పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Shantanudu Shasti Devi Shakuni, శంతనుడు, షస్టీదేవి, శివగంగ, శకుని
Shantanudu : శంతనుడు —
శం = సుఖము/శుభము
తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు. అని అర్దము .
శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు.
భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు.
హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు
Shasti Devi : షస్టీదేవి —
మూల ప్రకృతిలోని అరోభాగం నుంచి జన్మించిన దేవత .
Shivagamga : శివగంగ —
బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరసుడి భార్య .
Shurabhi : సురభి —
దేవతల గోవు
శకుని –Shakuni :
గాంధార రాజైన సుబలుని కుమారుడు . సుబలుడు తన కుమార్తెలైన గాంధారి , సత్యసేన , సత్యవ్రత మొదలైన వాళ్ళను ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహము చేసాడు .
శకుని మహాభారతంలో గాంధారి కి తమ్ముడు.
దుర్యోధనుని మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు.
శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు.
దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు.
ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించినది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని బోధించినది కూడా ఇతడే. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించిరి.