Why is it Ram Why Ramayana Why temple for Ram
*రాముడే ఎందుకు ? రామాయణం ఎందుకు ? రాముడికి గుడి ఎందుకు ?* Why is it Ram Why Ramayana Why temple for Ram
తెల్లవారితే పట్టాభిషేకం !
అంతలోనే తండ్రి ఆదేశం అడవులకు వెళ్ళమని !
అంతే! మారు మాటాడలేదు
తండ్రి ఆదేశాన్ని శిరసావహించాడు! తనను ఎదిరించగల వీరుడెవ్వడూ లేడు ! తండ్రితో సహా ! కానీ జన్మనిచ్చిన తండ్రికంటే దైవంలేదు ఆయనకు ! మౌనంగా బయటకు నడిచాడు.
అప్పటిదాకా మానసికంగా ఉన్న స్థితి నుండి అకస్మాత్తుగా వేరే స్థాయికి మారాల్సి వచ్చింది.
అయినా కళవళ పడలేదు.
తండ్రిమీద తిరుగుబాటు చేయలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు !
లక్ష్మణుడు ప్రేరేపించినా పూనుకోలేదు.
పైగాతమ్ముడికి బుద్ధిచెప్పాడు !లక్ష్మణుడు కోపంతో తండ్రిని, కైకని, భరతుణ్ణి వధిస్తాను అని అంటే, అతడ్ని వారించి ధర్మమార్గము ఏమిటో చెప్పి శాంతింప చేసాడు శ్రీరాముడు.
.
Change management అని ఇవ్వాళ మనం చెప్పుకునేది ఇక్కడ చూడవచ్చు. ఒక్క చిన్న మార్పు అనుకోనిది అయితేనే విలవిలలాడిపోతాం !
తండ్రిమాట వినడమే ధర్మం ఆ ధర్మానికే కట్టుబడ్డాడు !
సింహాసనం ఎక్కు! …సరే నాన్నగారూ
అడవులకు వెళ్ళు !…సరే నాన్నగారూ
Why is it Ram Why Ramayana Why temple for Ram
Arunachalam Giri Pradakshina | అరుణాచలం వెళ్లేవారికి కొన్ని వివరాలు – iiQ8 Devotional
ఇదీ రాముడంటే
వనవాస వ్రతదీక్ష ప్రారంభించడానికి స్నానం చేయాలి !
ఆ సమయంలో అక్కడ పట్టాభిషేకం చేసేటప్పుడు తనను అభిషేకించటానికి అవసరమయ్యే జలాలు అందుబాటులో ఉన్నాయి.
వాటిని రాముడు ముట్టుకోలేదు. ఎందుకూ ?
అవి రాజ ద్రవ్యము అందుచేత ముట్టుకోరాదు ! తానిప్పుడు వనవాసిగానే బ్రతకాలి.
వనవాస వ్రత స్నానం చేయడానికి వేరే నీటిని మాత్రమే వాడాడు రామచంద్రుడు.
పదవిపోయినా పాత అధికారనివాసాలు పట్టుకుని వేళ్ళాడే వారు, తండ్రి పదవి అడ్డంపెట్టుకొని అడ్డగోలు వేషాలు వేసేవారు,
ఇలాంటివారిని ఎంతమందిని రోజూ చూస్తున్నాం !
అధికారం లేకపోయినా కూడా అడ్డదిడ్డంగా అధికార ప్రదర్శన చేయాలని తహతహలాడే వారు మన వీధి బయటకు వెళితే కోకొల్లలు.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని, లేని అధికారాన్ని కల్పించుకొని లేనిపోని హడావిడి చేసే మననాయకులు రాముడినుండి రామాయణం నుండి నేర్చుకోవాలి ! రాజకీయాలలోకి వచ్చే ప్రతి మనిషి రామాయణం అధ్యయనం చేయాలి.
శరీర ఆకర్షణ కామం!! దాన్ని ప్రేమగా పొరబడి తప్పటడుగులు వేస్తున్న నేటి యువసమాజానికి ధర్మబధ్దమయిన కామం అంటే ఏమిటో తెలియచేస్తుంది రామాయణం.
అన్నగారి భార్యతో, పరస్త్రీలతో,
సంభాషించేటప్పుడు ఎలా మెలాగాలో ఇంద్రియనిగ్రహం అంటే ఏమిటో లక్ష్మణుడు చూపెడతాడు.
తనదికాని రాజ్యాన్ని తృణప్రాయంగా ఎలా వదులుకోవాలో భరతుడు చూపుతాడు.
బిడ్డలకు ఏ ఉపదేశం ఇవ్వాలో తల్లి కర్తవ్యమేమిటో సుమిత్రా మాత చూపెడుతుంది
మిత్రుణ్ణి ఎలా ఆదుకోవాలో,మిత్రత్వం ఎలా నెరపాలో రామ గుహుల, రామ సుగ్రీవుల మైత్రి తెలియచేస్తుంది.
ఏ పని ఎప్పుడు చేయాలో ఎంతవరకు చేయాలో, ఎదుటివారి శక్తి సామర్ధ్యాలు ఎలా అంచనా వేయాలో హనుమంతుడు చూపెడతాడు.
ఎట్టి విపత్కర పరిస్థితిలో కూడా ధైర్యంగా నిలబడటం ఎట్లాగో సీతమ్మ చూపిస్తుంది.
పదునైన పళ్ళమధ్యలో తెలివిగా ఉండే నాలుక లాగా క్రూరులైన రాక్షసుల మధ్యలో తాను ఒకడిగా ఉండికూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడం ఎలాగో విభీషణుడు చూపెడతాడు.
ఇన్ని పాత్రలు ఎన్నో వైవిధ్యాలు జీవన సంఘర్షణలు ఎంత అద్భుతంగా చిత్రించారు వాల్మీకి మహర్షి అనే ఆశ్చర్యం కలుగకమానదు రామాయణం ఆమూలాగ్రం చదివితే !
.
రామాయణం ఒక అపార పారావారం
ఎన్నొ రత్నాలు మనకు దొరుకుతాయి!
అందులో మునిగి తేగల సత్తా మనలో ఉంటె!
.
అంతేనా !!!!!
మానవీయ విలువల భాండాగారం రామాయణం.
.
అందుకు రాముడు !
అందుకు రామాలయం !!!
*బోలో రామచంద్రమహరాజ్ కీ జై*
💐💐💐
Why is it Ram Why Ramayana Why temple for Ram
Maha Shivaratri 2024 at Isha Yoga Center | Online Registration for MahaShivRatri Sadhguru
*Why is it Ram? Why Ramayana? Why temple for Ram? *
Whites are the coronation !
In the meantime, father’s order to go to the forests!
That’s it! No other word has been said
Father obeyed the order! No hero can stand against him ! Including the father ! But there is no god for him than the father who gave birth to him! He walked out quietly.
Had to suddenly change from a mental state to a different level.
And yet there is no art.
Did not rebellion against the father. Didn’t get that idea at all !
Even if Lakshman provoked, he didn’t do it.
He has taught a lesson to the elder brother! When Lakshman said that he will kill his father, Kaika and Bharatunna with anger, Sri Ram made him calm by telling them what is the path of righteousness.
.
We can see here what we call change management. If a small change is not expected, we will cry!
Listening to the father’s words is the right thing. He was bound to that right thing!
Climb up to the throne! … It’s ok father sir
Go into the woods !. It’s ok father sir
This is what Ram means
Need to take a bath to start the exile strike!
At that time there were the necessary waters to anoint him during his coronation.
They were not touched by Rama. Why is it?
They are royal liquid so don’t touch them ! Then he should have lived like a wild man.
Ramachandra used only other water to bath in the exile vratha.
Even if they lose their position, they hold the old unofficials and hang themselves, those who do obstructing their father’s position and do obstructive roles,
We see so many people like this everyday!
Those who are trying to show their power even if they don’t have power, they will be shocked if they go out of our street.
Our leaders who are in a hurry by obstructing the power and providing the power that is not there should learn from Ram and Ramayanam! Every person who comes into politics should study Ramayana.
Body attraction lust!! Ramayanam will teach today’s youth society which is misleading it with love and taking wrong steps.
With brother’s wife and other women,
Lakshmanu will show what is Indriyanigraham in Melaga while conversing.
The Indian shows how to leave the kingdom which is not his very own.
Shri Ram Pran Pratishtha Live | iiQ8 What time is Ayodhya Pran Pratishtha ? Watch Online Live
Sumitra Mata shows what advice should be given to her children
How to save a friend, how to fulfill friendship, Rama Guhula, Rama Sugrivula friendship will teach you.
Hanuman will show which work should be done when and how much should be done, how to assess the power capabilities of others.
Seetamma shows how to stand bravely in any calamity situation.
Just like a wise tongue between sharp teeth, the savage shows how to fulfill his duty even though he is one among cruel monsters.
So many characters, so many differences, life struggles, how beautifully you have portrayed Valmiki Maharshi, if you read Ramayanam Amulagram!
.
Ramayana is a great week
So many gems we can find!
If we have the power to dive in it!
.
Is that it !!!!!
Ramayanam is the repository of human values.
.
That is why Ramudu!
That is why Ramalayam !!!
*Say Hail Ramachandra Maharaj*
Why is it Ram Why Ramayana, Why temple for Ram
प्राण प्रतिष्ठा और संबंधित आयोजनों का विवरण | iiQ8 Jai Shri Ram Temple Ayodhya
Ayodhya Ram Temple Prana Pratishtha Details | iiQ8 Jay Shri Ram
https://sharemebook.com/ https://sharemebook.com/ https://sharemebook.com/