Pariksit Puthana Pradyumnudu Raama, పరీక్షిత్తు, పూతన, ప్రద్యుమ్నుడు, పంచవటి

Pariksit Puthana Pradyumnudu Raama, పరీక్షిత్తు, పూతన, ప్రద్యుమ్నుడు, పంచవటి
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
 
Parikṣit : పరీక్షిత్తు —
అంటే అంతటా దర్శించగలవాడని అర్దము .
అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను.
ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను.
ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.
 
Puthana : పూతన —
ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది .
 
Pradyumnudu : ప్రద్యుమ్నుడు –
ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము).
ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడి కి రుక్మిణి కి జన్మించన సంతానం.
ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లొ వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య .
 
PanchavaTi , పంచవటి :
రాముడు వనవాస సమయం లో దండకారణ్యములోని ఆశ్రమము పేరు .

Raama : రాముడు —
హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు .
అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు.
రాముడు తన జీవితమునందు ఎన్ని కష్ఠములు ఎదురెనను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు.
రాముడి తండ్రి -ధశరధుడు ,తల్లి -కౌసల్య , పినతల్లులు- సుమిత్ర ,కైకేయి , సోదరులు – భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు , భార్య -సీతాదేవి . పిల్లలు -లవ కుశలు .



Spread iiQ8

May 2, 2015 7:55 PM

296 total views, 0 today