Parmathma Swarupam, పరమాత్మ స్వరూపం !

parmathma swarupam పరమాత్మ స్వరూపం ! 
yoga%2B%2B(3)

 

హిందూ మతంలో భగవంతుని స్వరూపం మరియు సృష్టి గురించి భాగవతంలోని ద్వితీయ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్మ్హారాజుకు చెప్పాడు.  భగవంతుడిని పరమేశ్వరుడని, విరాట్పురుషుడని ఇంకా అనేక పేర్లతో హిందూమతం వర్ణిస్తుంది.
భగవంతుడు శాశ్వతుడు అంత్యకాలంలో సృష్టి ఆయనలో లీనమౌతుంది.తిరిగి భగవంతుని నుండి సృష్టి అనేకరూపాలతో ఆయననుండి ఉద్భవిస్తుంది.  హిరణ్యమయమైన భగవంతుని శరీరంనుండి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు విధాలుగా ఈ జగతిని సృష్టించాడు.
పరమాత్మ శరీరంలోని ఆకాశంనుండి ప్రవృత్తి సామర్ధ్యమైన ఓజస్సు, వేగ సామర్ధ్యం, బల సామర్ధ్యం ఉద్భవించాయి. ఆయనలోని సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణం పుట్టింది.
ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉంది. భగవణ్తుని జఠరాగ్ని నుండి ఆకలి దప్పిక పుట్టాయి. పరమాత్ముని ముఖం నుండి నోరు, నాలుక, దవడలు పుట్టుకొచ్చాయి.

నాలుక నుండి రసేంద్రియాలు ఉద్భవించాయి.ఆయన ముఖం నుండి వాగేంద్రియం పుట్టింది.వాగేంద్రియానికి అగ్ని దేవుడు అధిష్టాన దేవత అయ్యాడు.  వాగేంద్రియం నుండి సంభాషించే శక్తి పుట్టింది.ఆయనలోని వాయు శక్తి నుండి ఘ్రాణేంద్రియం పుట్టింది.
ప్రాణులకు వాసనా శక్తి వచ్చింది.ఘ్రాణేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు.పరమాత్మ ఆత్మను అవలోకించగానే నేరాలు పుట్టాయి.నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది.నేత్రాలకు సూర్యుడు అధిదేవత అయ్యాడు.దిక్కులు అధిష్టాన దేవతగా కర్ణేంద్రియాలు పుట్టాయి.
పరమాత్మ నుండి చర్మం పుట్టింది .దానికి స్పర్శా శక్తి వచ్చింది.చర్మం నుండి వెంట్రుకలు పుట్టాయి.వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి.ఆ త్ర్వాత వాయువు నుండి చేతులు ఉద్భవించాయి వాటికి ఇంద్రుడు అధి దేవత అయ్యాడు.ఆ తరవాత పాదాలు పుట్టాయి.పాదాలకు విష్ణువు అధిదేవత అయ్యాడు.పరమాత్మఆనందపారవశ్యుడు కాగానే జననేంద్రియాలు పుట్టాయి.
జననేంద్రియాల నుండి పునరుత్పత్తి శక్తి ఆవిర్భవించింది.జననేంద్రియాలకు ప్రజాపతి అధిష్టాన దేవత అయ్యాడు.మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది.దానికి నిస్సార పదార్ధాలను విసర్జించే శక్తి పుట్టింది.జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాలన్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు ఉపయోగపడుతుంది.ప్రాణ ఆపాన వాయువులు శరీరాన్ని వదిలి వేయగానే మృత్యువు సంభవిస్తుంది. క్రింది శరీరాన్ని పై శ్రీరాన్ని వేరు చేస్తూ మధ్య భాగంలో బొడ్డు ఉంటుంది.
ఆ హారాన్ని జీర్ణం చేయడానికి ప్రేవులు,రక్తప్రసరణ ఇతర కార్యాలకు నాడీ వ్యవస్థ అవతరించాయి.వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలు అయ్యాయి. పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి,సంకల్పానికి నెలవైన హృదయం జనించింది.హృదయం నుండి సంకల్పం, బుద్ధి, చంద్రుడు, కాముడు జనించాయి.
విరాట్పురుషుడి స్థూల శరీరం భూమి తేజస్సు,వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం, అవ్యక్తం అనే ఎనిమిది అనే ఎనిమిది ఆవరణలతో ప్రకాశిస్తుంది.  ఇలా శుకమహర్షి పరీక్షిత్తు భాగవతంలో భగంతుని గురించి సృష్టి గురించి వివరించాడు.
Yashoda, yaagyavalkudu యశోద యాజ్ఞవల్కుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/yashoda-yaagyavalkudu.html

 

Yudhisturudu – యుధిష్టిరుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/yudhisturudu.html

 

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Spread iiQ8

April 20, 2015 8:52 PM

660 total views, 0 today