Brahma Ratha is like that, బ్రహ్మరాత ఎలా ఉంటె అలా…

బ్రహ్మరాత ఎలా ఉంటె అలా… Brahma Ratha is like that, 

 

సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు “బ్రహ్మ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది”, “ఆయన ఇచ్చిన ఆయుష్హు ఉన్నంత వరకు బతుకుతూనే ఉంటాం” అని అంటూ ఉండడం కనిపిస్తుంది. అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది.

రావణాసురుడు బ్రహ్మ దగ్గరి నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు, ఋషులు సహా సర్వలోకాల్ని బాదించసాగాడు. రాక్షసానందంతో ఆ అసురుడు పుష్పక విమానమెక్కి లోకాలన్నింటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశమార్గాన నారదముని ఎదురయ్యాడు. నారదుడికి నమస్కరించి రావణుడు కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు ఎంతో సంతోషించి రావణుడి ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు.

దేవతలందరినీ జయించడమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అంతగా కష్టపడి అందరి మరణానికి కారకుడైన యమధర్మరాజును జయించినందువల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని, ఆ ప్రయత్నం చేసి చూడాలని చెప్పాడు. యమపురికి వెళ్ళే మార్గం చాల కష్టతరమైందని నారదుడు రావణుడిని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. రావణుడు వెంటనే యమపురికి బయలుదేరాడు.

ఇంతలో నారదుడు వెళ్లి యమధర్మరాజుకు రావణాసురుడు యుద్ధానికి వస్తున్నట్లు చెప్పాడు. నారదుడు అలా చెప్పుతున్నంతలోనే గొప్ప కాంతులతో విరాజిల్లుతున్న పుష్పక విమానమెక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు. ఎన్నో పాపాలు చేసి వాటికి తగిన ఫలితాన్ని అనుభవిస్తున్న ఎందరెందరినో రావణాసురుడు అక్కడ చూసాడు. భయంకరమైన రూపాలు కలిగిన యమకింకరులు అక్కడ ఉన్నారు. ఆ కింకరులు పెట్టె బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండడం కనిపించింది. కొంత మంది పురుగులకు, మరికొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకలు పెట్టడం కనిపించింది. మరికొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరణి నదిని దాటి కాలుతున్న ఇసుకలో దొర్లాడుతూ పెడబొబ్బలు పెడుతూ యాతనలు పడుతున్నారు.

మరికొంతమంది పుణ్యాత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూసాడు. సంగీత వాయిద్యాలను వింటూ కొంత మంది సంతోషిస్తున్నారు. గోదానం చేసిన వారు పాలను, అన్నదానం చేసిన వారు గృహవాస సుఖాన్ని అనుభవిస్తూ కనిపించారు. యమభటుల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపాత్ములు కొంత మందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు. పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవడంతో యమభటులకు కోపం వచ్చింది. వెంటనే ఆ భటులంతా రావణాసురుడినీ, అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్పక విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేసారు. బ్రహ్మ వరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్లీ మాములుగా ప్రత్యక్షమైంది. యమభటులు, రావనసేన ఘోరాతిఘోరంగా యుద్ధం చేయసాగారు. యమభటులు మంత్రులను విడిచిపెట్టి రావణాసురుడిపైకే శూలవర్షాన్ని కురిపించారు.

What to ask Lord Shiva? శివుడిని ఏం అడగాలి? भगवान शिव से क्या मांगें?

ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు, కవచం పడిపోయింది, కొద్ది క్షణాలు ఆగి మళ్లీ లేచి పాశుపతాస్త్రాన్ని సంధించాడు. యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు. వెంటనే రావణుడు అతడి మంత్రులు జయజయధ్వానాలు చేశారు, ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన వెంట మూడు లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యుదేవత బయలుదేరింది. యమధర్మరాజు కాలపాశంతోను, ముద్గురం లాంటి ఆయుధాలతోను రావణుడి మీద అగ్రహించి బయలుదేరాడు. అలా కోపంతో వస్తున్న యమధర్మరాజుని చూసి రావణాసురుడి మంత్రులంతా తలా ఒక దిక్కుకు భయంతో పరుగెత్తారు. యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్కచేయలేదు. అలాగే మొండిగా నిలుచున్నాడు. యముడు మరీ కోపంతో తన దగ్గరున్న శక్తి, తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు.

ఆ ఆయుధాల దెబ్బలు తగిలినా రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. ఆ యుద్ధం చూడటానికి దేవతలు, గంధర్వులు, ఋషులు, బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు. రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యుదేవత పైకి నాలుగు బాణాలు, యముడి మీదకు అనేకానేక బాణాలను వదిలాడు. అందుకు కోపించిన యముడు ముక్కుపుటలనుంచి గొప్ప అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఆ అగ్ని రావణాసురుడిని దహిస్తుందని మృత్యువు, యముడు అనుకున్నారు. అలా జరగక పోయేసరికి మృత్యువు యముడితో తనను రావణుడి మీదకు వదలాలని, వాడిని నాశనం చేసి వస్తానని పలికింది. యముడు తానే స్వయంగా రావణుడిని సంహరించాలని తన చేతిలో ఉన్న కాలదండాన్ని పైకెత్తాడు, శత్రువు మీదకి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాశం, ముద్గరం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి.

ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంత గజగజ వణికిపోయారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని యముడిని వారించాడు. కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించడం తప్పదని, అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్లుగా అవుతుంది కనుక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి నచ్చజెప్పాడు. బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

Gudi Padwa, 𝐂𝐡𝐚𝐢𝐭𝐫𝐚 𝐒𝐡𝐮𝐤𝐥𝐚 𝐏𝐫𝐚𝐭𝐢𝐩𝐚𝐝𝐚, గుడి పడ్వా

 

రావణాసుర చరితంలోని ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు, ఆ రాక్షసుడు బ్రహ్మ వలన వరం పొంది దేవతలను ఎంతగా ఇబ్బంది పెట్టాడో విశదం అవుతుంది. ఇలాంటి అనేకానేక కారణాలు రామావతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి. దీని ద్వారా తెలిసిందేమంటే పూర్వ జన్మలో జయవిజయులలో ఒకడైన రావణుడు శ్రీవిష్ణు తో మాత్రమే యుద్ధం చేసి చనిపోయి మూడు జన్మలు ముగించి శ్రీహరి ద్వారపాలకులుగా చేరాలి, దానికి శ్రీహరితో యుద్ధం చేసి మరణాన్ని పొందడమే మార్గం, కాబట్టి బ్రహ్మరాత మన కర్మఫలాన్ని అనుసరించి లెక్కలు వేశాకే రాయబడుతుంది, కాబట్టి బ్రహ్మ తనకు తోచినవిధంగా రాయాటానికి లేదు. కాబట్టే బ్రహ్మ రాసిన రాత తప్పదు అంటారు.

Brahmaratha is like that…

Generally, the elders of the society are seen saying, “As Brahma Ratha says, so will it be”, “We will continue to live as long as the life span given by him”. An example of such words is the story of Ravanasura.

After getting boons from Brahma, Ravanasura went on to harm all the worlds including gods and sages. One day when the asura Pushpaka was invading all the worlds in a flight of demons, he met Narada in the sky. After bowing to Narada, Ravana asked Kushala questions. Narada was very happy and inquired about the reason of Ravana’s journey.

Ugadi Date Telugu Panchangam Calendar, Ugadi ఉగాది ఆచారాలు

 

Ravana says that the goal of his journey is to conquer all the gods. Then Narada said that if he worked so hard and defeated Yamadharmaraja, who was the cause of death for all, there would be more results and he should try and see. Narada warns Ravana that the road to Yamapuri is very difficult. That warning seemed to give the monster more enthusiasm. Ravana immediately left for Yamapuri.

Meanwhile, Narada went and told Yamadharmaraja that Ravanasura was coming to battle. As Narada was saying this, Ravanasura entered the Yamaloka on the Pushpaka Vimana, which was bursting with great lights. There, Ravanasura saw many people who had committed many sins and were suffering their due consequences. Yamakinkaras with monstrous forms were there. It was seen that all the sinners were crying because they couldn’t bear the pain of the box. Some were fed to worms and some to dogs and were seen screaming terribly. A few others crossed the blood-flowing Vaitarani river and rolled in the burning sands, suffering blisters.

Ravana saw some other pious people in a nearby place. Some people enjoy listening to musical instruments. Those who donated Godanam were seen enjoying milk and those who donated food were enjoying the comfort of home. Ravana pulled aside some of the sinners who were suffering at the hands of the Yamabhatas so that they did not suffer. The Yamabhatas became angry as Ravana prevented the sinners from getting their due punishment. Immediately all those knights faced Ravanasura and his army. Ravanasura surrounded Pushpaka’s flight and broke it into pieces. Because of Brahma’s boon, that flower plane appeared normally again. The Yamabhatas and Ravana’s army continued to fight fiercely. The Yamabhatas left the ministers and showered the rain on Ravanasura.

Unable to bear the pain, he fell down, the shield fell, stopped for a few moments, got up again and met the pashupatastra. The Yamabhatas took a step back. Immediately Ravana and his ministers chanted triumphantly, and Yamadharmaraja heard the sound and himself set out to conquer the enemy. Along with him went the god of death who had the power to destroy the three worlds. Yamadharmaraja went out with Kalapasha and weapons like Mudguram enraged at Ravana. Seeing Yamadharmaraja coming in anger, all the ministers of Ravanasura ran in fear in one direction. Ravana did not count on the arrival of Yamadharmaraja. He also stood stubbornly. Yama got very angry and threw his weapons of Shakti and Tomaram at Ravana.

Despite the blows of those weapons, Ravanasura stood still without counting. Gods, Gandharvas, Rishis and Lord Brahma came there to see the battle. Ravanasura raised his bow and shot four arrows at the god of death and several arrows at Yama. Great flames came out of the nostrils of the angry Yama. Death and Yama thought that fire would consume Ravanasura. When that didn’t happen, she said that she would release herself to Ravana with Yama and destroy him. Yama himself raised the kalapasha in his hand to kill Ravana, weapons like kalapasha and mudgaram were ready to attack the enemy.

Seeing that dire situation, they trembled as much as the gods. Lord Brahma saved Yama. Lord Brahma asked Yama to withdraw his anger, saying that Ravana would surely die if he used the staff of time, and if that happens, the boon he had given him would be a failure. Respecting Brahma’s words, Yama turned back and left.

When we see such scenes in the story of Ravanasura, it becomes clear how much trouble the demigods got from Brahma. Many such reasons led Vishnu to come to earth in the form of Rama. From this it is known that Ravana, who was one of the Jayavijays in the previous life, fought only with Sri Vishnu and died after three births and joined Sri Hari as the gatekeepers. The way to do this is to fight with Sri Hari and get death, so Brahma Ratha is written based on our Karmaphala and calculations, so Brahma is not able to write as he sees fit. So the writing written by Brahma is said to be wrong.

ऐसा ही है ब्रह्मरथ…

आम तौर पर समाज के बड़े-बुजुर्ग यह कहते नजर आते हैं, ”जैसा ब्रह्मरथ कहते हैं, वैसा ही होगा”, ”जब तक उनकी दी हुई उम्र होगी, हम जीते रहेंगे.” ऐसे शब्दों का एक उदाहरण रावणासुर की कहानी है।

 

Ugadi Pachadi – 6 రుచుల ఉగాది పచ్చడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, జీవత సూత్రాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

 

ब्रह्मा से वरदान प्राप्त करने के बाद, रावणासुर ने देवताओं और ऋषियों सहित सभी लोकों को नुकसान पहुँचाया। एक दिन जब असुर पुष्पक राक्षसों की उड़ान में सभी लोकों पर आक्रमण कर रहा था, तो वह आकाश में नारद से मिला। नारद को प्रणाम करने के बाद रावण ने कुशला से प्रश्न किया। नारद बहुत खुश हुए और रावण की यात्रा का कारण पूछा।

रावण कहता है कि उसकी यात्रा का लक्ष्य सभी देवताओं को जीतना है। तब नारद ने कहा कि यदि उन्होंने इतनी मेहनत की और यमधर्मराज को हरा दिया, जो सभी के लिए मृत्यु का कारण था, तो और भी परिणाम होंगे और उन्हें कोशिश करके देखना चाहिए। नारद रावण को चेतावनी देते हैं कि यमपुरी का रास्ता बहुत कठिन है। उस चेतावनी से राक्षस का उत्साह और बढ़ गया। रावण तुरंत यमपुरी के लिए रवाना हुआ।

इस बीच, नारद ने जाकर यमधर्मराज को बताया कि रावणासुर युद्ध के लिए आ रहा है। जैसा कि नारद यह कह रहे थे, रावणासुर पुष्पक विमान पर यमलोक में प्रवेश कर गया, जो बड़ी रोशनी से फूट रहा था। वहाँ रावणासुर ने बहुत से लोगों को देखा जिन्होंने बहुत से पाप किये थे और उसका उचित परिणाम भुगत रहे थे। राक्षसी रूप वाले यमकिंकर थे। देखा गया कि सभी पापी सन्दूक की पीड़ा सहन न कर पाने के कारण रो रहे थे। किसी को कीड़े तो किसी को कुत्तों को खिलाया और बुरी तरह चिल्लाते नजर आए। कुछ अन्य लोगों ने खून से लथपथ वैतरणी नदी को पार किया और जलती रेत में लुढ़क गए, फफोले पड़ गए।

रावण ने पास के एक स्थान पर कुछ अन्य धर्मपरायण लोगों को देखा। कुछ लोगों को वाद्य यंत्र सुनना अच्छा लगता है। गोदानम दान करने वालों को दूध का आनंद लेते देखा गया और जिन्होंने अन्न दान किया वे घर के आराम का आनंद ले रहे थे। रावण ने यमभट्टों के हाथों पीड़ित कुछ पापियों को खींच लिया ताकि वे पीड़ित न हों। यमभट्ट क्रोधित हो गए क्योंकि रावण ने पापियों को उनकी उचित सजा पाने से रोक दिया। तत्काल उन सभी शूरवीरों का सामना रावणासुर और उसकी सेना से हो गया। रावणासुर ने पुष्पक की उड़ान को घेर लिया और उसके टुकड़े-टुकड़े कर दिए। ब्रह्मा के वरदान के कारण वह पुष्प विमान फिर सामान्य रूप से प्रकट हो गया। यमभट्टों और रावण की सेना में भीषण युद्ध होता रहा। यमभट्टों ने मंत्रियों को छोड़कर रावणासुर पर वर्षा की वर्षा की।

दर्द सहन करने में असमर्थ, वह गिर गया, ढाल गिर गई, कुछ क्षण के लिए रुक गया, फिर से उठा और पाशुपतास्त्र से मिला। यमभट्टों ने एक कदम पीछे लिया। तुरंत ही रावण और उसके मंत्रियों ने जयघोष किया, और यमधर्मराज ने ध्वनि सुनी और स्वयं शत्रु पर विजय प्राप्त करने के लिए निकल पड़े। उसके साथ मृत्यु के देवता भी गए जिनके पास तीनों लोकों को नष्ट करने की शक्ति थी। यमधर्मराज कलापाश के साथ बाहर चले गए और मुद्गुराम जैसे हथियार रावण पर भड़क उठे। यमधर्मराज को क्रोध में आता देख रावणासुर के सभी मंत्री डर के मारे एक दिशा में दौड़ पड़े। यमधर्मराज के आगमन पर रावण की गिनती नहीं थी। वह भी अड़ा रहा। यम बहुत क्रोधित हुए और उन्होंने अपने शक्ति और तोमरम के हथियारों को रावण पर फेंक दिया।

उन अस्त्रों के प्रहार के बावजूद भी रावणासुर बिना गिने खड़ा रहा। युद्ध देखने के लिए देवता, गंधर्व, ऋषि और भगवान ब्रह्मा वहां आए। रावणासुर ने अपना धनुष उठाया और मृत्यु के देवता पर चार बाण और यम पर कई बाण चलाए। क्रोधित यम के नथनों से बड़ी-बड़ी लपटें निकलीं। मृत्यु और यम ने सोचा कि अग्नि रावणासुर को भस्म कर देगी। जब ऐसा नहीं हुआ तो उसने कहा कि वह खुद को यम के साथ रावण के हवाले कर देगी और उसका विनाश कर देगी। रावण को मारने के लिए यम ने स्वयं अपने हाथ में कलपाश उठाया, शत्रु पर आक्रमण करने के लिए कलपाश और मुद्गरम जैसे अस्त्र-शस्त्र तैयार थे।

उस विकट स्थिति को देखकर वे देवताओं के समान काँप उठे। भगवान ब्रह्मा ने यम को बचाया। भगवान ब्रह्मा ने यम से अपना क्रोध वापस लेने के लिए कहा, यह कहते हुए कि रावण निश्चित रूप से मर जाएगा यदि वह समय के कर्मचारियों का उपयोग करता है, और यदि ऐसा होता है, तो उसके द्वारा दिया गया वरदान विफल हो जाएगा। ब्रह्मा के शब्दों का सम्मान करते हुए, यम पीछे मुड़े और चले गए।

जब हम रावणासुर की कहानी में ऐसे दृश्य देखते हैं, तो यह स्पष्ट हो जाता है कि देवताओं को ब्रह्मा से कितनी परेशानी हुई। ऐसे ही कई कारणों से विष्णु राम के रूप में धरती पर आए। इससे यह ज्ञात होता है कि रावण, जो पिछले जन्म में जयविजय में से एक था, केवल श्री विष्णु से लड़ा और तीन जन्मों के बाद मर गया और श्री हरि को द्वारपालों के रूप में शामिल कर लिया। ऐसा करने का तरीका श्री हरि से युद्ध करना और प्राप्त करना है। मृत्यु, इसलिए ब्रह्मरथ हमारे कर्मफल और गणना के आधार पर लिखा गया है, इसलिए ब्रह्मा को वह लिखने में सक्षम नहीं है जैसा वह फिट देखता है। तो ब्रह्मा का लिखा रांग कहा जाता है।

 

Karma Affects Life, కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అన్ని జన్మలలో ఏది ఉత్తమమైనది

Spread iiQ8

March 25, 2023 9:38 AM

39 total views, 0 today