గుడిసెలో బ్రతకడం అంత సులువా ..!
Not easy to live in a hut..!
బీమయ్య అనే రైతుకు ఓ ఎకరం సాగు భూమి ఉంది ముగ్గురు మగపిల్లలు ఒక కూతురు ఎకరం భూమిలో ప్రతి ఏటా పత్తి వెయ్యటం అలవాటు. దిగుబడి వచ్చిన సంవత్సరం ధర ఉండదు, ధర ఉన్న ఏడు దిగుబడి ఉండదు, గత పాతిక ఏండ్లుగా అదే జరుగుతుంది ఐనా ఇంకో దారి లేదు ఎందుకంటే అప్పిచ్చేవాడు పత్తిగింజల కొట్టు యజమాని, వాడి దగ్గరే కొనుక్కోవాలి వాడు ఇచ్చిన రేటుకు పత్తి వాడికే అమ్మాలి..! లేదని బైటమ్మితే అప్పు కట్టేయమని ఇంటిముందు కూర్చుంటారు…!
Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం
పిల్లల ముందు పరువు పోవద్దని, అయినోళ్ల ముందు మాట పడొద్దని దశాబ్దాలుగా జీవితాన్ని అలాగే నడిపిస్తున్నాడు, ముగ్గురు పిల్లలు బడికి ఫీజులు కట్టే స్థోమత లేక మగపిల్లలు బాగుపడితే కష్టాలు పోతాయని వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చేర్పించి కూతురుని ఉన్న ఊర్లోనే సర్కారు బడికి తోలాడు బీమయ్య, సతీమణి కూడా వ్యవసాయం లో చేదోడు వాదోడుగా ఉండేది..! కొన్నేళ్ళకు కూతురుకి మంచి సంబంధం వచ్చింది కట్నం కింద ఉన్న ఎకరంలో అరెకరం అమ్మాల్సొచ్చింది, కొడుకులు పెద్దోళ్లవుతున్నారు ఫీజులు కట్టే స్థోమత లేదు, వ్యవసాయం భారమైంది, అప్పులు పెరిగిపోయాయి, వేరే దిక్కులేక బలవంతంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు…!
ఉన్న అరెకరం భూమిలో ముగ్గురు అన్నదమ్ములు పంచుకున్నారు ఎకరం భూమికి చేసిన అప్పే ఐదెకరాల విలువ ఉంది, ముగ్గురన్నదమ్ముల్లో చిన్నోన్ని నువ్వు చదువుకోరా ఒకళ్లన్నా బాగుపడాలి అని పట్నంకి పంపారు, రెoడోవాడు మెకానిక్ పని నేర్చుకుని పక్కనే ఉన్న టౌన్ లో ఉంటున్నాడు, పెద్దోడికి కుటుంబ బాధ్యత మొయ్యక తప్పలేదు..! కొన్నాళ్లకు తల్లి పట్నంలో ఉన్న చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి అక్కడే ఉంటుంది..!
కొన్నాళ్ళకు అప్పిచ్చిన షావుకారు అప్పుకింద ఇల్లు రాపించుకున్నాడు, ఇంకో దిక్కు లేక ఊరు చివర ఉన్న పొలంలో ఓ తాటాకులతో ఓ పూరి గుడిశె వేసుకున్నారు, పెళ్లయింది ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, వ్యవసాయంలో వ్యయం తప్ప సాయం లేక ఏదో నడిపిస్తున్నారు,
వర్షాకాలం వచ్చింది పిల్లలకు బడులు ఇంకా మొదలవ్వలేదు, ఈసారి వానలు బాగా పడుతున్నాయి,వర్షాలు పడుతున్నాయని సంతోషించే లోపు, గుడిసె చుట్టూ నీళ్లు చేరాయి మట్టి గోడలు నాని మట్టి జారి బురదగా మారుతుంది, వాసాలు చెదలుపెట్టి ఎప్పుడు విరుగుతాయో అని కొత్త భయం మొదలైంది, తాటాకులు కొని కప్పుకునే స్థోమత లేదు, పోనీ వర్షాలు తగ్గిందాకా బంధువుల దగ్గర కొన్ని రోజులుందమన్నా ఆత్మభిమానం ఒప్పుకోదు
భార్య : ఏమయ్యా పిల్లలను ఈ ఊర్లో కాకుండా ఎక్కడైనా పొరుగూరులో ఉంచుదాం
సోమన్న: ఎందుకే వాళ్ళు ఎదురుగా లేకుంటే ఉండలేస్తామా..!?
Grandfather, Telugu Moral Stories తాతా మనవరాలు
భా : ఏమి లేదయ్యా ఈ గుడిసె ఎప్పుడు కూలి కిందపడుతుందో అని భయంగా ఉంది, పైగా సర్కారు బడుల హాస్టలో ఉంటె పిల్లలకు మూడుపూట్ల కడుపు నిండుతుంది ఆలోచించయ్యా,
సోమన్న : నువ్వు చెప్పింది నిజమే ఓ నాలుగు రోజులాగి ఏమైనా పైసలు సర్దుకుని వెళ్లి చేర్పిస్తా.
బోరున వర్షం, ఇల్లంతా కురుస్తుంది, బైట కొట్టంలో ఉన్న మేత అంతా తడిసిపోయింది ఆవులు తడిసిన గడ్డి తినలేక రాత్రి నుంచి పస్తులున్నాయి, ఇంట్లో ఉన్న పొయ్యి వానకు తడిసిపోయింది, పొయ్యిలో కట్టెలు తడిసిపోయాయి, అగ్గిపుల్లలు నాని వెలగట్లేదు, పిల్లలు ఆకలి అంటున్నరు తల్లికి కాళ్ళు చేతులు ఆడట్లేదు, పిల్లోడికి ఓ యూరియా బస్తా హారికంటలం కట్టి, అమ్మ : నాన్న కిరాణా కొట్టుకు పోయి, మీ నాన్న అడిగాడని ఓ సీసాడు కిరసనాయిలు, ఓ అగ్గిపెట్టె తీసుకురా..! పిల్లోడు : నేను పొనమ్మా వర్షం వస్తుంది అక్కని పో అను, అక్క : నా చెప్పులు తెగిపోయాయి నేనెల్లనమ్మా..!అమ్మ : నీ టైరు బండి వేసుకుని తొందరగా వెళ్ళు నాన్న అట్లు చేస్త తిందువు. (టైరు ఆశకు అట్ల ఆశకు పిల్లాడు తెస్తాడు
తడిసిన పొయ్యి, కట్టెలు పెట్టి కిరోసిన్ పోసి ఎలాగోలా పొయ్యి రాజేసింది, పొగఇల్లంతా ముసిరింది, కాసేపటికి ఇంట్లో ఉన్న బియ్యం పిండితో అట్లేస్తుంది అమ్మ, చలికి ఇద్దరు పిల్లలు పొయ్యికాడికి చేరారు చలికాచుకుంటూ అమ్మ పెడుతున్న అట్లని ఆవకాయ తో నంజుకుని తింటూ ఆకలిని తరిమేస్తున్నారు ..!
ఈ లోపు కాస్త వర్షం తగ్గింది పొలానికి పోయిన నాన్న ఆవులకు పచ్చిగడ్డి కోసుకొచ్చాడు కొట్టం లో ఆవులకు గడ్డేసి వచ్చి తిందామని కూర్చునే లోపే పెద్ద శబ్దంతో వానకు నానిన గోడ కూలి గుడిసె ఓ మూల కిందకు జారింది, నాలుగు కర్ర వాసాలు తెచ్చి పక్కనోళ్ళ సాయంతో ఎలాగోలా పైకి లేపి పెట్టారు, పెద్ద ప్రమాదమే తప్పింది.
Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు
భయానికి ఇద్దరి పిల్లలను తెలిసిన వాళ్ళింట్లో పడుకోబెట్టి వచ్చి భార్యాభర్తలు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకు ఓ మూలకు కూర్చున్నారు. ఆరాత్రి వాళ్ళకో విషయం అర్ధం అయింది ఈ వ్యవసాయం చేస్తూ ఇక్కడ బ్రతకలేమని, పిల్లల భవిష్యత్ కు కూడా ప్రమాదమని పట్నానికి పోయి ఏదో పనిచేసుకు బ్రతుకుదామని నిర్ణయించుకున్నారు…! ఉన్న వ్యవసాయ భూమిని పక్కనోళ్ళకు కౌలుకు ఇచ్చి వచ్చిన డబ్బులతో పట్నానికి బయలుదేరారు…!
ఓ గంట కరెంట్ లేకపోతే..!
ఓ రోజు నెట్టు రాకపోతే..!
ఓ కాసేపు ఫోన్ స్విచ్ అఫ్ అయితే ..!
ఓ అరగంట బస్సు లేటయితే ..!
ఓ నాలుగు కిక్కులకు బండి స్టార్ట్ కాకపోతే..!
ఓ సారి నడి రోడ్డుమీద కార్ ఆగిపోతే..!
ఓ పూట ఇంట్లో నీళ్లు రాకపోతే..!
ఓ ఐదు నిముషాలు స్విగ్గి ఆర్డర్ లేటయితేనే తట్టుకోలేక కంగారు పడే పట్నం మనుషుల మధ్య వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనేది కొద్ది రోజుల్లో. రాసుకొస్తా) “ఫొటోలన్నీ గూగుల్ తల్లి దగ్గర ఎత్తుకొచ్చినవి”😂🙏🏻
ఇట్లు మీ
జ్ఞానా చారీ
Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు
School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!