5 Types of couples in this world in Telugu, ప్రపంచంలో 5 రకాల జంటలు

5 Types of couples in this world in Telugu, ప్రపంచంలో 5 రకాల జంటలు

 

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు.

There are billions and billions of couples in this world but they all have 5 types.

*First – Couple* *మొదటి – జంట*

*లక్ష్మీనారాయణులు*
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట

 

*Second – Couple* *రెండవ – జంట*
*గౌరీశంకరులు* అర్థనారీశ్వరరూపం,
తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

 

*Third – Couple* *మూడవ – జంట*
*బ్రహ్మ సరస్వతుల జంట*
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా
ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

 

*Fourth- Couple* *నాల్గవ – జంట *
*ఛాయా సూర్యులు* సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

 

*Fifth- Couple* *ఐదవ – జంట*
*రోహిణీ చంద్రులు*
రోహిణీ కార్తెలో
రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

మీ🙏శ్రేయోభిలాషి

 

10 Reasons to Celebrate Haldi Ceremony, Is it Important For Bride And Groom

——————————-

. *యద్భావం తద్భవతి* . *Yadbhava Tadbhavati*
➖➖➖✍️

*ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.*

*బుద్ధి బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.*

*ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.*

*అంతేకాకుండా ఒకరి మేలు కోరుకుంటే మీకు మంచే జరుగుతుంది. అని నేనెవరినైనా ఏదైనా అన్నప్పుడు నా నేస్తం నాకు పదే పదే చెప్పేమాట ఇది…*

*ఎందుకంటే…*

*ఈ సృష్టిలో మనం మనస్పూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం అని వారి విశ్వాసం, సమాజానికి, ప్రకృతికి మనం ఏది ఇస్తామో దానికి పదింతలు లభిస్తుందని వారి ఉవాచ…*

*నిజమే కదా…*
*చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు, ఫలాలు ఇస్తుంది. సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా…*

*కనుక ఈరోజు నుండి ఎవరైనా సరే కయ్యానికి కాలు దువ్వకుండా వారి బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి. నేను అలాగే కోరుకుంటున్నాను…*

*అందుకే కదా*

*భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.*

*యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.*

*మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పడం, దాన్ని ఆచరించి చూపడం వరకే మన ధర్మం, బాధ్యత కూడా.*

*🌻లోకాసమస్తా సుఖినోభవంతు🌻*

*🕉️ఓం నమో నారాయణాయ🕉️*

Lord Karthikeya Names with Meanings in English, Lord Muraga Names with Meaning

 

————.

🪷📖 భగవద్గీత 📖🪷 🪷📖 Bhagavad Gita 📖🪷
🔆🔅🔆 🔅🔆🔅 🔆🔅🔆

అనాదిమధ్యాంతమనంత వీర్యమ్
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ ।
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ।।

 

అనాది-మధ్య-అంతం — మొదలు మధ్య చివర లేకుండా;
అనంత — అనంతమైన;
వీర్యమ్ — శక్తితో;
అనంత — అసంఖ్యాకములైన;
బాహుం — చేతులు;
శశి — చంద్రుడు;
సూర్య — సూర్యుడు;
నేత్రమ్ — కన్నులుగా;
పశ్యామి — దర్శిస్తున్నాను;
త్వాం — నీవు;
దీప్త — ప్రజ్వలిస్తూ;
హుతాశ — విరజిమ్ముతూ;
వక్త్రం — నోటి (ముఖము) నుండి;
స్వ-తేజసా — నీ తేజస్సు చే;
విశ్వం — విశ్వము;
ఇదం — ఈ యొక్క;
తపంతమ్ — తపింపచేయు.

Translation:-
BG 11.19: నీవు ఆది-మధ్య-అంతము లేనివాడవు; నీ శక్తులు అపరిమితమైనవి. నీకు అనంతమైన బాహువులు కలవు; సూర్యచంద్రులు నీ నేత్రములు వంటివి మరియు అగ్నినీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి, నిన్ను , నేను దర్శిస్తున్నాను.

How to Join MahaShivRatri 2023 Isha Yoga Center, Register Attend In-Person

Commentary:-
పదహారవ శ్లోకంలో, భగవంతుని విశ్వరూపమును చూసిన అర్జునుడు, దానికి ఆది-మధ్య-అంతము లేవు అన్నాడు. దాన్ని చూస్తున్న ఉద్వేగంలో, అదే విషయాన్ని కేవలం మూడు శ్లోకాల తరువాతే మరలా చెప్తున్నాడు. ఏదేని ఒక వాక్యాన్ని తన్మయత్వంలో పదేపదే పలికితే, దానిని విస్మయాన్ని వ్యక్తీకరించటం అనుకోవాలే తప్ప సాహిత్యపరమైన తప్పుగా పరిగణించరాదు. ఉదాహరణకి, ఒక పాముని చూసినప్పుడు, వ్యక్తి ఇలా అరవచ్చు, “చూడండి, పాము! పాము! పాము!” అని. అదే విధంగా అర్జునుడు ఇక్కడ ఆశ్చర్యములో అన్నదే మళ్లీ అంటున్నాడు.

భగవంతుడు యదార్ధముగానే ఆది అంత్యము లేని వాడు. ఇది ఎలాగంటే, ఆకాశము, కాలము మరియు కారణబలము అన్నీ ఆయన యందే ఉన్నాయి. కాబట్టి ఆయన వాటన్నిటికీ అతీతుడు. ఆయనను పరిమాణములో కానీ, కాలములో కానీ లేదా కారణత్వములో కానీ బంధించలేము (ఇంత అని చెప్పలేము). అంతేకాక, సూర్యచంద్రులు, నక్షత్రములు తమ శక్తిని ఆయన నుండే పొందుతాయి. ఈ విధంగా, ఈ విశ్వమునకు వేడిమిని వీటి ద్వారా ఇచ్చేది ఆయనే.

What is Rudraksha Diksha initiation, Sadhguru Isha Foundation

🪷🪷🙏🍁 🕉️ 🍁🙏🪷🪷

 

108 Names of Lord Muruga, 108 Names Of Lord Kartikeya

Spread iiQ8

December 1, 2022 9:09 AM

380 total views, 1 today