Vedam patina, ఏ వేదంబు పటించే లూత

Vedam patina ఏ వేదంబు పటించే లూత

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Vedam patina, ఏ వేదంబు పటించే లూత 1
Vedam patina :
ఏ వేదంబు పటించే లూత భుజగంబెశాస్త్రముల్ సూచె ….అన్నారు ధూర్జటి శ్రీ కాలహస్తీశ్వర శతకంలో.
 
భగవంతుణ్ణి అర్చించడానికి భక్తీ ఉంటే చాలని సాలీడు, సర్పము, ఏనుగు నిరూపించాయని ధూర్జటి వారి పద్యాన్ని మనం మన చిన్నతనంలో చదువుకున్నాం.


ఇదిగో సరిగ్గా ఆ పాత పాఠమును మళ్ళి మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ చిత్రాల్లోని సర్పరాజము.
వరుసగా 1 నుండి 4 చిత్రాల్లో గమనిస్తే మారేడు చెట్టు పై నుండి మారేడు దళమును నోట్లో కర్చుకుని, ఆలయంలోకి ప్రవేశించి, అభిషేక జలము వెళ్ళే దారి నుండి గర్భ గుడిలోకి చేరి చివరికి స్వామి కి అలంకరించి తన జన్మ చరితార్థం అయ్యింది అనుకుంటూ చూస్తుంది గమనించండి.

 

ఏక బిల్వం శివార్పణం

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం “ఏక బిల్వం శివార్పణం” అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము – స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత – ఙ్ఞ్యేయము – ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారేడు దళాలతో ” మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.

ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించటం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి.
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.



“పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే” – అనే భావంతో శివుని పూజించుటయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని – బిల్వపత్రరూపంతో ‘ త్రిపుటి ఙ్ఞానాన్ని ‘ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని ” శివోహం, శివోహం ” అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమైన ఈశ్వర పూజకు ” బిల్వపత్రం ” సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!




devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Spread iiQ8

April 25, 2015 7:30 PM

548 total views, 0 today