Anantha Vijayam Achala ahalya

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

 
Aanantha vijayam , అనంత విజయం : ధర్మరాజు శంఖము
 
Achala,అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.
 
Ahalya ,అహల్య : అహల్య గౌతమ మహర్షి భార్య.ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.

 

 

8 Evidences which prove that Ramayan is not a Myth, it is our History


Anantha Vijayam Achala ahalya

పుట్టుక– బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు.
దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే.
అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు.
అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు.
గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని.
ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.
Spread iiQ8

April 30, 2015 7:43 PM

265 total views, 1 today