కాశీకి వెళ్ళినా రామా హరీ, ఇంటి మోహాలు పోలేదు రామ హరీ!, దేహ సౌఖ్యాలు పోలేదు రామా హరీ
కాశీకి వెళ్ళినా రామా హరీ, ఇంటి మోహాలు పోలేదు రామ హరీ! దేహ సౌఖ్యాలు పోలేదు రామా హరీ
ఈ రోజుల్లో చాలా మందిని చూస్తుంటాము, ఎందుకు గుళ్ళకు తీర్ధ యాత్రలకు వెళతారో, అక్కడి స్థల కధ తెలుసుకుని, దేవుని గుణ సంపద నేర్చుకుని, ఆచరిస్తూ ఉంటే, వారిలో ఇన్నాళ్ళు గా ఏమి మార్పు వచ్చిందో, మనకే కాదు, వారికి వాళ్ళ ఇంట్లో వారికి కూడా తెలీదండోయ్. అప్పుడు అది తీర్ధ యాత్ర కాదు, విహార యాత్ర అవుతుంది, ఫలితం శూన్యం.
ఏవండోయ్ మేము 34 వ సారి, తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము. 12 లడ్డూలు తెచ్చి పంచాము, మేనేజర్లు మనకు పనికి వచ్చేవారికి. కాశీ రామేశ్వరం కంచి కైలాసం, అలా అలా టూర్ కి వెళ్ళి, నంది కొమ్ముల నుంచి పరమేశ్వరుని చూసి, ఊరక వచ్చిన ధనం ఓ 50 వేలు ఇంటిల్లి పాదీ, వదిలించి వచ్చాము, 25 వ సారి.
6 Divine Temples of Sri Subrahmanyaswamy details
కొన్ని సార్లు ఇతరులు దయా ధర్మముగా, ఉచితముగా టికెట్ ఇస్తామన్నా, అందరం పోలో మంటూ పరుగులు తీసాము, ఉచిత భోజనం ప్రయాణం కదా. ఇంట్లో సమస్యల నుంచి తాత్కాలికముగా తప్పించుకోవడానికి, ఊళ్ళెమ్మట తిరుగుతూ పొద్దు పుచ్చడానికి, భలే ఉంటుంది కదూ?
ఎక్కడ చూసినా, ఇసక…
Read more
about కాశీకి వెళ్ళినా రామా హరీ, ఇంటి మోహాలు పోలేదు రామ హరీ!, దేహ సౌఖ్యాలు పోలేదు రామా హరీ