Telugu Samethalu
క Telugu Samethalu
కంగారులో హడావుడి అన్నట్లు
కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు
కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
కంచేచేను మేసినట్లు
కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
కంటికి రెప్ప కాలికి చెప్పు
కంటికి రెప్ప దూరమా
కంటికి కనబడదు నూరుకు రుచి ఉండదు
కండలేని వానికే గండం
కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
కంపలో పడ్డ గొడ్డు వలె
కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు
కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
కట్టేవి కాషాయాలు – చేసేవి దొమ్మరి పనులు
కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
కణత తలగడ కాదు. కల నిజం కాదు
గాడు దీని భావమేమి తిరుమలేశ
కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు…
కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లు
కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
కలసి ఉంటే కలదు సుఖం
కల కాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడు
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
కల్లు త్రాగిన కోతిలా
కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
కాకి పిల్ల కాకికి ముద్దు
కాగల కార్యం గంధర్వులే తీర్చారు
కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
కాలు కాలిన పిల్లిలా
కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
కాసుకు గతిలేదుకానీ… నూటికి ఫరవాలేదన్నట్లు
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
‘కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?’ అంటే ‘స్వరూపాలెంచటానికి అందిట.
కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
కుక్క కాటుకి చెప్పు దెబ్బ
కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ …చెరకు తీపి తెలుస్తుందా
కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
కుక్కతోక వంకరన్నట్లు…!
కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు…
కునుకు నక్క మీద తాటిపండు..
కూటికి లేకున్నా కాటుక మాననట్లు
కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు
కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు
కోడెల కొట్లాట మధ్య దూడలు నలిగి పోయి నట్లు
కోరి కొరివితో తల గోక్కున్నట్టు
కోటి విద్యలు కూటి కొరకే
కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
కోస్తే తెగదు కొడితే పగలదు
క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
కల్ల పసిడికి కాంతి మెండు
గ Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద
గంగిగోవు పాలు గరిటడైన చాలు
గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
గంతకు తగ్గ బొంత
గతి లేనమ్మకు గంజే పానకము
గాజుల బేరం భోజనానికి సరి
గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
గుండ్లు తేలి… బెండ్లు మునిగాయంటున్నాడట
గుంపులో గోవిందా
గుడ్డి కన్నా మెల్ల నయము కదా
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
గుడ్డోడికి కుంటోడి సాయం
గుడ్డెద్దు చేలో పడినట్లు
గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
గురివింద గింజ తన నలుపెరగదంట
గుర్ఖాకు ఎక్కువ గూండాకు తక్కువ
గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..!
గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
గూటిలో కప్ప పీకితే రాదు
గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు
గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
గోడకేసిన సున్నం
గోతి కాడ నక్కలా
గోరంత ఆలస్యం కొండొంత నష్టం
గోరుచుట్టు మీద రోకటిపోటు
గాడిదకు తెలియునా గంధం పొడి వాసన;పంది కేమి తెలియును పన్నిటి వాసన
Telugu Samethalu
చ
చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
చక్కనమ్మ చిక్కినా అందమే సన్న చీర మాసినా బాగుంటుంది.
చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
చదువు రాక ముందు కాకరకాయ… చదువు వచ్చాక కీకరకాయ
చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
చనిపోయిన వారి కళ్ళు చారెడు
చల్లకొచ్చి ముంత దాచినట్లు
చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు
చాప క్రింది నీరులా
చారలపాపడికి దూదంటి కుచ్చు
చారాణా కోడికి భారాణా మసాలా
చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
చింత చచ్చినా పులుపు చావనట్టు
చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
చిత్తశుద్ది లేని శివపూజలేల
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
చెట్టు చెడు కాలానికి కుక్క మూతి పిందెలు కాసి నట్టు
చెడపకురా చెడేవు
చెప్పేవాడికి వినేవాడు లోకువ
చెరపకురా చెడేవు
చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
చెముడా అంటే మొగుడా అన్నట్టు
చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
చెవిలో జోరీగ
చేతకాక మంగళవారమన్నాడంట
చేత కానమ్మకి చేష్టలెక్కువ
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు…
చెరువు మీద అలిగి….స్నానం చేయనట్లు
చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)
ఛ
ఛారాన కోడికి బారాన మసాల.
చెపితే వినని వాడిని చెడిపోనివ్వాలి.
జ
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
జన్మకో శివరాత్రి అన్నట్లు
జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు
డ
డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
డబ్బు కోసం గడ్డి తినే రకం
డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా
డబ్బుకు లోకం దాసోహం (సామెత)|డబ్బుకు లోకం దాసోహం
డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
డౌలు డస్తు పగలు పస్తు
Telugu Samethalu
Telugu Samethalu Telugu Proverbs from A to Am | iiQ8 From అ to అం
ఢ
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు
డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస
డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును
Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద
త
తల్లిని మించిన దైవం లేదు
తంగేడు పూచినట్లు
తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
తంబళ అనుమానము
తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
తగిలిన కాలే తగులుతుంది
తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
తడిశిన కుక్కి బిగిశినట్టు
తడిశి ముప్పందుం మోశినట్టు
తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
తనకు కానిది గూడులంజ
తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
తడి గుడ్డతో గొంతులు కొయ్యడం
తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
తల లేదు కానీ చేతులున్నాయి… కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
తల ప్రాణం తోకకి వచ్చినట్లు
తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
తవుడు తింటూ వయ్యారమా?
తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
తాతకు దగ్గులు నేర్పినట్టు
తాదూర సందు లేదు, మెడకో డోలు
తానా అంటే తందానా అన్నట్లు
తామరాకు మీద నీటిబొట్టులా
తాను దూర సందు లేదు తలకో కిరీటమట
తినటానికి తిండి లేదు మీసాలకు సంపెంగ నూనె
తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి
తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
తిట్టను పోరా గాడిదా అన్నట్టు
తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
తినగ తినగ వేము తియ్యగనుండు
తినబోతూ రుచులు అడిగినట్లు
తిన్నింటి వాసాలు లెక్కేయటం
తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
తుమ్మితే ఊడి పొయే ముక్కు ఉన్నా ఒక్కటె ఊడినా ఒక్కటె
తూట్లు పూడ్చి… తూములు తెరిచినట్లు…
తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
తేలు కుట్టిన దొంగలా
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
తోక తెగిన కోతిలా
తోక త్రొక్కిన పాములా
తోక ముడుచుట
తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
Telugu Samethalu
ద
దండం దశగుణం భవేత్
దంపినమ్మకు బొక్కిందే కూలిట|దంచినమ్మకు బొక్కిందే దక్కుదల
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
దానం చేయని చెయ్యి… కాయలు కాయని చెట్టు…
దాసుని తప్పు దండంతో సరి
దిక్కులేనివారికి దేవుడే దిక్కు
దిగితేనేగాని లోతు తెలియదు
దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
దున్నపోతు మీద వానకురిసినట్లు
దురాశ దుఃఖానికి చేటు
దూరపుకొ౦డలు నునుపు
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
దొందూ దొందే
దొరికితే దొంగలు లేకుంటే దొరలు
ధ
ధర్మో రక్షతి రక్షితః
ధైర్యే సాహసే లక్ష్మి
Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద