Avakreethuni katha, అవక్రీతుని కథ…!
avakreethuni katha అవక్రీతుని కథ...!
రైభ్యుడు మహా తపశ్శక్తి సంపన్నుడైన గొప్ప ఋషి. ఇతడు ఎంతో భక్తి, శ్రద్ధలతో గురువులను సేవించి సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అర్వావసుడు, చిన్న కుమారుడు పరావసుడు. వీరిద్దరూ తండ్రిలాగే సర్వవిద్యలు నేర్చుకున్నారు.
బృహద్యుమ్నుడను మహారాజుకు ఋత్విక్కులుగా ఉన్నారు. రైభ్యుని, అతని కుమారుల కీర్తి దశదిశలు వ్యాపించడంతో.., భరద్వాజుని కుమారుడైన ‘అవక్రీతునికి’ అసూయ పుట్టింది. ఎందుకంటే, అవక్రీతుడు పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఎలాగైనా రైభ్యుని కన్నా, అతని పుత్రుల కన్నా గొప్ప విద్యావంతుడు కావాలనుకుని, తన తండ్రి దగ్గరకు వెళ్ళి, ‘తపస్సుచేసి సకల విద్యలు సంపాదించాలని అనుకుంటున్నాను, అనుఙ్ఞ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు భరద్వాజుడు ‘కుమారా...మనకన్నా గొప్పవారిని చూసి ఆనందించాలే కానీ, అసూయ పడకూడదు. విద్యలు గురువుల దగ్గర అభ్యసించి నేర్చుకోవాలిగానీ.., తపస్సు చేసికాదు. ఈ ప్రయత్నం మానుకో’ అని హితవు చెప్పాడు. అవక్రీతుడు వినలేదు. తండ్రి మాటను కాదని సకల విద్యాప్రాప్తికై తపస్సు ప్రారంభించాడు.
Moles Results in Telugu, Puttu Ma…
Read more
about Avakreethuni katha, అవక్రీతుని కథ…!
