About Religion – అసలు మనిషికి ఒక మతం ఎక్కడినుంచి వచ్చింది?

అసలు మనిషికి ఒక మతం ఎక్కడినుంచి వచ్చింది

Where did a religion come from for real man? 


జన్మతో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తల్లితండ్రుల దగ్గరనుంచి వచ్చింది. అది వాళ్లకి జన్మసిద్ధమైన మతం. సాధారణంగా ఇదే జరుగుతుంది. పుట్టిన తరువాత అది మారేదయితే, అది తల్లిదండ్రులు ఇచ్చింది కాదు.

నీ చర్మం రంగు, నీ కనుముక్కు తీరు అవి వాళ్లిచ్చినవే. అవి మారతాయా? నీకు కొత్త మతం ఇచ్చిన వారెవరు? ఎవరో తమ మతం వ్యాప్తి చేస్తున్న వారు. వాళ్లు నీ తల్లిదండ్రుల వలె, నీ శ్రేయస్సు చూసి నిన్ను విశ్వాసాలతో పెంచి, పేరుపెట్టి, బడిలో చేర్చి, వివాహాదులుకూడా చేసి నీకొక సమగ్రమైన వ్యక్తిత్వమిచ్చి ( యూఖశజూ జజూళశఆజఆక) వెళ్లిపోయారు. అదంతా మారే వ్యవస్థగా పరిగణిస్తావా? అంతేకాక నీ తల్లిదండ్రుల వెనుక తాతముత్తాతల తరం కూడా ఆ మతంలోనే ఉండినది.  ఆలోచించుకో! 

 తల్లితండ్రుల మతంలో మార్పు చెయ్యలేవు. అంతేకాక వాళ్ల విశ్వాసాలను, జీవన విధానాలను, ఆచార వ్యవహారాలను ధిక్కరించి విసర్జించినవాడవుతావు. నీవు పుట్టిన మతంలో కొన్ని మూఢాచారాలున్నాయా? మానవత్వానికి దూరమైన దురాచారాలు ఉన్నాయా? అయితే వాటిని వదులుకో! నీవు ఉత్తమ మానవుడిగా మారు. అది నీ బుద్ధికి సంబంధించిన విషయం. అంటే సంస్కరించబడ్డావు అని అర్ధం. మరో మతంలో ఉత్తమ లక్షణాలు కనబడితే వాటిని నీ జీవితంలో స్వీకరించు. అటువంటి మార్పు శుభకరమైనది. అది నీ మృత్యువు విషయంలో కూడా పాటించదగిన మార్పు. అప్పుడు మొదటి మతాన్ని ప్రాయశ్చిత్తాలతో విసర్జించి కొత్త ధర్మాన్ని జీవన దీక్షగా స్వీకరించు. ఒక గృహస్థు సన్యాసం తీసుకుంటే ప్రాయశ్చిత్తాలుంటాయి. కొత్త దీక్ష ఉంటుం ది. పూర్వపు మతాచారాలు విసర్జింపబడతాయి. అది ఉత్తమమైన మార్పు కింద లెక్క. కాని అది వ్యక్తిగతం. అటువంటి వారు ఎక్కడో వెయ్యికి పదిమంది ఉండొచ్చు. ముందుగా జన్మమతంలోని దోషాలు పరిశీలించు. అర్థంకాని ఇష్టాయష్టాలవల్ల సాంఘిక రాజకీయాది శక్తుల ప్రభావం వల్ల నీవు మారవద్దు. మనిషికి మనోబలం కావాలి.

About Religion - అసలు మనిషికి ఒక మతం ఎక్కడినుంచి వచ్చింది? 1ఏవో కొన్ని ఉత్తమ లక్షణాలు ఏ ఇతర మతాలలో కనిపించినా వాటిని గౌరవించడమే నాగరికత. అంతమాత్రం చేత తన సాంప్రదాయాన్ని వదులుకుని అందులో కలిసిపోవలసిన అవసరమూ లేదు. పైగా మరో మతంలోకి వెళ్లడం అనే మంచితనం కంటే, విచారించక తన జన్మ మతాన్ని విసర్జించడమనే పెద్ద తప్పు జరుగుతుంది. అలాంటి పనివల్ల కుటుంబ సభ్యుల్లో, ఇంకా ఇతర బంధువర్గాలలోను ఎన్నో మానసిక సంక్షోభాలు, సందేహాలు పెరగవచ్చు. 

అది వారిలో అశాంతినిస్తుంది. తాను పుట్టిన మతం తాను ఉత్తమ మానవుడిగా పెరగడానికి ఎప్పుడూ అడ్డు రాదు. దానికి మరో మతాన్ని ఆశ్రయించవద్దు. అవసరమైతే దురాచారాల్ని విసర్జించవచ్చు. కాని వాటిని ముందుగా పరిశీలించాలి. పెద్దలని అడిగి తెలుసుకోవాలి.

మరో విషయం మృత్యువు. అది పుట్టిన మతం ప్రకారమే జరుగుతుంది. కాని మరో మతం స్వీకరించాక కొత్త ఆచారంలో అది జరిగితే అందులో ఎన్నో పొరపాట్లు ఉండవచ్చు. హిందూమతంలో పునర్జన్మ ఉంది. ఆ విశ్వాసాన్ని ధిక్కరించడం మంచి పని అవుతుందా? హిందువుడవై నీ మతం మార్చుకుంటే ఆ అపురూపమైన సిద్ధాంతాన్ని ధిక్కరించిన వాడవవుతావు. ఊర్ధ్వలోక జ్ఞానము, అక్కడ శక్తులను ఉపాసించడం, అది ఏ కొంచెంగా చేసినా నీకు మంచి ఫలితమే ఉంటుంది గాని అది ఎటువంటి పతనావస్థకు దారి తీయదు.

మరొకరి మతం మార్చే ఉద్యమం రాజకీయమూ, సాంఘికము కావచ్చు గాని ఓ ఉత్తమ సంస్కరణ కాగలదా? ఇది మేధావులు, పండితులు చర్చించి నిర్ణయిస్తే ఎన్నో వౌలిక ప్రశ్నలు పుట్టగలవు. వాటికి మంచి సమాధానాలు దొరకగలవు. అది సమాజం యొక్క విజ్ఞానానికి దోహదం చేస్తుంది. వికాసానికి దారితీస్తుంది.Spread iiQ8

May 16, 2015 10:17 AM

65 total views, 0 today