దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు iiQ8 info

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు

 

 

ప్రతి ఇంట్లో ఉదయం, దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది.

 

108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names

 

అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే.

 

అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా ? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ? కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది.

నిత్యం చేసేదే అయినా.. దీపారాధనలో కొంతమంది తెలిసీ, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని..

మరోసారి చేయకుండా ఉండటం మంచిది. సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం..

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు
* దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?

 

* దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?

01. దీపారాధనకు వేరుశనగ నూనె అస్సలు ఉపయోగించరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం, ఆముదం ఉపయోగిస్తే కష్టాలు దూరమవడం, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు, శత్రుబాధలు తొలగిపోతాయి.

02. దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం.

03. దీపారాధకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించడం మంచిది.

04. అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు.

05. దీపం కొండెక్కితే ఓమ్ నమః శివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి.  ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.

06. దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది.

07. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.

08. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.

09. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.

 

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు

 

Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి





Pushpavathi Niyamalu, Mature function process అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8


Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Veedhi Potu Veedhi Shoola, వీధి పోటు లేదా వీధిశూల, మంచి చేసే వీధి పోట్లు, iiQ8

Spread iiQ8

March 31, 2016 8:37 PM

535 total views, 0 today