Sapta Chiranjeevulu సప్త చిరంజీవులు
అశ్వత్థామ:
ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్దిమందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతుకలు కోసి చంఫాడు. ఆ కారణంగా, ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణూడు అతన్ని శపించాడు.
Ashwatthama:
Son of Dronacharya. He was one of the few remaining on the Kaurava side after the Kurukshetra war. He killed the sleeping Upapandavas by cutting their throats. Because of that, Lord Krishna cursed him to live forever with all the sores and no death.
Mudupu Ela Kattali in Telugu | ముడుపు అంటె ఏమిటి? ఎలా కట్టాలి?
Sapta Chiranjeevulu సప్త చిరంజీవులు
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
పరశురాముడు:
విష్ణుమూర్తి అవతారం. జమదగ్ని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు.
Parasurama:
An incarnation of Vishnu. son of Jamadagni. Varanga wanted to kill his mother on his father’s orders and bring her back to life. In revenge for the killing of his father by the Kshatriya Kartaviryarjuna, he attacked the entire Kshatriya race 21 times and killed them.
హనుమంతుడు:
అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి. బ్రహ్మచారి. రామకార్యం కోసం లంకకు లంఘించి, సీత జాడ కనుక్కున్న పరోపకారి. హనుమతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం అత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు -హనుమంతుడు.
Hanuman:
The most famous Chiranjeevi. A bachelor A philanthropist who traveled to Lanka for Ramakarya and traced Sita. Lord Rama’s reward for Hanuman’s favor is a loving embrace. The one who hides Rama in his heart, the one who dwells in Rama’s heart – Hanuman.
వ్యాసుడు:
భారత, భాగవత గ్రంథాలను రచించాడు. భారత దేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఈతని రచనలే మూలం. వశిష్టుని మునిమనుమడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని కుమారుడు. భీష్మునికి వరుసకు అన్న.
Article:
He wrote Bharata and Bhagavata texts. Itani’s writings are the source of Bharata Bhagavata texts in various languages of India. Great-grandson of Vashishta, grandson of Shakti Maharshi, son of Parashara. Bhishma’s brother.
కృపుడు:
కౌరవ పాండవుల కుల గురువు. ద్రోణుని బావమరది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు.
Krupudu:
Kaurava caste teacher of the Pandavas. Drona’s brother-in-law. Along with his nephew Aswatthama, Kripu was one of the few Kaurava warriors who survived the battle of Kurukshetra.
బలి:
ముల్లోకాలనూ జయించిన దానవ చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. విరోచనుని కుమారుడు. పౌరాణిక గాథల్లో మహా దాతలుగా ప్రసిద్ధికెక్కిన ముగ్గురు – బలి, శిబి, ధధీచి – లలో ఒకడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడడుగుల నేలను అతనినుండి దానంగా పొంది, రెండు అడుగులతో యావద్విశ్వాన్నీ ఆక్రమించి, మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా, తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతళానికి తొక్కేసాడు.
Bali:
A demon king who conquered all the worlds. Grandson of Prahlad. Son of Virochana. He is one of the three – Bali, Sibi and Dhadhichi – who are famous as great givers in mythological stories. Lord Vishnu, in Vamanavatara, received three feet of ground from him as a gift, occupying Yavadvisvanni with two feet, and asked where to place the third foot, showing his head. Vamana who was Trivikram trampled him to the ground.
విభీషణుడు:
రావణాసురుని తమ్ముడు. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు. ఆ తరువాత అన్నను వీడి, రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదుగానీ దాదాపుగా చిరంజీవి. కల్పాంతము వరకూ చిరంజీవిగా ఉండే వరం పొందాడు.
Vibheeshanudu:
Ravanasura’s younger brother. He advised Anna to hand over the abducted Sita back to Rama. After that he left Anna and took refuge with Rama. He is not immortal but almost immortal. He got the boon of eternal life till Kalpanth.
Barbareekudu, బర్బరీకుడు..! , మహాభారతంలోని ఓ వింత పాత్ర…
ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి యైన మార్కండేయుని కూడా కలిపి అష్ట చిరంజీవులని కూడా అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు.
Puranas say that these seven are immortal. Along with these seven, Markandeu, another immortal, is also known as Ashta Chiranjeevi. Markandeya became immortal by the grace of Lord Shiva.
Due to Lord Krishna’s curse Ashwatthama due to Vamanugraha Balichakravarti Lokahitakai Vyasa due to Sri Ramabhakti Hanuman due to Ramanugraha Vibhishana due to Vichitrajanma Krupu Utkrushtapadhona Parasurama Saptachiranjeevulairai. The meaning of this verse is that by the grace of Lord Shiva, Markandeyu, who was a dreamer, was freed from all the diseases that plagued him for centuries.
శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహమువలన విభీషణుడు విచిత్రజన్మము వలన కృపుడు ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి । వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము॥
Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?