రూపాలే కాదు, టొమాటోల్లో విభిన్న రుచులకూ కొదవ లేదు. తక్కువ పులుపుతో తియ్యగా ఉండే ఎల్లో పియర్‌; ముదురు ఎరుపులో కాస్త ఉప్పగా ఉండే బ్లాక్‌ క్రిమ్‌; పలుచని తొక్కతో తీపీపులుపూ రుచితో పచ్చిగానూ తినగలిగే బ్రాండీవైన్‌; తీపీ వగరూ కలగలిసిన ఒకలాంటి భిన్న రుచితో అలరించే గ్రీన్‌ సాసేజ్‌; ఎక్కువకాలం నిల్వ ఉండే తియ్యని గార్డెన్‌ పీచ్‌, చెర్రీ, గ్రేప్‌; అన్నింటిలోకీ చిన్నగా 0.7 అంగుళాల వ్యాసంలో నేరుగా చప్పరించే తియ్యని కరెంట్‌… ఇలా ఎన్నో రకాలు.

 

గుండ్రని గ్లోబ్‌ రకం టొమాటోల్ని కూరలకీ ప్రాసెసింగ్‌కీ వాడితే; పాశ్చాత్యదేశాల్లోని బీఫ్‌స్టీక్‌, మనదేశంలో రూపొందించిన హైబ్రిడ్‌ బెంగళూరు రకాల్ని శాండ్‌విచ్‌ల్లో సలాడ్లలో ఎక్కువగా వాడతారు. ప్లమ్‌, పియర్‌ టొమాటోలనూ సాస్‌ల్లోనూ ప్యూరీల్లోనూ వాడతారు. తియ్యని చెర్రీ, గ్రేప్‌ టొమాటోలనూ నేరుగానూ సలాడ్లలోనూ ఐస్‌క్రీముల్లోనూ ఉపయోగిస్తారు.

 

• ఎంత మంచిదో..?

 

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

ఎరుపురంగు టొమాటోల్లోనే లైకోపీన్‌ శాతం ఎక్కువనీ, అదే మంచిదనీ అనుకుంటాం. కానీ నారింజ, లేత ఎరుపు రంగుల్లోని టెట్రా సిస్‌ లైకోపీన్‌నే మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటుందన్నది తాజా పరిశోధన. అదెలా అంటే ఎర్రని టొమాటోల్లో ట్రాన్స్‌- లైకోపీన్‌ ఉంటే, నారింజవర్ణంలోని వాటిల్లో టెట్రా సిస్‌ లైకోపీన్‌ ఉంటుంది. కానీ మొత్తమ్మీద ఏ రూపంలో ఉన్నా లైకోపీన్‌ అనేది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌.

 

ఇది శరీరానికి ఎంత అవసరమూ అంటే మెనోపాజ్‌ దాటిన మహిళలకు కేవలం నాలుగు వారాలపాటు ఇది లేని ఆహారం ఇచ్చి చూడగా వాళ్ల ఎముకలమీద చాలా ప్రభావాన్ని కనబరించింది. అంటే ఆహారంలో లైకోపీన్‌ లోపిస్తే ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం ఉందన్నమాట.

 

పచ్చివాటిల్లోకన్నా ఉడికించిన టొమాటోల్లోనే ఈ లైకోపీన్‌ ఎక్కువగా ఉంటుందనీ కాబట్టి ఉడికించి తినడమే మేలన్నది నిపుణుల సూచన.

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

పోషకాలపరంగా చూసినా పచ్చివాటికన్నా పూర్తిగా పండిన టొమాటోనే మేలు. పండినప్పుడు అందులోని పిండి పదార్థాలు డెక్స్‌ట్రోజ్‌గా మారతాయి.

 

* లైకోపీన్‌ ఒక్కటే కాదు, ఆల్ఫాలిపోయిక్‌ ఆమ్లం, కోలీన్‌, బీటా కెరోటిన్‌, ల్యూటెన్‌, విటమిన్‌-ఇ, విటమిన్‌-సి… వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంవల్ల టొమాటో హృద్రోగులకూ ఎంతో మంచిది. టొమాటో ఎక్స్‌ట్రాక్ట్‌ వల్ల రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ గడ్డకట్టకుండా ఉంటాయన్నది తాజా పరిశోధన.

 

* టొమాటోల నుంచి తీసిన లైకొమాటో అనే పదార్థాన్ని బీపీని తగ్గించేందుకూ వాడుతున్నారు.

 

 

* ఇందులోని ఆల్ఫా టొమాటిన్‌ అనే ఫైటో న్యూట్రియంట్‌, ప్రొస్టేట క్యాన్సర్‌ను అడ్డుకుంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. అలాగే లైకోపీన్‌ రొమ్ము, క్లోమగ్రంథి క్యాన్సర్లనూ తగ్గిస్తుంది.

 

బీటాకెరోటిన్‌ కొలొరెక్టల్‌ క్యాన్సర్‌నూ రానివ్వదట. టొమాటోలు ఎక్కువగా తినేవాళ్లలో ప్రొస్టేట్‌, వూపిరితిత్తులు, పొట్ట క్యాన్సర్లు రావని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ కూడా పేర్కొంటోంది.

* టొమాటోలవల్ల ఆల్జీమర్స్‌ ప్రమాదం తక్కువట.

 

 

Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు

 

* ఇది ఆకలిని పుట్టిస్తుంది. అందుకే భోజనానికి ముందు టొమాటో సూప్‌ తాగడం సంప్రదాయంగా మారింది.

* దీన్ని తరచూ తినడంవల్ల యూరిన్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

* మధుమేహ బాధితులకూ చక్కని మందే. పిండిపదార్థాల శాతం తక్కువగా ఉండే టొమాటోల్ని ఎక్కువగా తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెరశాతం పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని ఆల్ఫాలిపోయిక్‌ ఆమ్లం గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంతోబాటు రక్తంలో దాని శాతాన్ని నియంత్రిస్తుంది. రక్తప్రసారానికి దోహదపడుతూ రెటీనోపతి రాకుండానూ చేస్తుంది. ఇందులోని ఎ-విటమిన్‌ కళ్లకూ మంచిదే.

 

* టొమాటోల్లోని ఫోలిక్‌ ఆమ్లం గర్భిణులకీ మంచిదే. ఇది డిప్రెషన్‌నీ తగ్గిస్తుంది.

 

* ఇందులోని కోలీన్‌ నిద్ర పట్టేలా చేస్తుంది. కండరాల కదలికలకూ జ్ఞాపకశక్తికీ తోడ్పడుతుంది.

• టొమాటో పండు!

అందమైన అమ్మాయిని చూడగానే దోర జాంపండు అని మనం అనుకున్నట్లే అమెరికన్లు టొమాటో అని పిలుస్తారు. ఎందుకంటే చూడచక్కని టొమాటో ఆరోగ్యాన్నే కాదు, సౌందర్యాన్నీ పెంచుతుందట.

 

దీని గుజ్జును క్రమం తప్పకుండా మొహానికి పట్టిస్తే మొటిమలు తగ్గుతాయి. చర్మం సుతిమెత్తగా కాంతిమంతంగా మారుతుంది. చర్మవ్యాధులతో బాధపడేవాళ్లు రోజూ ఓ టొమాటో తింటే వైద్యుడితో పని ఉండదని చెబుతారు. ఇందులోని లైకోపీన్‌ హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అందుకే అందానికీ ఆరోగ్యానికీ ఓ పండంటి టొమాటో..!

 

Tomato Pandanti telugu pdf home healthy tips free

 

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?


Spread iiQ8

March 2, 2016 7:41 PM

91 total views, 0 today