Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

 

సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.

 

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

 

సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు.

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!

ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష కార్తికేయస్వరూపం, సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం, అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం, నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం, ఇది దొరకడం చాల కష్టం. దీనిలో విద్యా, ఙ్ఞాన, క్రియా, శాంత, వామ, జ్యేష్టా, రౌద్రా, అంగ, పశ్యంతీ అను నవ శక్తులు ఉంటాయి. అందుకే నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం, ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశరూపం, ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్యరూపం. ఈ విధంగా రుద్రాక్షలకు దేవతా స్వరూపములకు దగ్గర సంబందం ఉంది.

 

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

 

Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu


Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు”  *భగవద్గీత లో ఇలా అన్నాడు…*

 

ధనం, శాంతి , కోరికలు, విజయాలను సిద్దింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ పురాణం చెపుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయి. అయితే అంతకన్నా ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉండవచ్చు. రుద్రాక్ష ముఖాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి.

 

ఏకముఖి రుద్రాక్షను చూడటం వల్లే పాపాలు నశించి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది.

ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరతాయి.

త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించిన సర్వ కార్యాలు సిద్దిస్తాయి.

చతుర్ముఖి రుద్రాక్షను తాకినా చూసినా సకల పాపాలు నశిస్తాయి.

పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది.

షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజాన ధరిస్తే సర్వ పాపాలు నశించి శుభం చేకూరుతుంది.

సప్తముఖి ధరిస్తే దరిద్రం నశించి ధనవంతులవుతారు.

అష్ట ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల దీర్ఘాయుష్కులవుతారు.

నవముఖి రుద్రాక్ష నవ దుర్గ రూపి. ఎడమ చేతిన ధరిస్తే శివతుల్యత్వం వస్తుంది.

దశముఖి రుద్రాక్షను ధరించినవారికి సకల కోరికలు నెరవేరతాయి.

ఏకాదశముఖి రుద్రాక్ష వల్ల అనుకున్నవి అన్నీ నెరవేరతాయి.

ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల తేజస్సు కలుగుతుంది.

త్రయోదశముఖి, చతుర్థముఖి రుద్రాక్షల వల్ల సకల కోరికలు నెరవేరతాయి.

ఇక రుద్రాక్షలున్న మాలతో జపం చేసే వారికి మాలలో రుద్రాక్ష సంఖ్యను బట్టి ఫలితాలు చేకూరతాయి.

25 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేస్తే ముక్తి వస్తుంది.

27 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేసిన వారికి పుష్టి కలుగుతుంది.

54 రుద్రాక్షలున్న జపం చేస్తే హృదయానికి మంచిది.

108 రుద్రాక్షలు గల జపమాలతో జపం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి.

రుద్రాక్షను మెడలోగానీ, చేతికి గానీ , నడుముకు గానీ కట్టుకోవాలి.

పిల్లలకు ధరింప చేస్తే బాలారిష్ట దోషాలు పోవటమే కాక అనారోగ్యాలు పోయి ఆరోగ్య వంతులవుతారు.

 

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

 

Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.


Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు

Spread iiQ8

April 1, 2016 10:07 PM

773 total views, 0 today