భగవంతుడిని రప్పించే శక్తి అదే !, The power to bring God out
The power to bring God out ! - భగవంతుడిని రప్పించే శక్తి అదే !
God’s power భగవంతుడిని రప్పించే శక్తి అదే !...
ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు ఆరాధిస్తూ వుంటారు. మరికొందరు తాము విశ్వసించిన దైవాన్ని అదేపనిగా సేవిస్తుంటారు. భగవంతుడికి సమర్పించకుండా వీళ్లు మంచినీళ్లు కూడా స్వీకరించరు.
ఒకవైపున వీళ్లు దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూనే, దైవారాధనచేస్తూ వుంటారు. అలాంటి భక్తికి పరవశించిన భగవంతుడు వారి ఇంటికి రాకుండా ఎలా ఉండగలడు ?
అలా శివపార్వతులు అతిథులుగా మారువేషాల్లో చిరుతొండనంబి ఇంటికి వస్తారు. ఆయన భార్యాబిడ్డల భక్తిశ్రద్ధలను సైతం పరీక్షించి పరవశించిపోతారు.
అడిగిన విధంగా వాళ్లు ఇచ్చిన ఆథిత్యానికి సంతోషించి, ప్రత్యక్ష దర్శనంతో అనుగ్రహించి వెళతారు. ఇక త్యాగయ్య తన కృతులతో రాముడిని అభిషేకిస్తూ ఉండేవాడు. రాముడిని కీర్తించడంలో కలిగే ఆనందానికి మరేదీ సాటిరాదని ఆయన విశ్వసించేవాడు.
అలాంటి ఆ భక్తుడి ఇంటికి కూడా సీతారాములు అతిథులుగానే వస్తారు. అడిగిమరీ ఆయనచే కీర్తనలు పాడించుకుని ముగ్ధులవుతారు.
Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమ…
Read more
about భగవంతుడిని రప్పించే శక్తి అదే !, The power to bring God out
