Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

Bhagavad Gita in telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

Bhagavad Gita in telugu main page  Bhagavad Gita in telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)
 

భగవద్గీత (Bhagavad gita) – శ్రీభగవద్గీత మన భారతదేశం ప్రపంచానికి అందించిన మహోన్నతమైన విజ్ఞాన భాండారము. ఈ బ్లాగ్ లో శ్లోకాలు వ్రాయడం లేదు.భావం మాత్రమే వ్రాయడం జరిగింది.
Bhagavad Gita in telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)
 
 
Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html
Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html

Bhagavad Gita Telugu

Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu

Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu

Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము   Dear All, here are the details about Bhagavad Gita

ఈ భగవద్గీత యొక్క చిట్టచివరి అధ్యాయము మిగతా అన్ని అధ్యాయాల కన్నా దీర్ఘమైనది మరియు ఇది చాలా విషయములను వివరిస్తుంది. అర్జునుడు సన్యాసము అనే విషయాన్ని ప్రారంభిస్తూ, సంస్కృతంలో సాధారణంగా వాడే పదాలైన సన్యాసము (కర్మలను త్యజించటం) మరియు త్యాగము (కోరికలను త్యజించటం) అన్న వాటి గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ రెండు పదాలు త్యజించటం అన్న అర్థం లో ఉన్న మూల పదముల నుండే జనించాయి. సన్యాసి అంటే కుంటుంబపర జీవితంలో పాలుపంచుకోకుండా సాధనా కోసము సమాజము నుండి తనను తాను ఉపసంహరించుకుంటాడు. త్యాగి అంటే కార్యకలాపాలు చేస్తుంటాడు కానీ, కర్మ ఫలములను అనుభవించాలనే స్వార్ధ చింతనను విడిచిపెట్టినవాడు. (భగవద్గీత లో చెప్పబడిన అర్థం ఇది). శ్రీ కృష్ణుడు రెండవ రకం సన్యాసాన్ని సిఫారసు చేస్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు మరియు ఇతర ధార్మిక కర్తవ్య కార్యములను ఎప్పుడూ త్యజించకూడదు అంటున్నాడు, ఎందుకంటే అవి జ్ఞాన…

Read moreabout Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu


Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu

Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu

Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము

పదునాలుగవ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను వివరించి ఉన్నాడు మరియు అవి మనుష్యులను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో కూడా చెప్పాడు. ఈ పదిహేడవ అధ్యాయములో, ఈ త్రిగుణముల యొక్క ప్రభావము గురించి మరింత విస్తారముగా వివరిస్తున్నాడు. మొదటిగా, విశ్వాసము/శ్రద్ధ అనే విషయం గురించి వివరిస్తూ, ఎవ్వరూ కూడా విశ్వాస రహితముగా ఉండరు అని చెప్తున్నాడు, ఎందుకంటే అది మానవ నైజం యొక్క విడదీయలేని భాగము. కానీ, వారివారి మనస్తత్వం బట్టి, జనుల యొక్క విశ్వాసము (faith) అనేది, సాత్త్విక, రాజసిక , లేదా తామసిక రంగును కలిగిఉంటుంది. వారికి ఏ రకమైన విశ్వాసము ఉంటుందో వారి జీవితం కూడా ఆ రకంగానే ఉంటుంది. జనులకు ఆహారం పట్ల కూడా వారివారి గుణములకు అనుగుణంగానే మక్కువ ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఆహారాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తూ, మనపై వీటి యొక్క ప్రభావాన్ని వివరిస్తున్నాడు.…

Read moreabout Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu


Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము | Daivasura Sampadvibhaga yogamu

Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము | Daivasura Sampadvibhaga yogamu

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలను వివరిస్తున్నాడు – దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాలు. శాస్త్ర ఉపదేశాలను/నియమాలను పాటించటం, సత్త్వ గుణమును పెంపొందించుకోవటం, మరియు మనస్సుని ఆధ్యాత్మిక సాధనచే శుద్ధి చేసుకోవటం ద్వారా, దైవీ గుణాలు వృద్ధి చెందుతాయి. అది దైవీ సంపత్తి (దేవుని వంటి గుణములు) పెంచుకోవటానికి దోహదపడుతుంది, చిట్ట చివరగా అది భగవత్-ప్రాప్తిని కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఆసురీ ప్రవృత్తి కూడా ఉంది, అది రజో గుణము, తమో గుణములతో అనుసంధానం వలన మరియు భౌతిక ప్రాపంచిక దృక్పథాన్ని అవలంబించటం వలన పెరుగుతుంది. అది మనిషి యొక్క వ్యక్తిత్వములో అపవిత్ర నడవడికను కలిగిస్తుంది, మరియు అంతిమంగా ఆత్మను నరకం వంటి స్థితిలోకి నెట్టివేస్తుంది. Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu Bhagavad Gita 16 దైవాస…

Read moreabout Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము | Daivasura Sampadvibhaga yogamu


Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu

Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఇంతకు క్రితం అధ్యాయములో, ప్రకృతి త్రిగుణములకు అతీతులమవటం ద్వారా భగవత్ లక్ష్యమును చేరుకోవచ్చు అని శ్రీ కృష్ణుడు వివరించి ఉన్నాడు. అనన్య భక్తిలో నిమగ్నమవటమే త్రి-గుణములకు అతీతులమై పోవటానికి ఉన్న అద్భుతమైన పద్దతి అని కూడా చెప్పి ఉన్నాడు. ఇటువంటి భక్తిలో నిమగ్నమవటానికి, మనము మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరం చేసి దానిని భగవంతుని యందే నిమగ్నం చేయాలి. అందుకే, ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా ఆవశ్యకం. ఈ అధ్యాయంలో, అర్జునుడికి భౌతిక జగత్తు పట్ల మమకార-ఆసక్తులు తగ్గించటంలో సహాయం చేయటానికి, శ్రీ కృష్ణుడు, ఈ యొక్క భౌతిక జగత్తుని తద్రూప ఉపమానముతో వివరిస్తున్నాడు.   Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu   భౌతిక జగత్తుని ఒక తల క్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) తో పోల్చుతున్నాడు. బద్ధ జీవాత్మ – ఆ వృక్షం ఎక్కడి నుండి వచ్చినదో, ఎప్పటినుండి ఇది ఉందో, అ…

Read moreabout Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu


 

Bhagavad Gita 14 గుణత్రయ విభాగ యోగము | Gunatraya Vibhaga Yogamu

Bhagavad Gita 14 గుణత్రయ విభాగ యోగము | Gunatraya Vibhaga Yogamu

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఆత్మ మరియు భౌతిక శరీరమునకు మధ్య తేడాని గత అధ్యాయము విపులంగా విశదీకరించింది. ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది; ఇదే మనస్సు మరియు పదార్ధమునకు మూలము. భౌతిక ప్రకృతి మూడు విధములుగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు – సత్త్వము, రజస్సు , మరియు తమస్సు. భౌతిక శక్తి చే తయారు అయిన శరీరమనోబుద్ధులు కూడా ఈ మూడు గుణములను కలిగి ఉంటాయి; ఈ మూడు గుణముల కలయిక మనలో ఏ పాళ్ళలో ఉన్నది అన్నదాని బట్టి మన వ్యక్తిత్వము ఆధారపడి ఉంటుంది. సత్త్వ గుణము – శాంతి, సదాచారము, సద్గుణము మరియు ప్రసన్నత తో ఉంటుంది. రజో గుణము వలన అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృప్తినొందని తృష్ణ, కలుగుతాయి. మరియు తమో గుణము వలన భ్రమ, సోమరితనం, మత్తు మరియు నిద్ర కలుగుతాయి. ఆత్మ జ్ఞానోదయం పొందేవరకూ, ప్రకృతి యొక్క ఈ బలీయమైన శక్తులతో వ్యవహరించటం నేర్చుకోవాలి. ఈ త్రి-గుణమ…

Read moreabout Bhagavad Gita 14 గుణత్రయ విభాగ యోగము | Gunatraya Vibhaga Yogamu


Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | Kshetra Kshetragna Vibhaga Yogamu

Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | Kshetra Kshetragna Vibhaga Yogamu

Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము   Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయము: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

భగవద్గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాలు, మూడు విభాగాలుగా ఉన్నట్టు భావించవచ్చు. ఆరు అధ్యాయముల మొదటి భాగము కర్మ యోగాన్ని విశదీకరిస్తుంది. రెండవ భాగము, భక్తి యొక్క మహత్వమును, మరియు భక్తిని పెంపొందించటానికి భగవంతుని యొక్క విభూతులను కూడా (ఐశ్వర్యములను) తెలియపరుస్తుంది. మిగతా ఆరు అధ్యాయముల మూడవ భాగము, తత్త్వ జ్ఞానమునకు అర్థవివరణ చేస్తుంది. ఈ ప్రస్తుత అధ్యాయము, మూడవ భాగము లోని మొదటి అధ్యాయము; ఇది రెండు పదాలను మనకు పరిచయం చేస్తున్నది – క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును తెలిసినవాడు). క్షేత్రము అంటే ఈ శరీరము అని మరియు క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును ఎరిగినవాడు) అంటే అందులో ఉండే ఆత్మ అని అనుకోవచ్చు. కానీ ఇది విషయాన్ని చాలా సరళీకరణం చేసినట్టే, ఎందుకంటే క్షేత్రము అంటే దానిలో చాలా ఉంటాయి – మనస్సు, బుద్ధి, అహంకారము మరియు మన వ్యక్తిత్వములో ఉండే భౌతిక శక్తి యొక్క అన్ని…

Read moreabout Bhagavad Gita 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | Kshetra Kshetragna Vibhaga Yogamu


Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam

Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam



Bhagavad Gita 12 భక్తి యోగము   Bhagavad Gita 12 భక్తి యోగము 12వ అధ్యాయము: భక్తి యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఈ చిన్న అధ్యాయము, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా, ప్రేమ యుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది. యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది —భగవంతుని సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మాంను ఉపాసించే వారా అని. ఈ రెండు మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీ కృష్ణుడు సమాధానమిస్తాడు. కానీ, తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు. నిరాకార, అవ్యక్త భగవత్ తత్త్వముపై ధ్యానం చేయటం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ద జీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు. తమ అంతఃకరణ ఆయనతో ఏకమై పోయినవారు, మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు, త్వరితగతిన జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు. శ్రీ కృష్ణుడు ఈ విధంగా అర్జునుడిని, అతని బుధ్ధిని తనకు అర్పించి, మనస్సుని అనన్య ప…

Read moreabout Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam


Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము | Vishwa Roopa Darshana Yogamu Telugu

Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము | Vishwa Roopa Darshana Yogamu Telugu

Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము   Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము 11వ అధ్యాయము: విశ్వ రూప దర్శన యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఇంతకు క్రితం అధ్యాయంలో, అర్జునుడి భక్తిని మరింత వికసింపచేయటానికి, శ్రీ కృష్ణుడు తన దివ్య విభూతులను వివరించి ఉన్నాడు. సుందరమైనవి, మహాద్భుతమైనవి, మరియు శక్తివంతమైనవి అన్నీ కూడా తన వైభవములోని చిన్న తళుకులే అని చివరికి సూచనప్రాయంగా తన విశ్వ రూపము గురించి ప్రస్తావించాడు. ఈ అధ్యాయంలో, అర్జునుడు శ్రీ కృష్ణుడి విశ్వ రూపమును చూడాలని ప్రార్థిస్తున్నాడు, అది సమస్త బ్రహ్మాండములను తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వ రూపము. శ్రీ కృష్ణుడు దానికి ఒప్పుకుని, అతనికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. అర్జునుడు అప్పుడు సమస్త సృష్టిని ఆ దేవ దేవుని శరీరము యందే దర్శిస్తాడు. ఆయన అనంతమైన ముఖములను, కళ్ళను, బాహువులను, మరియు ఉదరములను ఆ యొక్క మహాద్భుతమైన మరియు అనంతమైన భగవంతుని రూపంలో దర్శిస్తాడు.   Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradha…

Read moreabout Bhagavad Gita 11 విశ్వ రూప దర్శన యోగము | Vishwa Roopa Darshana Yogamu Telugu


Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

Bhagavad Gita 10 విభూతి యోగము   Bhagavad Gita 10 విభూతి యోగము 10వ అధ్యాయము: విభూతి యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. తొమ్మిదవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు భక్తి శాస్త్రాన్ని తెలియపరిచాడు మరియు తన యొక్క కొన్ని వైభవాలని వివరించాడు. ఇక్కడ ఇక, అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని తన అనంతమైన మహిమలని మరింత వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ శ్లోకాలు, చదవటానికి కమనీయంగా మరియు వినటానికి మనోరంజకంగా ఉంటాయి. Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికీ తనే మూలము అని తెలియచెప్తున్నాడు శ్రీ కృష్ణుడు. మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి. సప్తర్షులు, నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు ఆయన మనస్సు నుండే జనించారు మరియు వారి నుండే ఈ ప్రపంచంలోని అందరు మనుష్యులూ అవతరించారు. సమస్తమూ ఆయన నుండే ఉద్భవించాయి అన్న విషయం తెలుసుకున్నవారు ఆయన పట్ల భక్తిత…

Read moreabout Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu


Bhagavad Gita 9 రాజ విద్యా యోగము | Raja Vidhya Yogamu Telugu

Bhagavad Gita 9 రాజ విద్యా యోగము | Raja Vidhya Yogamu Telugu

Bhagavad Gita 9 రాజ విద్యా యోగము Bhagavad Gita 9 రాజ విద్యా యోగము 9వ అధ్యాయము: రాజ విద్యా యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాలలో శ్రీ కృష్ణుడు, యోగ ప్రాప్తికి, భక్తియే అన్నింటికన్నా సులువైన మార్గమని, భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించి ఉన్నాడు. తొమ్మిదవ అధ్యాయంలో – విస్మయాన్నీ, పూజ్యభావాన్నీ మరియు భక్తినీ ఉత్పన్నం చేసే – తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి చెప్తున్నాడు. తాను అర్జునుడి ముందు తన సాకార రూపంలో నిలబడి ఉన్నా, తాను ఒక సామాన్య మానవుడినే అని అపోహ పడవద్దని తెలియచేస్తున్నాడు. తాను ఏ విధంగా, తన ఈ యొక్క భౌతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని, సృష్టి ప్రారంభంలో అనేకానేక జీవ రాశులను సృష్టించి, ప్రళయ సమయంలో తిరిగి వాటిని తనలోకే లయం చేసుకుంటాడో మరియు తదుపరి సృష్టి చక్రంలో మరల వాటిని వ్యక్తపరుస్తాడో, వివరిస్తాడు. అంతటా బ్రహ్మాండంగా వీచే గాలి కూడా ఆకాశంలోనే ఎలా స్థితమై ఉంటుందో, అలాగే సమస్త జీవ రాశులూ ఆయన యందే నివసిస్తూ ఉంటాయి. అయినా, తన దివ్య యోగ మాయా శక్తి ద్వారా, ఆయన తటస్థంగా, నిర్లిప్తంగా, ఈ అన్ని కార్యక్రమాలకు కేవలం సా…

Read moreabout Bhagavad Gita 9 రాజ విద్యా యోగము | Raja Vidhya Yogamu Telugu


Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము | Akshara Brahma Yogamu Telugu

Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము | Akshara Brahma Yogamu Telugu

Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము   Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము 8వ అధ్యాయము: అక్షర బ్రహ్మ యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఉపనిషత్తులలో విస్తారంగా చెప్పబడిన చాలా పదాలని మరియు విషయాలని ఈ అధ్యాయం క్లుప్తంగా వివరిస్తుంది. ఇది మరణం తరువాత ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా వివరిస్తుంది. మనం మరణ సమయంలో భగవంతుడిని స్మరించగలిగితే, ఆయనను ఖచ్చితంగా పొందగలము. కాబట్టి, రోజువారి పనులు చేస్తూనే, ఆయనను అన్ని సమయాల్లో స్మరిస్తూనే ఉండాలి. ఆ స్వామి యొక్క గుణములు, లక్షణములు, మరియు మహిమలు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించవచ్చు. దృఢ సంకల్పముతో యోగ ధ్యానములో మనస్సుని నామ సంకీర్తన ద్వారా ఆయనపైనే కేంద్రీకరించాలి. మన మనస్సుని సంపూర్ణంగా అనన్య భక్తితో ఆయన పైనే నిమగ్నం చేసినప్పుడు మనము ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలోనికి వెళతాము. ఆ తర్వాత, ఈ అధ్యాయం, భౌతిక జగత్తు లోని రకరకాల లోకాల గురించి ప్రస్తావిస్తుంది. సృష్టి క్రమంలో, ఈ లోకాలు మరియు వాటిలో అసంఖ్యాకమైన జీవ రాశులు ఎలా వచ్చాయో, మరలా ప్రళయ కాలంలో ఎలా తిరిగి లయం అవుతాయో, ఈ అధ్య…

Read moreabout Bhagavad Gita 8 అక్షర బ్రహ్మ యోగము | Akshara Brahma Yogamu Telugu


Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu

Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu

Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము 7వ అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలౌతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు మళ్ళీ ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ, బలీయమైనది దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చి, మరియు తన యందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు వివరిస్తాడు. తన భక్తులలో, ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో, తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో, వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తాను అని అంటున్నాడు.   Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu   తమ బుద్ధ…

Read moreabout Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu




Bhagavad Gita 6 ధ్యాన యోగము | Dhyana Yogamu Telugu

Bhagavad Gita 6 ధ్యాన యోగము | Dhyana Yogamu Telugu

Bhagavad Gita 6 ధ్యాన యోగము Bhagavad Gita 6 ధ్యాన యోగము 6వ అధ్యాయము: ధ్యాన యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, ఐదవ అధ్యాయంలో నుండీ ఉన్న వస్తున్న ‘కర్మ యోగ’ (ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం) మరియు ‘కర్మ సన్యాస’ (సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయటం) మార్గాలను పోల్చి, విశ్లేషణను కొనసాగిస్తూనే, మొదటి మార్గాన్నే సిఫారసు చేస్తున్నాడు. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు, అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత, ధ్యానమే, మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతుంది. ధ్యానము ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి శ్రమిస్తారు, ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు, కానీ, సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు.     Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu   తీవ్రమైన కఠిన నిష్ఠలు పాటించటం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించలేడని శ్రీ కృష్ణుడు అర్జున…

Read moreabout Bhagavad Gita 6 ధ్యాన యోగము | Dhyana Yogamu Telugu


Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము | Karma Sanyasa Yogamu

Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము | Karma Sanyasa Yogamu

Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము: కర్మ సన్యాస యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఈ అధ్యాయం ‘కర్మ సన్యాస’ (పనులను త్యజించటం) మార్గాన్ని ‘కర్మ యోగ’ (భక్తి యుక్తంగా పనిచేయటం) మార్గంతో పోల్చి చూపుతుంది. రెండూ కూడా ఒకే లక్ష్యం దిశగా దారితీస్తాయని, మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు, అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. కానీ, మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా/దోషరహితంగా చేయలేము, మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్త శుద్ధి సాధించవచ్చు. కాబట్టి, కర్మ యోగమే సాధారణంగా చాలామందికి సరియైన దారి. కర్మ యోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్దితో, ఫలాసక్తి విడిచి, భగవత్ అర్పితముగా చేస్తారు. ఈ విధముగా, తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తడి అంటనట్టు, వారికి పాపము అంటదు. జ్ఞాన ప్రకాశంచే వారు ఈ శరీరము అనేది, ఆత్మ వసించే నవ ద్వారాల నగరమని తెలుసుకుంటారు. ఈ విధంగా, వారు తాము కర్తలము కాము అని, తాము భోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు. వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు, ఒక బ…

Read moreabout Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము | Karma Sanyasa Yogamu


Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam

Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam

Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము   Om Namo Vasudevaya ! Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము 4వ అధ్యాయము: జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము

నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, తను ఉపదేశించే ఈ జ్ఞానంపై, దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా, అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును, తన ప్రియ మిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళెదురుగా ఉన్న శ్రీ కృష్ణుడు, ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా, శ్రీ కృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేని వాడు అయినా, తన యోగమాయా శక్తిచే, ధర్మాన్ని పరిరక్షించటానికి, ఈ భూలోకం లోకి దిగివస్తాడని చెప్తాడు. కానీ, ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషము…

Read moreabout Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam




Bhagavad Gita 3 కర్మ యోగము | Karma Yogamu Bhagavath Geetha Telugu Lo

Bhagavad Gita 3 కర్మ యోగము | Karma Yogamu Bhagavath Geetha Telugu Lo

Bhagavad Gita 3 కర్మ యోగము   Bhagavad Gita 3 కర్మ యోగము 3వ అధ్యాయము : కర్మ యోగము అన్ని ప్రాణులూ తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయనీ, మరియు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనీ, ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు.   ఏవో కాషాయి వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ, లోలోన ఇంద్రియ వస్తువులపై చింతనచేసే వారు కపటులు. వారికన్నా, బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, లోనుండి మమకార రాహిత్యంతో ఉండే, కర్మ యోగము ఆచరించే వారు, ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీ కృష్ణుడు తదుపరి వక్కాణిస్తున్నాడు. మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని ‘యజ్ఞం’ అవుతుంది.   యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు; వారు తమ ఇంద్రియ లౌల్య…

Read moreabout Bhagavad Gita 3 కర్మ యోగము | Karma Yogamu Bhagavath Geetha Telugu Lo


Bhagavad Gita 2 సాంఖ్య యోగము | Sankhya Yogamu | Samkhya Yogamu Telugu Bhagavad Geetha

Bhagavad Gita 2 సాంఖ్య యోగము | Sankhya Yogamu | Samkhya Yogamu Telugu Bhagavad Geetha

Bhagavad Gita 2 సాంఖ్య యోగము   Dear All, here is the Bhagavad Gita 2 సాంఖ్య యోగము Sankhya Yogamu   2వ అధ్యాయము: సాంఖ్య యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు త్యజించి, ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో, ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక బాధ్యతని నిర్వ…

Read moreabout Bhagavad Gita 2 సాంఖ్య యోగము | Sankhya Yogamu | Samkhya Yogamu Telugu Bhagavad Geetha


Bhagavad Gita 1 అర్జున విషాద యోగము | Arjuna Vishada Yogamu

Bhagavad Gita 1 అర్జున విషాద యోగము | Arjuna Vishada Yogamu

Bhagavad Gita 1 అర్జున విషాద యోగము   1వ అధ్యాయము: అర్జున విషాద యోగము

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతంలో, భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలౌతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత, తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు, అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు, మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేద వ్యాసుని శిష్యుడు. వేద వ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి వుంది. అదే శక్తిని సంజయుడికి, యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి, ఆయన ప్రసాదించాడు. Bhagavad Gita 14 గుణత్రయ విభాగ యోగము | Gunatraya Vibhaga Yogamu Bhagavad Git…

Read moreabout Bhagavad Gita 1 అర్జున విషాద యోగము | Arjuna Vishada Yogamu

 
శ్రీ భగవద్గీత అధ్యాయాలు వరుసగా – చదవవలసిన అధ్యాయం కొరకు ఆ అధ్యాయం పై నొక్కండి(క్లిక్ చేయండి).
 

సాంఖ్యయోగము

కర్మయోగము(3 వ అధ్యాయం)

జ్ఞానయోగము (4 వ అధ్యాయం)

కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము)

ఆత్మసంయమయోగము(6 వ అధ్యాయము)(ధ్యానయోగము లేక రాజయోగమ…

విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము)

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము)

విభూతి యోగము(10 వ అధ్యాయం)

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం)

భక్తి యోగము(12 వ అధ్యాయం)

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము(13 వ అధ్యాయం)

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం)

పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం)

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం)

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము)

మోక్షసన్యాస యోగం(18 వ అధ్యాయం)

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

Ornaments Worn by Sri Ram Lalla in Ayodhya | iiQ8 info Gold Jewelry of Shri Ram



Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)


Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru

 

Bhagavad Gita in telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita) Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

 


Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami


How to Donate / Contribution to Shri Rama Temple construction in India

Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)


7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita) meditation, Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita) health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus, ganesha easter, christian, famous christian festival, easter in telugu, english, islam, muslim, jesus, yesu, bible, quran, maha bharath, ramayan, geetha, prayer, sunday prayer, friday  Bhagavad Gita in Telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita) 
Spread iiQ8

September 25, 2015 12:41 PM

1021 total views, 2 today