Sri Bhagavad Gita Telugu font, Part 17, iiQ8, Bhavad Geetha

శ్రద్దాత్రయ విభాగ యోగము (17 వ అధ్యాయము)

Sri Bhagavad Gita Telugu font, Part 17, iiQ8, Bhavad Geetha

అర్జునుడు:
కృష్ణా!శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా,రాజసులా,తామసులా?వీరి ఆచరణ ఎలాంటిది?

కృష్ణుడు:
పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక,రాజస,తామస శ్రద్ధలు ఏర్పడతాయి.

స్వభావంచే శ్రద్ధ పుడుతుంది.శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు.శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు.

సాత్వికులు దేవతలనీ,రాజసులు యక్షరాక్షసులనీ,తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు.

శాస్త్రనిషిద్దమైన తపస్సును,దారుణ కర్మలను చేసేవాళ్ళూ,దంభం,అహంకారం తో శరీరాన్నిశరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు.

ఆహార,యజ్ఞ,తపస్సు,దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి.

ఆయుస్సునూ,ఉత్సాహాన్ని,బలాన్ని,ఆరోగ్యాన్ని,సుఖాన్ని,ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి,చమురుతో కూడి,పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం.

చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని,రోగాలనూ,చింతనీ కల్గిస్తాయి.

చద్దిదీ,సారహీనమూ,దుర్వాసన కలదీ,పాచిపోయినదీ,ఎంగిలిదీ,అపవిత్రమైనదీ అయిన ఆహారం తామసము.

శాస్త్రబద్దంగా ఫలాపేక్ష లేక చేసేది సాత్విక యజ్ఞం.

ఫలాపేక్షతో,పేరు కోసం,గొప్పను చాటుకోవడం కోసం చేసేది రాజసయజ్ఞం.

శాస్త్రవిధి,అన్నదానం,మంత్రం,దక్షిణ,శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం.

దేవతలను,పెద్దలను,గురువులను,బ్రహ్మవేత్తలను పూజించడం,శుచి,సరళత్వం,బ్రహ్మచర్యం,అహింస శరీరం తో చేయు తపస్సు.

బాధ కల్గించని సత్యమైనప్రియమైన మాటలు,వేదాభ్యాసం మాటలచే చేయు తపస్సు.

నిశ్చల మనస్సు,మృదుత్వం,మౌనం,మనఃశుద్ధి కల్గిఉండడం మనసుతో చేయు తపస్సు.

ఫలాపేక్షరహితం,నిశ్చలమనస్సు,శ్రద్దతో చేయు తపస్సు సాత్వికం.

కీర్తిప్రతిష్ఠల ఆశతో గొప్పను ప్రదర్శిస్తూ చేయు తపస్సు రాజసికం.దీని ఫలితం కూడా అల్పమే.

పరులకు హాని కల్గించు ఉద్దేశ్యంతో తనను తాను హింసించుకుంటూ,మూర్ఖఫు పట్టుదలతో చేయు తపస్సు తామసికం.

పుణ్యస్థలాలలో దానం,పాత్రతను బట్టి దానం,తనకు సహాయపడలేని వారికి దానం చేయడం సాత్వికం.
ఉపకారం ఆశించి,ప్రతిఫలం కోరుతూ కష్టపడుతూ ఐనా చేసే దానం రాజసదానం.
అపాత్రదానం,అగౌరవం చే చేసే దానం తామసదానం.

 

‘ఓం”తత్”‘సత్”అనే మూడు సంకేతపదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలు.వాటి వలనే వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణులూ కల్పించడం జరిగింది.

అందుచేతనే యజ్ఞ,దాన,తపోకర్మలన్నీ ‘ఓం’కారపూర్వకం గానే చేస్తారు.

మోక్షం కోరువారు ప్రయోజనం కోరకుండా చేసే యాగ,దాన,తపోకర్మలన్నీ “తత్”శబ్దం చే చేయబడుతున్నాయి.

“సత్” శబ్దము కు ఉనికి,శ్రేష్టము అని అర్థం.నిశ్చలనిష్ట,పరమాత్ముని గూర్చి చేసే అన్ని కర్మలు కూడా “సత్”అనే చెప్పబడుతున్నాయి.

శ్రద్దలేకుండా ఏమి చేసినా “అసత్” అనే చెప్పబడతాయి.వాటివలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

 

***************

Sri Bhagavad Gita Telugu font, Part 17, iiQ8, Bhavad Geetha


Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu


Bhagavad Gita – Arjuna Vishada Yogamu, iiQ8, Sri Mad Bhagavad Geetha Part1


Bhagavad Gita in telugu main page, iiQ8 , భగవద్గీత (Bhagavad gita)

Spread iiQ8

December 24, 2015 9:01 AM

521 total views, 1 today