Telugu Moral Stories, Old TV Katha పక్కింటోడి టీవీ …! iiQ8 Stories

పక్కింటోడి టీవీ …! Telugu Moral Stories, Old TV Katha

 

Telugu Moral Stories, Old TV Katha

Telugu Moral Stories, Old TV Katha

Dear All, here is the Telugu story Telugu Moral Stories, Old TV Katha.

నేనండీ గుర్తున్నానా బుడుగువాళ్ళ చిన్నాన్న గారి అబ్బాయిని..!

పక్కింటి టీవీ టైటిల్ చూసి వీడు కథ వాళ్ళు టీవీ కొన్నప్పటినుంచి మొదలెడతాడా ఏంటి అని కంగారు పడమాకండి ఎట్టను ..!

నేను పుట్టగానే కేర్ అని ఏడ్చాను అని మొదలెడతానేమో అని కంగారుపడకండి..!

అవి నా ఏడోక్లాసు అయిపోయే ముందు మాకు వచ్చిన ఒక్కపూట బడులు…!

అమ్మా..! నన్ను , అక్కని చదువుకో , రాసుకో అని ఇబ్బంది పెట్టొద్దు, బడినుంచి రాగానే ఆడుకోవటం తప్ప ఇంకేం చెయ్యం నాన్నకు కూడా చెప్పమ్మా నువ్వే ..! (నాన్నకు మనం చెప్పలేం అందుకే అమ్మతో చెప్పించాలి అదే మ్యాజిక్కు) అది అమ్మకు నేనిచ్చే తియ్యని వార్ణింగు..!

ఇక ఆలస్యం ఎందులకు కథలోకి ఎగిరి దుమికితే ..! 😂

అర్ధం అయ్యిందిగా పాఠకులారా ..! ఒంటిపూట బడులు (హాఫ్ డే స్కూల్స్ ) , అన్నట్టు తర్వాత మాకు వేసవి సెలవులు అని కూడా గుర్తించాలి మీరు..!

అంటే ఏంటని అమాయకంగా అడగమాకండి రోజు తొమ్మిదిగంటలకు మొదలయ్యే బడి ఎనిమిదికి మొదలవ్వుధి కాబట్టి గంటముందు వెళ్లి వినే పాఠాలు వినేసి, చదివేటివి చదివేసి, హోంవర్కులు గట్రా బడిలోనే కానిచేస్తే ఒంటి గంటకి చివరి గంట..!

ఇంటికొచ్చాక పుస్తకాలు ముట్టుకునే తలనొప్పి ఉండదు అదన్నమాట విషయం.

వచ్చి రాగానే అన్నం తినేసి, ఒక గ్లాసుడు నిమ్మరసం తాగి, ఒక రెండు మామిడి పండ్లు జుర్రి, అక్కతో కలిసి అష్టాచెమ్మా తో మొదలేసి రకరకాల ఆటలు ఆడి అంత్యాక్షరితో నిద్రలోకి జారాలి..!

అది మా ప్రణాళిక…!

బావుంది కదా మా ప్రణాళిక, అనుభవం ఇంకా బావుండేది ..!

Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 

Telugu Moral Stories, Old TV Katha

 

అన్నట్టు చెప్పడం మర్చిపోయా మా ఇంట్లో ఒక రేడియో ఉంది అది మా తాతగారికి కట్నంగానో లేక బ్రిటీషువాళ్ళు వెళ్ళిపొయ్యేటప్పుడు గిఫ్ట్ గానో ఇచ్చారనుకుంటా అంత ఓల్డ్ అది, రేడియో పాతది అయినా అందులో వచ్చే పాటలు బావుండేవి, కాకపోతే మా తాతారు పెట్టినప్పుడే వినాలి, అవే పాటలు అంత్యాక్షరిలో మాకు ఉపయోగపడేవి మరి.

అలా తోచిన ఆటలు ఆడుతూ, ఆ చరణాలకు నేను పాడిన పాటకు సంబంధం లేకపోయినా అంత్యాక్షరిలో మనకు కావాల్సింది మొదటాక్షరం కాబట్టి, మనకొచ్చిన పాట ముందు ఆ అక్షరం పెట్టి పాడేసి కావాలంటే ఒరిజినల్ పాట విని మాట్లాడు అని అదరగొట్టి గెలిచెయ్యటమే..!

ఇలా సరదాగా నడుస్తున్న నా బండికి పంచర్ అయినట్టు మా ఇంటికి ఒక చుట్టం పెళ్లి పత్రిక ఇవ్వటానికి వచ్చి కార్డుతో పాటు ఒక ఉచిత సలహా ఒకటి మా నాన్న చెవిలో ఊదాడు..! అదే ఇప్పట్లో సమ్మర్ క్యాంపు అని ఇంగ్లీష్ లో అంటున్నారు అప్పట్లో దానికి పేరెట్టలేదు ఇంకేముంది వేసవి సెలవులు రాగానే ఉన్న అక్క చదుకోటానికి వేరే ఊరెళ్ళింద.

నేను ఒంటికాయ శొంఠికొమ్ములాగా ఇంట్లో ఒక్కడినే ఉండి ఏమి తోచక మామిడి పండ్లు తిని తిని సెగడ్డలు మొదలు ..! మా నాన్న డాక్టర్ ప్రెండ్స్ నన్ను తోసుకెళ్లాడు ఎందుకంటే ఆ ఆర్ఎంపి డాక్టర్ పేరుకే మనిషి కానీ వాడు ఇంజక్షన్ చేస్తే ఉంటధీ..!

Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం

మగధీర సినిమాలో హీరో కత్తిపోటుకు విలన్లు కూడా అంత అల్లాడిపోరు..! వాడు తీసుకున్న యాభై రూపాయలకు సూదితో పాటు నూటయాభై రూపాయల జాగర్తలు చెప్పాడు..! దాన్ని మా నాన్నారు మూడొందల యాభై చేసి ఎగరొద్దు, ధుమకొద్దు, నిలబడొద్దు అని ఆయనకు నాలో నచ్చని ఒక లిస్టును మగధీర చెప్పినట్టుగా మా అమ్మకి చెప్పాడు ..!

మధ్యలో మగధీర ఎందుకొచ్చాడని కంగారు పడకండి ఆర్ఎంపినే అలా పిలిచా ..! ఇంట్లో మా అమ్మ, ఆమేకుతోడు నానమ్మ, ఆమెకు తోడు పక్కింటి బామ్మ, ఇలా అందరూ నాకేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు వచ్చిన సెగడ్డలను రోజూ పొద్దున్నే చూసి ఇంకా తగ్గలేదని నిర్ధారించుకుంటే గాని అల్పాహారం కూడా చేసేటోళ్లుకాదు 🤦🏻‍♂️

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

ఇక మగదీరుడి సూచనల మేరకు ఎగరటం కుదరదు కాబట్టి పెళ్లి చూపులప్పుడు పెళ్ళికొడుకు ముందు పెళ్లి కూతురిలా జాగర్తగా కూర్చోవటం మన వల్ల అయ్యేపని కాదని నన్ను పరిచయం కోసం మా అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళింటికి నన్ను తీసుకెళ్లటం అక్కడ ఆ డింగుటకా గాడిని (ఆంటీ కొడుకు పట్నంచదువు ) చూడటం దోస్తానా కుదరటం అన్నీ చక చకా జరిగిపోయాయి కారణం వాళ్ళింట్లో టీవీ అనే ఆయుధం ఉంది.

అప్పట్లో భయంకరమైన అణ్వస్త్రం అది..! అన్నపానీయాలు కూడా ముట్టనివ్వని మాయలేడి…!తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టించగల నంగనాచి…!

Budugu Gadi Katha, Telugu Moral Stories బుడుగు గాడి కథ

చదువు అటకెక్కించగల టిక్కులాడి…!దాని మాయలో రెండు రోజుల్లోనే కూరుకు పోయా ..! పొద్దునే ఏడుకాకముందే లేచి ఏదో సూర్యగ్రహణం వస్తున్నట్టు చక చకా స్నానాదికాలు ముగించుకుని, టిఫినీలు గట్రా చేసి పై జేబులో పల్లీలు మనకు , పక్క జేబులో పల్లీలు టీవీ ఓనర్ కొడుక్కు (లంచం) ఏసుకుని వెలితే తొమ్మిదికి మొదలైన మా టీవీ యాత్ర సాయంత్రం ఏడైనా ముగిసేదు కాదు మధ్యలో ఏదో సుత్తి(యాడ్లు అని ఈమధ్యనే దానికి నామకరణం చేసినటున్నారు అప్పట్లో మేము సుత్తి అని ముద్దుగా పిలుచుకునేటోల్లం) టైం లో నాలుగు ముద్దలు మింగేసి వచ్చి సినిమాల మీద సినిమాలు చూసేవాళ్ళం..!

ఇలా నేను సినిమా జ్ఞాన సముపార్జనలో ఉండగా పట్నం నుంచి వాళ్ళ మిగతా పిల్లలు వచ్చారు.ఎందుకో మొదట్నుంచి నేనంటే వాళ్లకు నచ్చేది కాదు. పైగా నేను రాగానే టీవీ ఆప్ చేసేసే వాళ్ళు, నేను అక్కడినుంచి వెళ్ళాక మళ్ళీ పెట్టేవాళ్ళు సౌండ్ మా ఇంటిదాకా వినిపించేది..!

Swan and Owl , హంస మరియు గుడ్లగూబ , Panchatantra Telugu Friendship stories

చాల చులకనగా అదో రకంగా చూసేవాళ్లు ఆ పిల్లలు..! మా టీవీ మా ఇష్టం, మీ నాన్నని అడిగి మీరు టీవీ కొనుక్కోండి..! మీ దగ్గర డబ్బులు లేవుగాని టీవీ మాత్రం ఫ్రీగా చూస్తారా ,మా టీవీ ఎందుకు చూస్తున్నారు..! ఇలాంటి కఠినమైన మాటలకు చిన్నబుచ్చుకునే వాడ్ని..!

తెల్లారితే అదంతా మర్చిపోయి మళ్ళీ వెళ్ళేవాడిని ఎందుకో ఆటీవీ అంటే అంత ప్రేమ నాకు. ..!

వాళ్ళ పెద్దవాళ్ళు కూడా తప్పు అలా అనొద్దని చెప్పేవాళ్ళు కాదు, ఈనా డింగుటకా గాడు కూడా వాళ్ళతో కలిసిపోయాడు ఎంతైనా వాళ్లంతా ఫ్యామిలీగా ..!

నాకు చిన్నతనం అవ్వటం వల్ల వాళ్ళు నన్ను అవమానిస్తున్నారని అప్పట్లో అర్ధం కాలేదేమో, మళ్ళీ పొద్దున్నే వెళ్లి అక్కా టీవీ పెట్టవా అని అడిగేటోన్ని వాళ్ళు పెట్టను పో అనేవాళ్ళు ..!

ఇలా వెళ్తూ వస్తూ రాజా సినిమాలో వెంకటేష్ లాగా అవమానాలను దిగమింగుతూ ఎలాగైనా ఒక్క సినిమా అయినా చూడాలని సిగ్గు ఒగ్గు వదిలేసి ప్రయత్నిస్తున్న టైంలో నా బంగారు తల్లి మా అక్క మళ్ళీ మాఇంటికి వచ్చేసింది 😂.

ఇంకా ఆ బొక్కలో బ్లాక్ & వైట్ టీవీతో నాకేం పని ఎవడిక్కావాలి ఆ తొక్కలో టీవీ, పైగా పైనుంచి దేవుడు చూసి శాపం పెట్టినట్టు 9 నుంచి 6 దాకా కరెంటు కోత మొదలయ్యింది కొన్ని రోజులు టీవీ నేను చూడలేకపోతున్నా అన్న బాధకన్నా వాళ్ళు చూడట్లేదు అన్న ఆనందం ఎక్కువుండేది ..!

నేను అక్కా కలిసాం అంటే టైం తెలిసేదే కాదు ఇలా సరదాగా ఆడుకుంటుండగానే జీవితాల్లోకి కష్టాలు పోయి సుఖాలోచినట్టు ఎండలు. పోయి చల్లని వానలొచ్చాయి…!

మళ్ళీ బడులు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి మా అక్కకు ఆ టీవీవాళ్ళ గురించి చెప్తుంటే విన్నాడేమో మా నాన్న తర్వాత రోజే కొత్త కలర్ టీవీ కొనుకొచ్చాడు “ఇన్నాళ్లు మీ చదువు పాడవుతుందని టీవీ తెలీదే గాని మీ నాన్న దగ్గర డబ్బులు లేక కాదు బాగా చదువుకోండి” అని ఆరోజు మాతో మా నాన్న అన్న మాటలు ఇప్పటికి గుర్తున్నాయి.

Greedy Fox అత్యాశ నక్క, Panchatantra Telugu Friendship stories

ఇక్కడ నీతి ఏంటంటే టీవీ లాంటి ఎన్నో వ్యామోహాలకు మనం అలవాటు పడ్డా దాంట్లోనుంచి ఏదో ఒకటి మనను బైటికి లాగుతుంది మా అక్క ప్రేమలాగా..! అలాగే టీవీ వాళ్ళ లాగా అవమాన పరిచే వాళ్ళు మన జీవితంలో చాల మంది ఉంటారు, కానీ మా అక్క సమ్మర్ క్యాంపు అయిపోజేసుకుని వచ్చినట్టు మన టైం మనకొస్తుంది..!

అంతే కథ ..!

అంతా కథే..!

 

 

Snake and Crows, పాము మరియు కాకులు ,Panchatantra Telugu Friendship stories

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Spread iiQ8

February 23, 2023 3:07 PM

176 total views, 0 today