There is someone inside us, The real one , *మన తలరాత మార్చే గీత*
Here are the details of ” There is someone inside us, The real one , *మన తలరాత మార్చే గీత*
*మన తలరాత మార్చే గీత*
*మన లోపల ఒకడు ఉన్నాడు…. అసలైన వాడు.*
There is someone inside us, The real one , *మన తలరాత మార్చే గీత*
*కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు..*
*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..!*
*ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..*
*ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం….ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..*
*” కామ ఏష క్రోధ ఏష రజో*
*గుణ సముద్భవహ “*
*ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..*
*కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.
*ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor….ఇంకా మనం First floor కు రాలేదు…..మనం Ground floor లో ఉన్నాం.*
*మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*
*అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*
*బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం….. ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం….. ఇంకా Ground floor లోనే ఉన్నాం.*
*ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*
*ఆ floor పేరు ‘సత్వ గుణం..’*
*ఈ floor చాలా పెద్దగా ఉంటుంది….హాయిగా ఉంటుంది……*
*ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*
*అయితే చిన్న సమస్య……. ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*……
*వాడు…*
*మంచి దొంగ…..వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు మీకు Third floor కు దారి చూపిస్తాడు… ఆ floor పేరు శుద్ధ సాత్వికం…. ఇదే చివరిది….. ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది…. ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..*
*అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*
*చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక Lift* ఉంది.
*ఆ Lift పేరే “భగవద్గీత”.*
*గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.*
*పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..*
There is someone inside us, The real one , *మన తలరాత మార్చే గీత*
Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు
Family Tree of Shri Ram, Lord Sri Rama’s Family Tree, శ్రీ రామ చంద్రుడి వంశ వృక్షము
Excellent information about Lord Krishna, iiQ8
Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా “గీత” అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
There is someone inside us, The real one , *మన తలరాత మార్చే గీత*