బత్తాయి – పోషక విలువలు – Orange Nutritional Values
బత్తాయి (Orange fruit) ఒక తియ్యని రూటేసి కుటుంబం కు సంబంధించిన పండ్ల చెట్టు. చూడటానికి పెద్ద నిమ్మపండు లా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని కొద్ది మంది ఒలుచుకుని తింటారు కానీ చాలా మంది దీన్ని రసం రూపంలో సేవిస్తారు.
Diabetic Test package for a period of one year Offer
ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియా దేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు.
పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు రగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు.
విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది.
ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహద పడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఈ రసం తొందరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది.
Mediterranean Diet మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి?
ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలుతాయి.
ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది.
సేకరణ : వికీపీడియా