Telugu Emotional Story Brother Sister | *రక్త సంబంధం* తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు

Telugu Emotional Story Brother Sister – 🙏🙏 *రక్త సంబంధం*🙏

 

*ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.

పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు…. రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది…*

*బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది…*

*వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది… తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ…*

 

Moral Story for Kids Telugu kathalu, Value of Human Life


Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు

*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.*

*ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు…*

*అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కింద పడేసాడు.* *అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే…. జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే… అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.*

*ఇక వెళ్ళొస్తామంటూ… బయల్దేరారు ముగ్గురూను.*

*తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని “అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి” అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.

భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.*

*”ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా… నీ చేతి వంట రుచి చూడాల్సిందే” అన్నాడు* *భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ…*

 

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,

 

*ఆలోచించుకుంటూ….!*

*సోదరులంటే ఇలా ఉండాలి కదా….!*

*బంధం అనే కాదు… కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.*

*ఆత్మీయతను కోల్పోకండి.!*

*దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా… మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.*

*”ఏమంటారు”*..?

*ఇలాంటి ఆత్మీయతలను;* *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం, కానీ ఈ మెసేజ్ ని సాధ్యమైనంత ఎక్కువ గ్రూవులలో షేర్ చేసి మళ్ళి ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది ఇది నా చిన్న ప్రయత్నం*

*నా ప్రయత్నం కు మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ..*🙏🙏🙏

 

పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu


మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

Spread iiQ8

April 10, 2023 11:49 AM

194 total views, 1 today