Who is Dushala and Saindhav in Mahabharata | iiQ8 info

Who is Dushala and Saindhav in Mahabharata

Image Who is Dushala and Saindhav in Mahabharata

Who is Dushala and Saindhav in Mahabharata

కౌరవుల ఏకైక సోదరి దుస్సల. ఈమె భర్త సైంధవుడు. ధృతరాష్ట్రునికి, ఒక వైశ్య వనితకి జన్మించినవాడు యుయుత్సుడు. కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షాన పోరాడాడు. అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడుఅయిన పరీక్షిత్తునకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు

Who is Dushala and Saindhav in Mahabharata

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

ఈ వందమందిలో పదహారో వాడు వికర్ణుడు గంజాయి వనంలో తులసిమొక్క టైపు. ద్రౌపదిని సభలో అవమానిస్తూ ఉంటే తప్పు అని గొంతు ఎత్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఇతడిని చంపుతుంటే భీముడు ఏడ్చాడట.

హా అంత మంది ఉన్న సభ లో ఒక్క వికర్ణుడు మాత్రమే మాట్లాడు కానీ దుర్యోధనుడు ముందు అతని మాట సాగలేదు. కానీ ఆ రోజు భీముడు చేసిన ప్రతిజ్ఞ వల్ల భీముడు నూరు మంది కౌరవుల నీ హతమార్చాడు

Who is Dushala and Saindhav in Mahabharata

సైంధవుడు / Jaydratha :

సైంధవుడు లేదా జయధ్రదుడు (సంస్కృతం: जयद्रथ) మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సలకి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు.

ప్రస్థావనము
సైంధవుడు సింధుదేశపు రాజు. దుర్యోధనుని చెల్లెలు అగు దుస్సల భర్త. ఇతని తండ్రి వృద్ధక్షత్రుఁడు.

Sri Lalitha Sahasranama Stotram | శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం iiQ8 Devotional

Who is Dushala and Saindhav in Mahabharata

జయద్రధుడు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒకనాడు అశరీరవాణి, ఇతను యుద్ధంలో ఏమరుపాటులో ఉండగా వీనికి శిరచ్ఛేధం జరుగుతుంది అని పలికింది. అది అతని తండ్రియైన వృద్ధక్షత్రుఁడు విని ఎవరైతే వీని తలను భూమిమీద పడవేస్తారో అట్టివాని తల వేయి ముక్కలగుగాక అనే శాపం పెడతాడు. ఆ హేతువునుబట్టి భారతయుద్ధమున అర్జునుఁడు సైంధవుని తల శమంతపంచక సమీపమున తపము చేసుకుంటున్న వృద్ధక్షత్రుని ఒడిలో పడేటట్లు పాశుపతాస్త్రప్రయోగము చేశాడు.

సైంధవుడు దుష్ప్రవర్తన-పరాభవం
పాండవులు జూదంలో ఓడి పోయి మాట ప్రకారం వనవాసం చేస్తుంటే సైంధవుడు పాండవులు వనవాసం చేసే చోటికి వెళ్ళి పాండవులు లేని సమయం లోద్రౌపదిని చేబట్ట ప్రయత్నిస్తాడు. అప్పుడు భీముడు వాడిని చూసి వాడితో యుద్ధం జరిపి ఓడించి చంపబోతాడు. కాని యుధిష్టరుడు మాట ప్రకారం భీముడు జయధ్రదుని చంపకుండా వదిలి వేసి పరాభవం క్రింద గుండు గొరిగిస్తాడు.

Ornaments Worn by Sri Ram Lalla in Ayodhya | iiQ8 info Gold Jewelry of Shri Ram

సైంధవుడు శివుని గురించి తపస్సు
పరాభవించబడ్డ సైంధవుడుడి చాలా దుఃఖించి పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడు అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుని తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు.

https://sharemebook.com/  https://sharemebook.com/  https://sharemebook.com/

చక్రవ్యూహం పన్నడం – సైంధవుడు అడ్డగించడం
మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరపు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని ప్రక్కకి తప్పించడానికి ఒక ప్రణాళిక వేసి ఇద్దరౌ రాజులను అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు (జయధ్రదుడు) శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు. ఎంతో వీరోచితంగా పోరాడినా అభిమన్యుడు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవలు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేన శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రమాణం చేస్తాడు.

Sri Lalitha Sahasranama Stotram | శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం iiQ8 Devotional

సైంధవ వధ
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది. సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి అర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం పన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతితుడయి సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

Why is it Ram Why Ramayana Why temple for Ram ? iiQ8 రాముడే ఎందుకు ? రామాయణం ఎందుకు ? రాముడికి గుడి ఎందుకు

Spread iiQ8

March 6, 2024 3:31 PM

379 total views, 0 today