War between Sri Krishna & Arjuna | iiQ8

War between Sri Krishna & Arjuna | iiQ8

War between the Krishnarjunas
 
కృష్ణార్జునులు మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? నారదుడు ఏం చేసాడంటే?

దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన కృష్ణుడు చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు.

అలాంటి కృష్ణుడు పాండవుల పక్షపాతి అని అందరూ నమ్ముతారు. ఆ నమ్మకాన్ని దూరం చేయడం కోసం శ్రీకృష్ణుడు పాండవులలో తనకు ఎంతో ప్రీతి మంతుడైన తన బావమరిది అర్జునుడితో యుద్ధం చేశాడని మీకు తెలుసా? ఆయన ఎందుకు ఈ యుద్ధం చేశారో ఇప్పుడు చూద్దాం ……

 

War between Sri Krishna & Arjuna | iiQ8

శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో గయుడు అనే ఒక గంధర్వుడు ఆకాశ మార్గంలో వెళుతూ కిందకు ఉమ్ముతాడు.

 

అది సరిగ్గా సంధ్యా వందనం చేస్తున్న శ్రీ కృష్ణుని దోసిలిలో పడుతుంది. దానికి ఆగ్రహించిన కృష్ణుడు అతనిని తుదముట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

Karthika Puranam Part 6, Deepa Daana Vidhi కార్తీక పురాణం – 6 వ అధ్యాయము *దీపదానవిధి – మహాత్మ్యం*

కృష్ణుని ప్రతిజ్ఞ తెలిసిన గయుడు భయంతో వణికిపోతాడు. తనను తాను రక్షించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా కూర్చుంటాడు. ఆ సమయంలో అతని వద్దకు వచ్చిన నారదుడు.

 

గయుని సమస్య తెలుసుకొని అతడిని జరిగిన విషయం చెప్పకుండా అర్జునుడిని శరణు కోరమంటాడు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం గయుడు అర్జుడిని వద్దకు వెళ్లి విషయం చెప్పకుండా శరణు కోరుతాడు. గయుని చంపడానికి నిర్ణయించుకున్న శ్రీ కృష్ణుడు అర్జుడిని గయుని తనకు అప్ప చెప్పమని కోరుతాడు. ఇచ్చిన మాట తప్పడం క్షత్రియ ధర్మం కాదు గనక అర్జునుడు కృష్ణునితో యుద్ధానికి సిద్ధం అనే సంకేతాన్ని పంపుతాడు. పూనిన ప్రతిజ్ఞను వదలడం ధర్మము కాదు కనుక శ్రీకృష్ణుడు సైతం అర్జునుడితో యుద్ధానికి సిద్ధం అనే సంకేతాన్ని పంపుతాడు.

Tulsi Vivah | Marriage of Tulasi with Bhagavan, iiQ8 Devotional

విషయం తెలిసిన రుక్మిణి, సుభద్ర ఈ యుద్ధాన్ని మానమని తమ పతులను కోరుతారు. కాని ధర్మం కోసం ఇద్దరు యుద్ధ రంగానికి కదలి వెళ్తారు.

 

ఒకరు ప్రయోగించిన ఆయుధాలను మరొకరు నిలువరిస్తూ కృష్ణార్జునులు భీకర యుద్ధాన్ని సాగిస్తుంటారు.

 

ఇక సహనాన్ని కోల్పోయిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడి పై ప్రయోగిస్తాడు. దీనికి అర్జునుడు శివుడు తనకు స్వయంగా ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.

 

ఈ అస్త్రాల ప్రయోగం వల్ల ప్రపంచ వినాశనం జరుగుతుందని స్వయంగా అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు వారిరువురిని ఒప్పించి వారి అస్త్రాలను వెనక్కి తీసుకునేలా చేస్తాడు.

 

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

వారిరువురు నమ్మిన ధర్మం తప్పకుండా ఉండడం కోసం మొదటిగా అర్జునుడిని కృష్ణుడికి గయుని అప్ప చెప్పమని చెబుతాడు.

 

బ్రహ్మ మాట ననుసరించి అర్జునుడు గయుని శ్రీకృష్ణుడికి అప్పజెప్పాడు. ముందుగా తను నమ్మిన ధర్మం కోసం శ్రీ కృష్ణుడు గయుని సంహరిస్తాడు.

 

వెంటనే బ్రహ్మ తన కమండలంలోని నీటిని నిర్జీవుడైన గయుని శరీరం పై చల్లి అతనికి మళ్లీ ప్రాణం తెప్పిస్తాడు.

 

ఇలా ఇరువురు నమ్మిన ధర్మం కోసం ఒకరితో ఒకరు యుద్ధం చేశారు.

 

ఈ కృష్ణ లీల ధర్మం కోసం ఎంతటి వారితో నైనా యుద్ధాన్ని చేయాలని చెప్పడానికి కృష్ణుడు ఆడిన జగన్నాటకం అని భక్తులు నమ్ముతారు.

 

Spread iiQ8

August 10, 2020 2:35 PM

83 total views, 0 today