Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే

 రామకృష్ణుడికి ఈర్శే *Tenali Ramakrishna Stories in Telugu

 

నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ – భర్త చిన్నతనములోనే ‘ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక, పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది. రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన ‘మొల్ల’ యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు.

కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా – పురుషులతో సమానంగా కవిత్వం చెప్పే స్రీలన్నా మగవారి కంటె గొప్పవారవాలనుకునే మహిళలన్నా అతనికీ మగసహజమయిన ‘యీర్ఫ్యే కాబోలు, మొల్ల పట్ల అసూయా, ద్వేషమూ పెంచుకుని రాయలవారామె రామాయణాన్నంకితం’ తీసుకోకుండా అద్దుపుల్లవేశాడు. ఐతే… అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలు. తన నగరంలోనే నివాసం ఏర్పరిచారు.

Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

నిగర్వి, తన పనులు తానే చేసుకునేదీ అయిన మొల్ల ఒకనాడు – ఒక చేత్తో కోడిపెట్టనూ, మరో చేత్తో కుక్కనూ పట్టుకుని వస్తూ ఎదురయింది.

“రూపాయిస్తాను కుక్కనిస్తావా? అర్ధరూపాయకు పెట్టనిస్తావా?” అని అడిగి – ఆమెనవమానించాలనుకున్నాడు. కాని – ఆమె కూడా సామాన్యురాలు కాదుకదా? రచయిత్రి కదా? అతని మాటలలోని ద్వంద్వార్థాలలోని అసభ్యతకు చెంపపెట్టు పెడుతున్నట్లు – “నీకు నేనమ్మను” అంది బదులు చెబుతున్నట్లు. రామలింగడు ఏ ఉద్ధేశంతో అడిగినా ఆమె జవాబు చక్కగా సరిపోతుంది. ఇక అతనేం మాట్లాడగలడు? తలవంచుకుని తన దారిన తనుపోయాడు. కాని, అతను సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

ఒకనాడు పండితసభలో మొల్ల తాను వ్రాసిన పద్యంలోని మొదటిపాదం చదివింది. తక్షణమే దానినందరూ మెచ్చుకున్నారు. రామలింగడు కూడా ఆ పద్యపాదంలో లోటు ఎంచలేకపోయాడు. మాట తొందరలో,

“రెండో పాదం ఎత్తనా?” అడిగింది మొల్ల. (ఎత్తడం అనే మాటికి- పాటెత్తడం, పాటెత్తుకోడం వంటి ప్రయోగాలున్నాయి.

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం

నెల్లూరు ప్రాంతంలో యిది ద్వంద్వార్థపు మాటకాదు) అవకాశం వస్తే వదులుతాడా రామలింగడు? “వద్దువద్దు. ఇక్కడ చాలామంది మగవాళ్లున్నారు-” అనేశాడు చటుక్కున… అతివేళాకోళంగా. సాధుస్వభావీ, స్త్రీ అయిన మొల్ల సిగ్గుపడిపోయింది- ఆమె మాటలో నిజంగా తప్పులేకపోయినా తక్షణమే తలవంచుకుని సభనుంచి వెళ్లిపోయింది. ఆ స్త్రీపట్ల రామలింగనికుండే అసూయ అప్పటికి శాంతించింది.

(మహాభక్తురాలూ… చక్కని కవయిత్రీ, సాధుస్వభావీ అయిన మొల్లమీద రామలింగడికెందుకో మరి ఈ యీర్మ్య!)

Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

 


Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

 

Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం


Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

Spread iiQ8