Prahlaadudu Parsuraamudu, ప్రహ్లాదుడు, పరశురాముడు

Prahlaadudu Parsuraamudu, ప్రహ్లాదుడు, పరశురాముడు
 
 పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
 
Prahlaadudu : ప్రహ్లాదుడు –
భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు.
ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.
 
Parasuraamudu : పరశురాముడు–
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది.
పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు.
జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.
పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.


 
Paraasharudu : పరాశరుడు —
వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి.
పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను.
ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను. వీరికి వ్యాసుడు జన్మించెను.
 

Spread iiQ8

May 2, 2015 7:54 PM

267 total views, 0 today