Maha Shiva Ratri Ela Cheyali Chaganti | iiQ8 మహా శివరాత్రి నాడు ఏమి చేయాలి?

Maha Shiva Ratri Ela Cheyali Chaganti

 

మహా శివరాత్రి – Maha Shiva Ratri Ela Cheyali Chaganti

 

ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రి.

దేశము, కాలము కలవడం చాలా కష్టం. అందుకనే జన్మమునకు ఒక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది. ఆనాడు వేకువఝామున చక్కగా తలస్నానం చేసి వచ్చి కూర్చని సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన పరమేశ్వరుని ప్రార్థిస్తూ నామం చెప్తూ ఈశ్వర సాకార మూర్తులకు తెల్లబియ్యం అక్షతలు . .

 

ఒక్కొక్క గింజ వేస్తూ రుద్రాధ్యాయంతో పూజచేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమును మీరు మీ పిల్లలు తీసుకుంటే పరమాత్మ మిమ్మల్ని ఎంతగానో కృపచేస్తారు.

మాసం మాఘా కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహా శివరాత్రి.

సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రిలలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది.

ఈ పండుగ ప్రధానంగా శివుడికి బిల్వ దళాలను సమర్పించడం, రోజంతా ఉపవాసం మరియు రాత్రంతా జాగరణ చేస్తారు.

రోజంతా, భక్తులు శివుని పవిత్ర మంత్రమైన “ఓం నమః శివాయ” జపిస్తారు.

జీవితంలోని అత్యున్నతమైన మంచిని స్థిరంగా వేగంగా చేరుకోవడానికి యోగా మరియు ధ్యాన సాధనలో వరాలను పొందడం కోసం తపస్సులు చేస్తారు.

ఈ రోజున, ఉత్తర అర్ధగోళంలో ఉన్న గ్రహాల స్థానాలు ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక శక్తిని మరింత సులభంగా పెంచుకోవడానికి సహాయపడే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.

మహా మృత్యుంజయ మంత్రం వంటి . . .

చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఒక మాట చెప్తూ ఉండేవారు. కేవలం దీపోత్సవం నాడు దీపమును చూడడం గాని, శివరాత్రి రోజున అర్థరాత్రి ధ్యానం చేయలేని వారు అనగా జ్యోతిర్లింగం ప్రాశస్త్యం గుర్తించి ధ్యానం చేయలేకపోతే త్ర్యంబకుడైనా ఫరవాలేదు దామోదరుడయినా ఫరవాలేదు వారిలో ఒకరిని ఆ జ్యోతి శిఖలోకి ఆవాహన చేసి అనగా ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడని భావన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు నమస్కారం చేయాలి. ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో ఎంతమందికి ఆ దీపం వెలుతురు తగులుతుందో వారందరూ పాప విముక్తులవుతారు. మనకి ఋషులు లోకం ప్రయోజనమును కోరుకొనమని చెప్పారు. మనకోసం బ్రతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు.

 

మహాశివరాత్రి రోజున అర్థరాత్రి జ్యోతి దర్శనం అయినప్పడు అందరూ ఆ జ్యోతివంక చూస్తూ ఆ వెలుతురును దర్శనం చేయాలి. భక్తితో కూడిన దర్శనం జ్ఞానావిర్భావమునకు హేతువై ఆ జ్ఞానము చేత మరల పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని ఇప్పించగలదు.

 

మహా శివరాత్రి నాడు, శివపూజను ఆచరించడానికి నిశిత కాల అనువైన సమయం.

 

శివుడు లింగ రూపంలో భూమిపై కనిపించినప్పుడు నిశిత కాల వేడుకలు జరుపుకుంటారు.

 

ఈ రోజున, అన్ని శివాలయాల్లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు.

 

ద్వాదశ జ్యోతిర్లింగాలు : Maha Shiva Ratri Ela Cheyali Chaganti 

1. రామనాథస్వామి లింగం – రామేశ్వరం

2.శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) – శ్రీశైలం

3.భీమశంకర లింగం – భీమా శంకరం

4.ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం – ఎల్లోరా గుహలు

5.త్రయంబకేశ్వర లింగం – త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)

6.సోమనాథ లింగం – సోమనాథ్

7.నాగేశ్వర లింగం – దారుకావనం (ద్వారక)

8.ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు – ఓంకారక్షేత్రం

9.మహాకాళ లింగం – ఉజ్జయిని

10.వైద్యనాథ జ్వోతిర్లింగం – చితా భూమి (దేవఘర్)

11.విశ్వేశ్వర లింగం – వారణాశి

12.కేదార్‌నాథ్‌ ఆలయం




Maha Shiva Ratri Ela Cheyali | iiQ8 శివరాత్రి జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు

 

Maha Shiva Ratri Ela Cheyali Chaganti

Maha Shiva Ratri Ela Cheyali Chaganti

Maha Shiva Ratri Ela Cheyali Chaganti

 

మహా శివరాత్రి నాడు ఏమి చేయాలి?

 

1. మహా శివ రాత్రి అర్ధరాత్రి వేళ శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉండగా చూడడం.

2. శివలింగము కటిక చీకట్లో వెలుతురు చిమ్ముతూ ఎలా ఆవిర్భవించినదో మనసులో ధ్యానము చేయడం.

3. రుద్రాన్ని పారాయణ చేయడం.

 

ఇవి ఏమీ చెయ్య లేకపోతే మహా శివ రాత్రి ప్రదోష వేళ (అసుర సంధ్య వేళ) ఒక్క మారేడు దళం అయిన శివలింగం మీద ఎవరు వేస్తున్నారో వాడు మోక్షమునకు అధికారి.

జ్ఞానము ఇస్తాడు కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇవ్వడు అని చాలామంది అనుకుంటారు.

ఐశ్వర్యమునకు పరమ యథార్థమయిన స్థానము శివపూజ.

లక్ష్మీ కటాక్షం శివపూజలో నుండి వస్తుంది.

మారేడు దళమును శివలింగం మీద పెడితే వెనకాల ఉన్న ఈనె శివలింగమునకు తగిలిందంటే వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది.

మారేడు దళం శివలింగము మీద బోర్లాపడితే జ్ఞానం వస్తుంది. రెండూ కూడా శుభఫలితములనే ఇచ్చేస్తాయి.

శివ నిర్మాల్యమును నంది మీద విడిచి పెడతారు. అది చాలా తప్పు. అది కిందపడి దానిని తొక్కితే గత జన్మలలో చేసిన పుణ్యము నశించిపోతుంది.

 

Who is Dushala and Saindhav in Mahabharata | iiQ8 info

 

 

ప్రదక్షిణ విధి

ప్రదక్షిణలు ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ధ్వజస్తంభం వద్దనే ముగించాలి.అప్పుడే ప్రదక్షిణలు పూర్తి అయినట్లు.

ప్రదక్షిణము చేసి వక్కలతో కానీ, పువ్వులతో కానీ, అక్షతలతోకానీ మాత్రమే లెక్క పెట్టాలి.

కాగితము మీద గుచ్చడము, పెన్నుతో కొట్టడము వంటివి చెయ్యకూడదు . . .

ఒక డబ్బాలో 108 వక్కలు, ఒక ఖాళీ డబ్బా పట్టుకుని వెళ్ళి ఒక ప్రదక్షిణము చేసి మళ్ళీ తిరిగి స్వామి దగ్గరకు వచ్చినప్పుడు నిలబడి శ్లోకము చెప్పి ఒక వక్కతీసి పక్కన ఉన్న ఖాళీ డబ్బాలో వెయ్యాలి. 108 వక్కలు ఖాళీ డబ్బాలోకి వచ్చాయంటే ప్రదక్షిణములు అయిపోయాయని గుర్తు.

శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అజ్ఞానం తొలుగుతుంది.

దక్షిణమునకు చూసే ముఖమును – లయం చేస్తుంది.ఇది అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది.

 

Sri Lalitha Sahasranama Stotram | శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం iiQ8 Devotional

 




పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు

పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా పరమేశ్వరుని అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. ఉత్తరానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని వామదేవ ముఖం అంటారు. వర్షములు పడకపోతే శివలింగమునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం

Maha Shiva Ratri Ela Cheyali Chaganti
వామదేవ ముఖం తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో శివలింగం పంచభూతములను శాసిస్తోంది.

సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.

 

Magha Masam Visistatha | iiQ8 info మాఘమాసం విశిష్టత ఏమిటి

 

శివపూజను 108 నామాలతో చేశారా, సహస్ర నామాలతో చేశారా, అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్త్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే.

భవాయ దేవాయ నమః
శర్వాయ దేవాయ నమః
ఈశానాయ దేవాయ నమః
పశుపతయే దేవాయ నమః
రుద్రాయ దేవాయ నమః
ఉగ్రాయ దేవాయ నమః
భీమాయ దేవాయ నమః
మహతే దేవాయ నమః

ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది

 

Maha Shiva Ratri Ela Cheyali Chaganti

 

https://sharemebook.com/  https://sharemebook.com/  https://sharemebook.com/

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

 

Maha Shiva Ratri Ela Cheyali Chaganti

 

Spread iiQ8

March 7, 2024 10:30 PM

96 total views, 2 today