Ayina Manishi Maraledu Telugu Songs Lyrics | iiQ8 అయినా మనిషి మారలేదు, చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ, అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

అయినా మనిషి మారలేదువేషము మార్చెను
భాషను మార్చెను
మోసము నేర్చెను
అసలు తానే మారెను

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు

క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను
వాదము చేసెను
త్యాగమె మేలని
బోధలు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు

వేషమూ మార్చెను
భాషనూ మార్చెను
మోసము నేర్చెను
తలలే మార్చెను

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు

 

| గుండమ్మ కధ |

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
రంగేళి జోడీ బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా
చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
రంగేళి జోడీ బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా
చరణం1:

దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
అశోకుడు యుధ్ధంలోన వాడిందీ ఈ కారు
శివాజీ గుర్రం వీడి ఎక్కిందీ ఈ కారు
చరిత్రల లోతులు చేరి రాతలు మారి
చేతులు మారినదీ జంపరు బంపరు బండిరా బండిరా
జగ మొండిరా మొండిరా
చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ

చరణం2:
ఆంగ్లేయులు తోలిన కారు అంధ్రానే ఏలిన కారు

అందాల లండన్ కారు అన్నింటా ఇండెన్ కారు
బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
హుషారుగ ఎక్కిన చాలు దక్కును మేలు చిక్కు సుఖాలు
ఇదే సూపరు డూపరు బండిరా బండిరా
జగ మొండిరా మొండిరా

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
రంగేళి జోడీ బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా
చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ

| చెట్టుకిందప్లీడర్ |

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా

చరణం1:
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

చరణం2:
జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
సంగతేదో తెలిపే పలపే సంగతేదో పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

| చెట్టుకిందప్లీడర్ |

Ayina Manishi Maraledu Telugu Songs Lyrics | iiQ8 అయినా మనిషి మారలేదు, చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ, అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

 

allibilli kalalA rAvE allukunna kadhalA rAvE
mallepUla cinukai rAvE pallaviMcu palukai rAvE
vEcE edalO velugai rAvE
allibilli kalalA rAnA allukunna kadhalA rAnA
mallepUla cinukai rAnA pallaviMcu palukai rAnA
vEcE edalO velugai rAnA
allibilli kalalA rAvE allukunna kadhalA rAvE
allibilli kalalA

caraNaM1:
sOgakaLLa virisE sogasE gOgupUlu kurisE
rAgamaina pilupE telipE mUgaguMDe valapE
reppacATu cUpE nEDu rekkalocci egisE
ninna kanna kalalE nEDu ninnu kOri nilicE
ElabiguvA ElukonavA prEmakadha vinavA

allibilli kalalA rAnA allukunna kadhalA rAnA
allibilli kalalA

caraNaM2:
jAvaLIlu pADE jANa jAbilamma tAnai
guMDe niMDipOyE cAnA veMDimabbu tAnai
saMgatEdO telipE palapE saMgatEdO palikE
dUramiMka ceripE valapE dOranavvu cilikE
mEnikuLukE tEnecinukai pUlajallu kurisE

allibilli kalalA rAvE allukunna kadhalA rAvE
allibilli kalalA rAnA allukunna kadhalA rAnA
mallepUla cinukai rAvE pallaviMcu palukai rAvE
vEcE edalO velugai rAnA
allibilli kalalA rAvE allukunna kadhalA rAnA
allibilli kalalA

 

Telugu Songs Lyrics Evaru Rayagalaru Amma | iiQ8 ఎవరు రాయగలరు అమ్మ, అంజలీ అంజలీ పుష్పాంజలీ

Spread iiQ8

April 28, 2024 8:19 AM

296 total views, 5 today