Menaka Mohini Naaradudu Parvathi, మేనక పార్వతి

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —

Menaka Mohini Naaradudu Parvathi 
Menaka : మేనక — 

మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామితుడి తపోభంగానికి ఇంద్రుడు నియమించిన అప్సరస . వీరిరువురి కలయిక వలన శకుంతల జన్మించింది .
Mohini : మోహిని — 

మోహిని అంటే సాధారణంగా నారాయణుని మోహినీ అవతారము . దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు.
రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.

ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.
నకులుడు : పాండవుల్లో నాల్గోవాడు .
Naaradudu : 

1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 
2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు. 

నారదుడు – లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. 

తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కధలు బహుళంగా వస్తాయి.


Parvati : పార్వతి — 

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. 

వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.




Spread iiQ8

May 2, 2015 7:52 PM

475 total views, 0 today