Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri

What is the significance of Shivratri? 
 శివరాత్రి విశేషం ఏంటి ?
 

ఎందుకు మనం శివారాత్రి జరుపుకుంటాము ? Why do we celebrate Shivratri? 

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.

శివరాత్రి పూజా విధానాలు :

220px Divine Shringaar

శ్రీనగర్ లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం.

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో “మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది” అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున UUపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్ ఓం నమః శివాయః


రుద్రాభిషేకం

వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్రం

పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు “న” “మ” “శి” “వా” “య” (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం

మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

శివసహస్రనామస్తోత్రం


శివసహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి.

ఒక సారి బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంత గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగినారు. 

వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మాఘమాసం చతుర్దశినాడు వారి ఇరువురుకు మధ్య జ్యోతిర్లింగంగా రూపుదాల్చాడు.
 
వారు ఇరువురు ఆలింగం యొక్క ఆది అంతాలకు తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూవెళ్ళగా, బ్రహ్మదేవుడు హంసరూపందాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. 

చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణువేడుకుంటారు.

Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care

అప్పుడు ఆ పరమ శివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టినాడు. 

దానితో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి వానికి విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే “మహాశివరాత్రి” అయ్యింది.

 

 

images%2B%25283%2529

What is the significance of Shivratri? 

Why do we celebrate Shivratri?

Once upon a time there was arrogance between the idols of Brahma and Vishnu and how great was it in the end? Competed for the status quo.

Lord Shiva, who was watching them, formed a Jyotirlinga between the two of them in the month of Chaturdashinadu with the intention of subduing their ego and giving them a good lesson.

As they both searched for the foot of the Jyotirlinga in the form of Vishnumurti in the form of a boar, Brahma flew across the sky in the form of a swan.

Eventually they find themselves lost and seek refuge in God.

Then Lord Shiva appeared with His reality and blessed them and lost their pride.

 




 

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

 

Spread iiQ8