Death Maranam | 😭😢 🤕 మరణం 😰😞😭
ఒక మనిషి చనిపోయాడు.. దేహంలోంచి..
ఆత్మ బయటకు వచ్చింది.* చుట్టూ చూశాడు…
చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు
వచ్చాడు* చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ > ఇలా…. } సాగింది:!
Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम
యమధర్మరాజు : మానవా…
నీ శరీరం పడిపోయింది *
ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద *
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను…
భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ !
యమధర్మరాజు : తప్పదు నాయనా !
నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి.
ఏం తెచ్చారో చూస్తాను *
యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి *
మనిషి: నావా? అంటే నా బట్టలు,
డబ్బులు, భూమి పత్రాలు అవా ?
యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు.
అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి *
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा
యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
యమధర్మరాజు : వారు కేవలం నీతో
కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
యమధర్మరాజు : వారు నీతో కలిసి
ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో
నా శరీరం ఉండుండాలి!
యమధర్మరాజు : తప్పు. నీ శరీరం
థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది.
అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని
తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు
సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది *
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం.
నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ
స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు *
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను.
నాది అనేది ఏమైనా ఉందా అసలు?
యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం
ప్రతి క్షణం నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి,
చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి. 🙏🌹💐🌷
Credits to మీ.రాజు సానం🙏🙏
Rameswaram Temple | రామేశ్వరం యొక్క ప్రధాన ఆలయం | रामेश्वरम मंदिर | ராமேஸ்வரம் கோவில்
Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति
Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు