ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాది.
ఉ - అంటే నక్షత్రం గ - అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలకు నంది మన తెలుగువారి ఉగాది. About Ugadi Telugu, ఉగాది ఉగాది పుట్టుక Origin / History of Ugadi in teluguచైత్ర శుద్ధ పాడ్యమి నాడి బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెపుతున్నాయి.
ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకొని వచ్చి, బ్రహ్మ దేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పు…