Excellent story helping hand telugu lo stories | iiQ8 సహాయపడే అద్భుతమైన కథ!

 Excellent story – సహాయపడే అద్భుతమైన కథ! 

Excellent story helping hand Telugu lo stories 


కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది .

ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా?

 

Excellent story helping hand telugu lo stories


దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు  ( సిగ్నల్స్ లేవు ).

ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..

అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది…..ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ? 

Great Heart Moral Story – గొప్ప మనసు

ఏమి చేస్తాడు .? 

ఆందోళన !.

అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ? 

టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు .” భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను” అన్నాడు.

ఆమె భయపడుతూనే ఉంది .

” నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను ” అన్నాడు . అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి కారులో పెట్టాడు ..

ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు .” మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది” అంది.

” నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి ” అని వెళ్లి పోయాడు…

మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి …

Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం


అదొక చిన్న హోటల్ . Excellent story helping hand telugu lo stories 


కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది .

 

Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!

 

 

ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు. ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000 నోటు ఇచ్చింది . ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది .

తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..

ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దాని కింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు . అందులో ఇలా ఉంది ..” చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు . ” అని రాసి ఉంది..

ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . 

గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని….

ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్! 

భగవంతుడే మనకు సహాయం చేశాడు . 

ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు…. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

కేవలం 100 రూపాయలతో కోట్లు ఎలా సంపాదించవచ్చో చెప్పిన బిల్గేట్స్…

 

Spread iiQ8

October 2, 2016 6:10 PM

77 total views, 0 today