Kucheludu Kamsudu Kabandudu, కుచేలుడు, కబంధుడు, కంసుడు iiQ8

Kucheludu Kamsudu Kabandudu, కుచేలుడు, కబంధుడు, కంసుడు

 
 పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
 
Kucheludu : కుచేలుడు–
చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది.
కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు ,కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు.
విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు.
 

KamsuDu : కంసుడు —

ఉగ్రసేనుని కుమారుడు , శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు.

ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు.
చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది.
కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు.

 


KabanduDu : కబంధుడు —
రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యము లో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు.



ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి.
కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.

Find everything you need. Kucheludu Kamsudu Kabandudu

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

Kucheludu Kamsudu Kabandudu, కుచేలుడు, కబంధుడు, కంసుడు
Spread iiQ8

May 2, 2015 7:47 PM

290 total views, 0 today