Sri Venkata Chala Mahatyam, Om Namo Venkatesha, iiQ8

Sri Venkata chala mahatyam om namo venkatesha 7 hills tirumala tirupati  మహత్యం… 🌿

🍁

…తిరుమల క్షేత్రాన్నీ… కాలి నడకతో అదిరోహిస్తే …పాప ఖర్మలన్నియూ దహించుకుపోతాయి…

🍁🍁

…శ్రీనివాసా… కరుణాసముద్రా… రాబోయే కలియుగం అత్యంత పాప భరితం కానున్నది…

 

కలియుగ మనుషుల్లో… నీతి నియమం… సత్యం… ధర్మం… శాంతి… అహింస… న్యాయం… సత్కర్మ… అనేవి నామామాత్రంగానే కనిపిస్తాయని…

 

కలియుగంలో అనేక ఉత్పాతాలు సంభవిస్తాయని… దైవ ద్రోహులు అధికం అవుతారని…

 

సాదు సజ్జనులు భయపడుతున్నారు… మహర్షులు కలవరపడుతున్నారు… ప్రభూ… రాబోయే విపరీత విపత్తుల నుంచి… సమస్త మానవాళి బైటపడే మార్గం లేదా…?

 

లొకంలొ శాంతిని నెలకోల్పే ఉపాయమే లేదా…? అని వాపోతున్నారు మహర్షులు…!

10426654 1664342477187152 5646771456385188718 n

 

 

…ఇపుడు ఆనందనిలయం మెరుపు శోభలతో… పసిడి వర్ణంతో… మెరుపులీనుతూ కనిపిస్తుంటే… ఆ ఆనంద నిలయంలోంచి… తాపసోత్తములారా…! భయపడకండి… రానున్న కలియుగం ఎంతటి విపరీత పరిమాణాలు… విపత్తుకు కారణమైనా… ఈ వెంకటాచలమును ఆశ్రయించి… నన్ను భక్తితో… శరణజొచ్చిన వారికి… ఏ ప్రమాదాలూ రావు… ఈ… “వెంకటాద్రి మహత్యం” అంతటిది…! అదిగో అటు చూడండి… ఈ… సప్తగిరిని అధిరోహించడానికి… ఒక పాపాత్ముడు… ఇపుడే… నడకదారి వద్దకు చేరుకున్నాడు అతడిని చూడండి అని… శ్రీవారి వాక్కు వినిపించింది…!

 

🍁
…అప్పుడే ఆ యువకుడు.. మాసిన దుస్తులతో…
తైల సంస్కారం లేని శిరస్సుతో… పంచ మహా పాతకాలు పట్టినవాడు… దయనీయమైన స్థితిలో… మెట్లదారి వద్దకి చేరుకొని… భక్తితో చేతులు జోడించి…ఏడు కొండలవాడా…
వెంకటరమణ… గోవింద…గోవిందా… అని ప్రార్థిస్తూ…
మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు… మరుక్షణం… భగ్గుమని అగ్నిజ్వాల పుట్టింది అతడి పాదాల అడుగునించి… మహర్షులు ఉలిక్కిపడగా… మానవుని పాదాల నించి అగ్నిజ్వాలలు ఎలా… ఉధ్భవించాయి… ఎందుకు…?

 

🍁
…అవి అగ్నిజ్వాలలు కావు మహర్షులారా… దహించుకుపోతున్న అతడి పాపాలు…
అతడి పేరు మాదవుడు… పూర్వపుణ్య ఫలం చేత… శోత్రీయ బ్రాహ్మణ వంశంలో పుట్టారు… వేదభ్యాసం చేసి… సర్వ విధ్యాపారంగతుడు ఆయ్యాడు… కానీ బుద్ది పెడదారి పట్టింది… కన్నవారిని కడగండ్లపాలు చేసి…
మహా ప్రతీవ్రతయైన భార్యని కాదని… నీచజాతిలో పుట్టిన ఒక వేశ్యతో సంపర్కం పెట్టుకున్నాడు…
మద్యపానం… మాంసాహారం… జూదం… దొంగతనం…పరసతి బలత్కారం… చేయకూడని పాపాలు చేసి భ్రష్టుడయ్యాడు… నిర్జనుడు… నిరాధారుడయ్యాకా… అతడికి దైవ చింతన కలిగింది… అంతటి పాపాత్ముడు…
నన్ను దర్శించాలన్న కాంక్షతో… వెంకటాచలం చేరుకున్నాడు ఆ పాపాత్ముడు… కాలిబాటలో… మొదటి మెట్టుపై పాదం మోపగానే చూశారా… అతడి పాదాల క్రింద నుంచి… అతడి పాపాలన్నీ దహించుకు పోతున్నాయి చూశారా…!

 

🍁
…ఇది వెంకటాచల క్షేత్ర మహత్యం… “వేం” అంటే… “పాపం” “కట” అంటే… హరించు అని అర్థం…! తీరి పావనుడైన మాదవుడు… బ్రహ్మ తేజస్సుతో… ప్రకాశిస్తూ వచ్చి మహర్షులకు నమస్కరించాడు…! ” ఓం నమో వెంకటేశాయా” అంటూ మాదవుడుని… శ్రీవారి ఉపదేశం పూర్తవుతుండగా… పాపాలన్నీ ఆశర్వీదించారు తిరుమలేశుడు …!

 

🌿…ఓం నమో వెంకటేశా… నమో నమహ…🌿

 


Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8


Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami


How to Donate / Contribution to Shri Rama Temple construction in India


Ayodhya Shri Ram Mandir Bhoomi Pujan – అయోధ్య శ్రీ రామ్ మందిర్ భూమి పూజ!


Kanchi Paramacharya Vaibhavam, Telugu lo devotional news data, iiQ8


 

 

Spread iiQ8

January 5, 2016 8:33 PM

359 total views, 1 today