Important Points for Visitors to Arunachalam Shiva Temples – అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని ముఖ్యమైన విషయాలు
ఒక చిన్న మనవి :
మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్
అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు.
1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది.
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి, తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఈ పరిక్రమణ పూర్తి అవుతుందనుకోవద్దు..
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా ఖచ్చితంగా, అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది… అక్కడ, ఆ స్వామికి నమస్కరించి అక్కడినుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే, పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి..
2. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున అరుణ గిరికి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట! అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు.
3. అరుణాచలం వెళ్లే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి.ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఇస్తారు. ఆ విభూది పిల్లలు జడుసుకున్నప్పుడు, కార్యసిద్ధికి పనికివస్తుందని నమ్ముతారు.
Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి
4. దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్లేటప్పుడు రెండు చిన్నచిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు.
5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘంగా పనిచేస్తుందని చెబుతారు.
6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుందని చెబుతారు.
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు.
7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని, మధ్యలో గాని… ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది. ఆరోగ్యంకూడాను.
8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షణ చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. అది నా స్వానుభవం కూడానూ!!
9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది.వీలైనంతవరకూ, కూర్చోకుండా నిలబడి గానీ, తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకునిగానీ, చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ పరిక్రమణ చేయండి. కూర్చోవడం అంటూ మొదలు పెడితే, చాలా ఇబ్బందులు ఉంటాయి. కూర్చున్న చోటునుంచి లేవలేము.
10. కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు, అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మాత్రమే మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి, గోత్ర నామాలు చదివి, విభూతి ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయ లేకపోతే, అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.
11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, దానిని
తప్పనిసరిగా దర్శనం చేసుకోండి.
12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద స్తంభాలతో, అతి పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం పైకి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేసారని చెబుతారు. దానిని దర్శించి, కొంచెంసేపు ఆ మంటపంలో జపమో, ధ్యానమో చేసుకుంటే చాలా బావుంటుంది.
13. రాజ గోపురానికి కుడి వైపున ఆనుకొని, ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు ఉండే బృందావనం.
14. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం. ఆ మంటపం, గోపురం, మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్, అనే ఆవిడ కట్టించినట్లు చెబుతారు.
15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతి పెద్ద కాలభైరవుని విగ్రహంతో ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి.
16. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది. దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చూసి రండి.
17. ఆ ప్రక్కనే ఉన్న దేవాలయంలో… ఉన్నామలై అమ్మన్ (అపితకుచలాంబ) అమ్మవారిని దర్శించుకుని, ఆ ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. దక్షణ వేయని, వేయలేని వారికి ప్రక్కనే పళ్ళెంలో కుంకుమ ఉంచుతారు. బొట్టు పెట్టుకొని కొంచెం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చును.
18. అగ్ని లింగానికి, రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, ఆ విగ్రహం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు.
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఇది అగ్ని లింగం. కనుకనే ఎంత చలికాలంలో వెళ్లినా గర్భగుడిలో విగ్రహ పరిసరాలు, భూమి కూడా వేడిగా ఉంటాయి.
ఒకవేళ, మీరు గురువారం రోజున అక్కడ ఉంటే తప్పని సరిగా దీపం వెలిగించండి. ఒక రూపాయకు శెనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి. అది స్వామి వారి మీద వేస్తారు.
First Look of New Hindu Temple in Dubai, open on 5th October 2022
19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ప్రశాంతంగా కూడా ఉంటుంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలో వలె, ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.
ఇక్కడ ఉదయం ఉపాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు. దానం మన ఇష్టమొచ్చినంత ఇవ్వవొచ్చు.
విదేశీయులు కూడా మనతో పాటుగా, సహబంతి భోజనాలు చేస్తారు. మనతో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు. వీలైతే ఎప్పుడూ కూడా కనీసం
ఒకసారి అయినా అక్కడి ప్రసాదం స్వీకరించండి.
20. ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు. వారిని ఒకసారి దర్శనం చేసుకొని తరించండి
పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం.
అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.
#సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి లభిస్తుంది.
#మంగళవారం ప్రదక్షిణం చేస్తే
పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.
#బుధవారం గిరి ప్రదక్షిణం చేస్తే లలితకళలలో రాణింపు, విజయం లభిస్తుంది.
#గురువారం గిరి ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
ప్రతి #శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.
#శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే
నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.
Who is Aryabhatta? Aryabhatta challenged many superstitious theories
Birth of Lord Shri Krishna and Goddess Yogmaya
#ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది.
సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో గిరి ప్రదక్షిణలు చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.
గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది. రెండవ అడుగులో పవిత్ర తీర్ధాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన
పుణ్యం లభిస్తుంది. నాలుగవ అడుగు వేయగానే
అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుంది.
తిరువణ్ణామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేసి వస్తే పాప విమోచనం లభిస్తుంది.
భరణీ దీపం రోజున ప్రాతఃకాలమున మూడున్నర ఘంటలకు ఒక సారి, ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం
దీపదర్శన సమయాన ఒకసారి రాత్రి 11గం.లకు
ఒకసారి అని ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే
ఘోర పాపాలన్నీ హరిస్తాయి.
గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో.. నిద్రపోవడమో చేయకూడదు.
వాటివల్ల పుణ్యఫలం తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.
భారత దేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలం లో మాత్రమే శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది..
పార్వతి మాత ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.
Hierarchy of Army and Soldiers in Mahabharata
ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు..
అప్పుడు అమ్మవారు ఇలా అడిగారు “మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది” అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు..
”పార్వతి.. పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు.. నేను సరే అన్నాను..
ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరకి వెళ్లి ఇలా అన్నాను “పులగా.. నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు నీ వెంట పడడం జరుగుతుంది.. నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలేయ్” అని అన్నాడు…
దానికి అదిసరే అని ఒక చిన్నకోరిక కోరుతుంది.. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే..వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి ప్రభూ అని అడుగుతుంది.. అందుకు శివుడు అంగీకరిస్తాడు..
అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అద్దుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది.
అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు..
”స్వామీ.. మీరు కొలువైయున్న ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఏమి ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి.. పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి.. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్ళి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి.. అంతే కాదు.. నిన్ను శరణు కోరి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వాళ్ళు నిన్ను ఏ కోరిక కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి..” అని ఇలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది.. అందుకే మనకి అరుణాచలంలో స్వామి వారు నిండుగ దర్శనం ఇస్తారు.
Birth of Lord Shri Krishna and Goddess Yogmaya
కాబట్టి అరుణాచలంలో శివుడినైనా, తిరుమలలో శ్రీనివాసుడినైనా ఏది కోరాలి అన్న ముందు అమ్మని అడగాలి.
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. ” సంభవామి యుగే యుగే ” ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే ” సంభవామి యుగే యుగే “ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం
అందరం భక్తితో ” అరుణాచల శివ ” అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం … ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు