How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది? iiQ8 info

How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది?

 

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు | How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది? iiQ8 info.

మన పాపకర్మే గ్రహరూపంలో బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.

పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.
కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.
ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.

తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.

అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు.

అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని అన్నాడా కశ్యపుడు.

 

*********కర్మ సిద్ధాంతం*****5

అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి
ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.

వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో… లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు.

ఇంతకూ తమకు కావలసింది…. అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.

 

Glory of Vibhuti, by Lord Shiva, వీభూతి యొక్క మహిమ

 

*ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.*

*మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.*
ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం.
అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.
*పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా

ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి.
కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.
ఏమిటి ఆ పాప కర్మ?
ఒక ముని మీద చచ్చిన పామును వేయడం.
*మంచివారితో మహాత్ములతో చెలగాటం*.
కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.

రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, *కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.*

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! *మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది*.

మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.
నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.
*మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది*.
కర్మ బలీయమైనది.

గోవిందా, నారాయణా, రామా,శివా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం. *ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా?* నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.

మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.
గురు అనుగ్రహం వున్నదా?
గురు దృష్టి వున్నదా?
శుభగ్రహ దృష్టి వున్నదా?
వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.
పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.

*”మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది.”*
*”మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది”* .

 

Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ

 

పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ.
కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.

తాతముత్తాతలు చేసిన *పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది*.
ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.
ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.

*మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము*.
వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.
మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా!
కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ
చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.
*అదే కర్మఫలం, కాల మహిమ*.

*కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు.* దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి.
తక్షకుడు విషనాగు అంటే *ప్రారబ్దకర్మ*. దానిని కూడా జయించింది *మంత్రశాస్త్రం*.
కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.
అంటే *మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది* అని మనం తెలుసుకోవాలి.
మంత్రం ప్రాణం పోస్తుంది.
కానీ ఆ *మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!

అందించిన వారు:
గోపరాజు రాజేంద్రప్రసాద్
ఆధ్యాత్మిక రచయిత

** సర్వే జనాః సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు **

 

Do you know who first invented Weeks, వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా

How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది? iiQ8 info

*********The theory of karma*****5

How will be the result of karma?

Karma will surely come to an end
Our sinful karma hurts planetarily. Why? Karma is the victim.
Takshakudu has set out to bite the tested king.

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

Brahmanottam is a great magician at Kashyapudu. He left for Rajaprasadam to protect the king. The two bumped into each other along the way.
Takshakudu also dressed as Brahmin, Mahatma after seeing Kasyapu! Who are you guys? Where is the journey to? Asked as if.
I am some poor Brahmin. When the king said that he will give you wealth, he said the real thing without any hesitation that he is celebrating that he got the chance to use his mantramahima.

Innocent Brahmin! Do you think the one who is going to bite the king of exam is a water snake or mud snake? Is another Sarpadipu who is equal to Sarparaju Vasuki himself? Said.

At least believe it! Believe it to be a primitive than him! Do you think I have Garadivadi’s snake mantra or poisonous mantra? That was asked by Kashyapu.
Were you such a great man! He has shown his real face that he is that Takshakudu.

Saffron all the way, sarparaja! My love is for you! Listen to my request with this! Even if you bite the king, you cast the spell to break it, by the divine spell! I can use instant poison spell and save the Lord and get rewarded. Did Kashyapudu say that this is my strong belief.

 

10 Countries with their Devine of Ramayana across the Globe

How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది?

That time the saviour, their confidence is admirable! Earthquake! Just look at this kind of tree! It is so dense that you can’t know what is its shell and what is the beginning! It is also a bait for birds that are impossible to count. Look at my toxicity to ash this as it is! That tree has been bitten by Kasithira.
Kashyap was smiling through it all. There is not even a mustard seed lie in what he said. For those great whiskeys, the tree has turned to ashes even when it is standing, it has become a blind eye right? Look at this now! By taking the ashes from the ashes and chanting mantra with the most devoted devotees
He poured the ashes on the pile and then approached the water.

Figuratively, the big tree is still standing there as usual with all the bird species. The serpent understood that he is not a common man
Immediately he is the one who holds his hands and performs Mahamantraashtra!\n Underestimated them, excuse my ignorance! Did they know that? Or not, in fact, the tested curse is destined to go to the abode of the god of death. Otherwise, it is rare to approach natural death for such a pious person. The grand entrance is about to happen. If Janamejayadu has to be the king by that time, the examiner’s issue should be ended immediately! This is by the grace of the law, but not by the nature of the test.

Well that’s what they wanted…. Dhanamayya, before completing his words, he is rich! Money! Said. That’s it, isn’t it! Take a look at these precious cobras! He said that he will do more diamond rings on you, he gifted valuables from the underground treasures to Kashyapu and sent them.

*so far the story is good. There is a lot we need to understand here. *

*If our fate is not good, those who help us will not be seen near us. *

Even if a person like Kashyapudu has started, time will drag them aside.

That is the result of our sin and karma.
*No one can help you if you are a scapegoat, even God
Because his karma needs to come together.

Veedhi Potu Veedhi Shoola, వీధి పోటు లేదా వీధిశూల, మంచి చేసే వీధి పోట్లు, iiQ8

When Kaushik sets out to save the king, the sinful karma of Parikshin Maharaj got in the way.
What is that poor girl’s karma?

Putting a dead snake on a sage.
*Playing with the good ones*.
He bought his death with ego by asking for it.
The king did not die of the curse or the sting of the shepherd, *he died only by his karma. *
To the test king, no harm happened by the planets. As the saviour here is just as important, so are the planets! *For humans, planets are involved in bearing the fruit of karma*.

Our sins in the form of planets make us suffer the consequences of karma.
Actually no planet can do anything to us.
*Our sins will come in the form of planet and hurt us*.
Karma is the victim.

Govinda, Narayana, Rama, Shiva! Save! Save! Let’s just keep praying. *God says this by looking at the horoscope of the person who is in danger of death. Hey, have you ever done good? * did your wife do that ? Did your kids do it? Have your friends ever done good to you? Do you have the blessings of teachers? There is no good deed that you have done, there is no good deed given to you by others. So where do I get it from? Experience it! He says it’s your karma.
Our virtues will appear in our horoscope in the form of Guru.
Do you have the blessings of Guru?

Do you have a vision of the Guru?
Is there auspicious sight of the planet?
We will survive if we stay. Or be hurt, no way.
Sin means hurting the body and thus the mind.

*”Sin will vanish only if the heart is hurt. “*
*”If the mind is happy, the good deeds will vanish”* .

 

Hanuman Ji had doubts about his capabilities, Jambavan

 

Heart is the reason for sin and virtue. If that mind is not moving, there is no virtue or sin. That is karma, Vikarma, Sukarma.
Karma won’t catch up with your heart if you do it without desire.
The *fruit of good deeds and sins done by the grandparents will definitely come to the children, it will come and be fulfilled*.
That virtue will protect our children and grandchildren. Will save our race as well.
This is the second place in our horoscope, ninth place clearly tells.

*The sins we have committed, are due to the virtuous results of our forefathers and ancestors, we will be saved*.
The fruit of their virtue will save us.

Our good deed will protect our children.
Even a person who has the blessings and blessings of Lord Sri Krishna also fell in love right!
The one who made Kalipurushu stand is also under ego. Sri Krishna is the supreme soul
The one who was saved by the hand and escaped from the womb, why did not he escape from the death today.
*That is the result of karma, the glory of time*.

*No one is greater than time and magic. *we need to observe another one of these
Takshakudu is poisonous snake means *prarabdhakarma*. That also won by *magic*.
When the tree that blossomed by the bite turns to ashes, the mantra sprouts it again.
It means *by chanting prarabdhakarma will be removed* we have to know this.
The mantra is coming to life.

But if that *mantra is to work, prarabdha karma should be good! It means we have to do only good deeds!

Provided by:
Goparaju Rajendra Prasad
The author of the spiritual
** May all the people be happy
May all be blessed **

How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది? iiQ8 info How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది? iiQ8 info  How will be the result of Karma, కర్మఫలం ఎలా వుంటుంది? iiQ8 info

Spread iiQ8

December 29, 2022 10:22 AM

505 total views, 0 today