Glory of Vibhuti, by Lord Shiva, వీభూతి యొక్క మహిమ

🙏భస్మం….!!

కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని
వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెల్లెను

Glory of Vibhuti, by Lord Shiva, వీభూతి యొక్క మహిమ

రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా ” నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని
అని అడుగగా శివుడు చెప్పసాగెను

” రామ ! భస్మమహత్యమును చెప్పుటకు
బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది
చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట
బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే
శక్తి భస్మంనకు ఉన్నది

విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును
ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట అభక్ష్యములను తినకుదని పధార్థములను తినడం అనుపాపములు) చేతులపై ధరించిన చేతిపాపములను ( కొట్టటం మొ”) హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములను పక్కలందు ధరించుటవలన పరస్త్రి
స్పర్ష దోషములను పోగొట్టును

పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పడుకొన్నను తిన్నాను ఒంటికి పూసుకున్నను పాపములన్ని భస్మీభూతములు అగును ఆయువు పెరుగును గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును!!

 

Do you know who first invented Weeks, వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా

 

వశిష్ట వంశములో ధనంజయుడను
ఒక విప్రుడు ఉండెను. అతనికి వందమంది భార్యలు వందమంది కొడుకులు వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి ఆ బ్రాహ్మణుడు గతించెను కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి వారిలో కరణుడను కొడుకు శత్రువిజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవా చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను దానిని వీడు వాసన చూసేను అoదుకు మునులు గ్రహించి ఈగవై పొమ్మని శపించిరి

వీపుడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి అంతటా ఏడ్చుచు వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను అతని భార్య పతివ్రత చాల విచారించెను*

ఒకనాడు ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపీరి అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను.

 

10 Countries with their Devine of Ramayana across the Globe

మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పరవేసిరి అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను, ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టేను దానినే ఇతనిపై చల్లుచున్న అని చెల్లెను అతడు శాప విముక్తుడయి జీవించెను, దేవతలు కూడా భస్మ ప్రభావమును పొగిడిరి కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి. అతడు వారిని దీవించి వేడలిపోయేను.

ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ(నమకము)మంత్రముచేప్పుచు కాల్చి భస్మము చేయవలెను మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.

 

Hanuman Ji had doubts about his capabilities, Jambavan

 

ఓం మంత్రము రానీ వారు
ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం అని ”పద్మ పురాణము లో చెప్పబడినది…

ఓం నమః శివాయ నమః🙏

మీ.రాజు సానం🙏

 

 

Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ


Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala அருணாச்சலம் – అరుణాచలశివ

Spread iiQ8

December 27, 2022 2:00 PM

380 total views, 1 today