హిందూ ధర్మ చక్రం, The Cycle of Hindu Dharma !

Hindu Dharma Chakram !

 
హిందూధర్మచక్రం !
 
The Cycle of Hindu Dharma !!
 
హిందూ ధర్మ చక్రం, The Cycle of Hindu Dharma
విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒక్క తులసిదళాన్ని తన పాదాలచెంత సమర్పించడం వలన, వివిధ రకాల పూలతో పూజించిన ఫలితం దక్కుతుంది.
 
అందుచేత పూజా మందిరాల్లోనూ స్వామివారిని తులసిదళాలతో పూజిస్తుంటారు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమనీ … అందువలన స్వామివారు తులసికోటలో నివాసముంటాడని పండితులు చెబుతున్నారు.
 
 
విష్ణుమూర్తి అనుగ్రహం కోసమే చాలామంది ఇంట్లో తులసీకోటను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. అనునిత్యం తులసికి నీళ్లు పోసి దీపం పెట్టి ప్రదక్షిణలుచేస్తూ పూజిస్తుంటారు. ఇంకా గోవింద నామాలు చెబుతూ తులసిని పూజించడం వలన, సమస్తపాపాలు దోషాలు నశిస్తాయి.
 
 
దారిద్ర్యం వలన కలిగే బాధలు, వ్యాధులు దూరమైపోతాయి. సిరిసంపదలు, సుఖశాంతులు చేరువవుతాయి. 
 
  • పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం, దివ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం … 
 
గోదానం చేసిన ఫలితం విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించడం ద్వారా లభిస్తుంది.
 

హిందూ ధర్మ చక్రం, The Cycle of Hindu Dharma

*ఎవరు బ్రాహ్మణులు – ఏది బ్రాహ్మణవాదం*  

హిందూ ధర్మ చక్రం, The Cycle of Hindu Dharma – ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది.

ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది.

 

పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది.

 

ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం.
వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.
వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ?
దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ?
అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి.
ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.
★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.
★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.
★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.
★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.
★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.
★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.
★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.
★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.
★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.
★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.
★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.
★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.
★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.
★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.
★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.
★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.
★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.
★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.
★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.
బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.
మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
 
Spread iiQ8

April 25, 2015 7:27 PM

661 total views, 1 today