Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు

శ్రీ కృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు 🙏

Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita

 

ఒక పురుగు దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు•

అలాగే చెడు చంపితేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మం ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రుడివి .. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది… మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు•

కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. ఇది ధర్మమా కృష్ణా!* అని…, అప్పుడు కృష్ణుడు చెప్పాడు. నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు…… కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మమే.

యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్దం చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ మరునాడు శివుణ్ణి దూషిస్తాడు… నీవు భక్తుణ్ణి రక్షించలేదని… ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడ్డాడు.

అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి… కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం… మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు… వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి కదా!

 

Bhagavad Gita in 100 Sentences Telugu , భగవద్గీత, మహాభారతము సమగ్ర సారాంశము

 

అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు *”అశ్వత్థామ హతః”* అని పెద్దగా చెప్పి *”కుంజరహః”* అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు​ ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి…

పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు…

పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి… ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది… ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా అనుకోరు.

కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో​ ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు… అప్పుడు మనం ఏమి చేయగలము… వారికి బానిసలు కావాలి…

అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు… దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత యిస్తుంది… దీనుడైన అర్జునుడిని ధీరునివలె భగవద్గీత మార్చివేసినది.

 

Ashwatthama Hathahath, Narova Kunjarova, Sanatana Tales

 

అదేవిధంగా… చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.

భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే… *గీతా పారాయణ కన్నా గీతా ఆచరణ ముఖ్యం* అన్నారు… భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అంటే. వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరంలేదు… ఒక్క పుల్ల చాలు..

బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము.

చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు… గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు.. కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము.

Dwaraka in Sea, These are the reasons, ద్వారక సముద్రంలో నిద్దరోతోంది! కారణాలు ఇవేనా?


When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales

Dharma_sutras_said_by_Sri_Krishna_in_the_Gita🙏

Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita

 

When a worm enters the body, the disease starts. If you go to the doctor, he will remove the part, saying that the disease will be cured only if the part is removed.

Also good comes only when evil is killed. If today passes, tomorrow will come.. According to the dharma of time, you have to kill them.. You are the only one.. One who is born must die. If you fight, you will get dharma pratishta, karma pratishta, kirti pratishta.

As Karna dies he asks.. This is Dharma Krishna!*, then Krishna says. You see only one dharma, but I see dharma with this whole universe in mind. A lion eats meat. A cow eats vegetarian food.. and does not eat meat food…… so whatever God says and does is dharma.

If the king falls under the crown in the war then the king dies.. In Ramayana if Ravana falls under the crown, Rama did not fight.. , he left.. the next day he curses Shiva… that you did not save the devotee… Ravana was killed in the next day war when he cursed Shiva.

Also Dronacharya (Guru) should not fight.. Brahmin should give justice to both sides… Fighting with sword is against Dharma… Thieves have come in our house.. They are running away with all the stuff wrapped… Seeing them you ran away.. Thieves are trying to escape in the way of ditches.. , will they get caught if you leave the car on the asphalt road? Shouldn’t we follow the same path to catch a thief!

 

Bhagavad Gita in 100 Sentences Telugu Complete Summary of Bhagavad Gita, Mahabharata

 

That’s why Dharmaraja asked Shri Krishna to say *”Aswatthama Hatah”* in a big way and to say *”Kunjarahah”* in a small way. Iniquity must be conquered by iniquity. Therefore, one should walk with faith believing that whatever God does is for the welfare of the world.

This is why children should be taught Geeta at a young age.

Just as worldly education is necessary for a pottakoot, courage and fortitude to grow mentally requires divine wisdom… in every country the army is ready to fight… why is there a rush from now to the coming war..? Don’t you think you can take care of it only when the war comes?

The reason is that no one knows when war will come. Every now and then enemies will enter our kingdom within preparation… then what can we do… they want slaves…

In the same way, a human being has to face many problems in his daily life.. No one knows when and how any problem will come.

 

Ashwatthama Hathahath, Narova Kunjarova, Sanatana Tales

 

Similarly…those who start reading and practicing Bhagavad Gita from childhood are able to stand bravely and protect themselves from the enemies of lust.

Every shloka in Bhagavad Gita is a mantra. That’s why… *Gita practice is more important than Gita recitation* he said… If we start practicing even one thing said in Bhagavad Gita, all the virtues will come and join us. That is. You don’t need all the matches to cook… just one pulla..

No matter how many times we chant Bangalore, Bangalore, we cannot reach Bangalore.. If we start the journey, we can reach the destination.

Even an ant can reach Kashi if he starts walking… If Garuda bird sits and does not fly, it will not take a single step forward.

Spread iiQ8

January 13, 2023 7:09 PM

303 total views, 0 today